E-Paper
Advertisement

Umar Akmal : ఐపీఎల్ అంటేనే మ్యాచ్ ఫిక్సింగ్, బెట్టింగ్..అందుకే వ్యూయర్షిప్ ప‌డిపోయింది

Umar Akmal : ఐపీఎల్ అంటేనే మ్యాచ్ ఫిక్సింగ్, బెట్టింగ్..అందుకే వ్యూయర్షిప్ ప‌డిపోయింది
Advertisement

Umar Akmal : ఇండియన్ ప్రీమియర్ లీగ్ 2026 టోర్నమెంట్ (Indian Premier League 2026 Tournament) చాలా ఉత్కంఠ భరితంగా సాగుతోంది. ఇప్పటికే ఈ టోర్నమెంట్ లో 80% మ్యాచులు ఫినిష్ అయ్యాయి. మరో 20 శాతం మ్యాచులు జరిగితే టోర్నమెంట్ కూడా పూర్తి కానుంది. మే 31వ తేదీన ఇండియన్ ప్రీమియర్ లీగ్ 2026 టోర్నమెంట్ ఫైనల్ కూడా ఉండనుంది. అయితే ఈ నేపథ్యంలో కొంతమంది ఐపీఎల్ అంటే పడని వాళ్ళు విష ప్రచారం చేయడం మొదలుపెట్టారు. ఐపీఎల్ వ్యూయర్షిప్ ( Ipl viewership) అమాంతం పడిపోయిందని పోస్టులు పెడుతున్నారు. ఏకంగా 25 శాతం వ్యూయర్ షిప్ తగ్గిపోయిందని అంటున్నారు. ఐపీఎల్ టోర్నమెంట్ పరువు తీసేలా ప్రయత్నాలు చేస్తున్నారు. అయితే ఇలాంటి క్రమంలో ఐపీఎల్ వ్యూయర్ షిప్ తగ్గిపోవడంపై పాకిస్తాన్ మాజీ క్రికెటర్ ఉమర్ అక్మల్ (Umar Akmal ) వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. మ్యాచ్ ఫిక్సింగ్, బెట్టింగ్ (betting) కారణాల వల్ల వ్యూయర్ షిప్ తగ్గిపోయే పరిస్థితి నెలకొందని వెల్లడించారు.

Also Read: Tanveer Ahmed: ఫాతిమా సనా లాగా 15 బంతుల్లో కోహ్లీ 50 ప‌రుగులు చేస్తే, న‌*గ్నంగా తిరుగుతా !Indian Premier League 2026 Tournament

ఐపీఎల్ అంటేనే మ్యాచ్ ఫిక్సింగ్..అందుకే వ్యూయర్షిప్ ప‌డిపోయింది

Advertisement

ఇండియన్ ప్రీమియర్ లీగ్ 2026 టోర్నమెంట్ తగ్గిపోయిందని సోషల్ మీడియాలో వార్తలు వస్తున్న క్రమంలో పాకిస్తాన్ మాజీ క్రికెటర్ ఉమర్ అక్మార్ సంచలన వ్యాఖ్యలు చేశారు. ఐపీఎల్ టోర్నమెంట్ అంటేనే ఫిక్సింగ్ అని బాంబు పేల్చారు. మొదటినుంచి తాము ఇదే చెబుతున్నామని వెల్లడించారు. మ్యాచ్ ఫిక్సింగ్, బెట్టింగ్ రెండు కూడా ఐపిఎల్ టోర్నమెంట్ లో భాగమైపోయాయని ఉమర్ అక్మల్ తెలిపారు. దాని ఫలితంగానే ఇండియన్ ఫ్యాన్స్ ఐపీఎల్ చూడడం మానేస్తున్నారని ఆరోపించారు. అందుకే ఐపీఎల్ 2026 వ్యూయర్షిప్ 26 శాతం వరకు తగ్గిపోయిందని తెలిపారు. ఈ పరిస్థితి ఇలాగే ఉంటే వ్యూయర్షిప్ ఇంకా తగ్గిపోయే ప్రమాదం ఉందని హెచ్చరించారు. ఐపీఎల్ టోర్నమెంట్ కంటే పాకిస్తాన్ సూపర్ లీగ్ చాలా గొప్పదంటూ వ్యాఖ్యానించారు.

ఇప్పటికైనా అంతర్జాతీయ క్రికెటర్లందరూ ఐపీఎల్ ( IPL ) కంటే పాకిస్తాన్ సూపర్ లీగ్ టోర్నమెంట్ కు ( PSL ) ప్రాధాన్యం ఇవ్వాలని కోరారు. అప్పుడే భవిష్యత్తు అందరికీ ఉంటుందని వ్యాఖ్యానించారు. ఐపీఎల్ టోర్నమెంట్ లో డబ్బులు ఎక్కువగా వస్తాయి కానీ… పాకిస్తాన్ సూపర్ లీగ్ లో మాత్రం టాలెంట్ వెలికి తీసే ఛాన్స్ ఉంటుందని వెల్లడించారు. దీంతో ఉమర్ అక్మల్ చేసిన వ్యాఖ్యలు దుమారం రేపుతున్నాయి. అటు ఉమర్ అక్మల్ చేసిన వ్యాఖ్యలకు ఇండియన్ ఫాన్స్ కూడా కౌంటర్లు పేల్చుతున్నారు. ఐపీఎల్ 2026 టోర్నమెంట్ వ్యూయర్షిప్ తగ్గిందని ఎవడు అన్నాడు… అమాంతం పెరిగిందని వ్యాఖ్యానిస్తున్నారు. టీవీ వివర్షిప్ 50 కోట్ల మార్కు క్రాస్ చేసిందని ఆధారాలు బయటపెడుతున్నారు. టీవీ అలాగే డిజిటల్ మొత్తం కలిపి 1.1 బిలియన్ వ్యూస్ వచ్చాయని చెబుతున్నారు. డిజిటల్ విభాగంలో 15% వృద్ధి నెలకొన్నట్లు స్పష్టం చేస్తున్నారు.

Advertisement

Also Read: బంగ్లాదేశ్ ప్లేయ‌ర్ల‌కు ఫీల్డింగ్ నేర్పిస్తోన్న రిజ్వాన్‌…కీపింగ్ చేత‌కానోడు ట్రైనింగ్ ఇవ్వ‌డం ఏంటి అంటూ ట్రోల్స్‌ ( IPL )

 

 

 

Related News

పాకిస్తాన్ జ‌ట్టులో కుదుపు…ఫాతిమా స‌నా కెప్టెన్సీ గ‌ల్లంతు

ధోని లేక ఒక్కొక్క‌డి సుఖాలు ఎక్కువ‌య్యాయి..లేకుంటే గంభీర్‌, అగార్క‌ర్ తోక‌లు క‌ట్ చేసేవాడు

పాకిస్తాన్ త‌యారు చేసిన బంతుల వ‌ల్లే, ఫిఫా వరల్డ్ కప్ స‌క్సెస్!

పిక్ పాకెట్ కేసులో పాక్ క్రికెట‌ర్ హసన్ అలీ..తోలు తీసిన ఇండియ‌న్‌ పోలీసులు !

పాకిస్తాన్ ద‌య వ‌ల్లే, మేం క్రికెట్ నేర్చుకున్నాం..ఆఫ్ఘనిస్తాన్ ప్లేయ‌ర్ సంచ‌ల‌నం !

‘వరల్డ్‌కప్‌’ ఫార్మాట్‌ మార్పు వెనుక అంబానీ కుట్ర‌లు..ఐసీసీతో BCCI కుమ్మ‌క్కై !

పియూష్ చావ్లాకు న‌ర‌కం చూపించిన‌ పాక్ బ్యాట‌ర్ న‌వాజ్..ఒకే ఓవ‌ర్ లో 20 ప‌రుగులు

ఇంగ్లాండ్ కు గుడ్ బై…శ్రీలంక జ‌ట్టులో చేరిపోయిన జోఫ్రా ఆర్చ‌ర్‌?

Big Stories

Advertisement
×