E-Paper
Advertisement

Aaron Jones Fixing: టీ20 ప్ర‌పంచ క‌ప్ 2026 ప్రారంభానికి ముందే మ్యాచ్ ఫిక్సింగ్‌..USA క్రికెట‌ర్ పై బ్యాన్‌

Aaron Jones Fixing: టీ20 ప్ర‌పంచ క‌ప్ 2026 ప్రారంభానికి ముందే మ్యాచ్ ఫిక్సింగ్‌..USA క్రికెట‌ర్ పై బ్యాన్‌

Aaron Jones Fixing:  టీ20 ప్ర‌పంచ క‌ప్ 2026 టోర్న‌మెంట్ 2026 ( T20 World Cup 2026 Tournament 2026) ప్రారంబాని కంటే ముందు కీల‌క ప‌రిణామం చోటు చేసుకుంది. USA బ్యాటర్ ఆరోన్ జోన్స్ వేటు వేసింది ఐసీసీ, వెస్టిండీస్ క్రికెట్ బోర్డు. క్రికెట్ వెస్టిండీస్, ICC కు చెందిన రూల్స్ ఏకంగా ఐదు సార్లు బ్రేక్ చేశాడ‌ట USA బ్యాటర్ ఆరోన్ జోన్స్ (USA batter Aaron Jones). అంటే ఇందులో మ్యాచ్ ఫిక్సింగ్ అంశం కూడా ఉంద‌ట‌.  ఈ త‌రుణంలోనే USA బ్యాటర్ ఆరోన్ జోన్స్ పై వేటు ప‌డింది. ఈ మేర‌కు ఐసీసీ ( ICC), వెస్టిండీస్ క్రికెట్ బోర్డు ( Cricket West Indies ) రెండు కూడా USA బ్యాటర్ ఆరోన్ జోన్స్ పై చ‌ర్య‌లు తీసుకునేందుకు సిద్ధం అయ్యాయి. ప్ర‌స్తుతానికి అయితే, USA బ్యాటర్ ఆరోన్ జోన్స్ అన్ని ఫార్మెట్లు ఆడ‌కుండా తాత్కాలిక బ్యాన్ వేశారు. ఈ ఆరోప‌ణ‌ల‌పై 14 రోజుల్లో స‌మాధానం ఇవ్వాల‌ని, లేక‌పోతే ప‌ర్మినెంట్ బ్యాన్ ఉంటుంద‌ని ఐసీసీ వార్నింగ్ చేసింది.

Also Read: Iceland Trolls Pakistan: బాయ్ కాట్ పై త్వ‌ర‌గా నిర్ణ‌యం తీసుకోండి..మేం రెడీగా ఉన్నాం, కొలంబోకు టికెట్లు కొనుక్కోవాలి..పాకిస్తాన్ ను ర్యాగింగ్ చేసిన ఐస్‌ల్యాండ్‌

టి20 ప్రపంచ కప్ 2026 టోర్నమెంట్ ప్రారంభం కానున్న సంగతి తెలిసిందే. ఫిబ్రవరి 7వ తేదీ అంటే మరో వారం రోజుల్లోనే ఈ మెగా టోర్నమెంట్ షురూ అవుతుంది. ఇలాంటి నేపథ్యంలో మ్యాచ్ ఫిక్సింగ్ కథనాలు తెరపైకి వచ్చాయి. అంతేకాదు టి20 ప్రపంచ కప్ 2026 టోర్నమెంట్ ఆడడం కోసం సెలెక్ట్ అయిన USA బ్యాటర్ ఆరోన్ జోన్స్ మ్యాచ్ ఫిక్సింగ్ తో పాటు ఐదు రూల్స్ బ్రేక్ చేశాడట. బార్బడోస్ లో జరిగిన bim 10 ( Barbados T10 )టోర్నమెంటులో మ్యాచ్ ఫిక్సింగ్ మీకు పాల్పడ్డాడట USA బ్యాటర్ ఆరోన్ జోన్స్.

Barbados T10 2023-24 టోర్నమెంట్ సందర్భంగా అమెరికా క్రికెటర్ ఆరోన్ జోన్స్ మ్యాచ్ ఫిక్సింగ్ కు పాల్ప‌డ్డాడ‌ని తేలినట్లు అనుమానాలు రావడంతో అతనిపై తాత్కాలిక బ్యాన్ లేదా స‌స్పెండ్‌ విధించారు. ఈ టోర్నమెంటులో మ్యాచ్ ల‌ను ప్రభావితం చేసేలా USA బ్యాటర్ ఆరోన్ జోన్స్ ప్రయత్నించాడట. దాని వల్ల మ్యాచ్ ఫలితాలు మారిపోయినట్లు గుర్తించారు. ఇతర జ‌ట్ల‌తో మ్యాచ్ ఫిక్సింగ్ చేసుకున్న కారణంగానే ఇది జరిగిందని తెలిసిందట. అయితే ఇవి అనుమానాలు మాత్రమే.

ఇక మ్యాచ్ ఫిక్సింగ్ చేసుకునే సమయంలో ఆరోన్ జోన్స్ కు డబ్బు ఆశ చూపారట ఫిక్సర్లు. ఈ విషయాన్ని క్రికెట్ వెస్టిండీస్ లేదా అంతర్జాతీయ క్రికెట్ కౌన్సిల్ కచ్చితంగా ప్రతి ప్లేయర్ చెప్పాలి. అయితే ఈ సమాచారం ఇవ్వకుండా దాచి పెట్టాడట ఆరోన్ జోన్స్. దీనిపై విచారణ చేసేందుకు అధికారులు వస్తే, వాళ్లకు సహకరించకుండా ఎస్కేప్ అయ్యాడట. ఇలా మొత్తం ఐదు అవినీతి ఆరోపణలను యూఎస్ఏ క్రికెటర్ ఆరోన్ జోన్స్ ఎదుర్కొంటున్నాడు. ఇలాంటి నేపథ్యంలోనే ఐసీసీ యాక్షన్ తీసుకుంది. అతనిపై 14 రోజుల పాటు తాత్కాలికంగా బ్యాన్ విధించింది. అంటే తక్షణమే అతను అన్ని ఫార్మాట్ ల నుంచి వైద‌ల‌గాలి. 14 రోజుల్లో అవినీతి ఆరోపణలపై సమాధానం చెప్పాలి. ఒకవేళ ఐసీసీ అడిగిన సమాధానాలు చెప్పకపోతే అతనిపై లైఫ్ టైం బ్యాన్ పడే ప్రమాదం పొంచి ఉంది.

టీ20 ప్ర‌పంచ క‌ప్ పై ఎఫెక్ట్‌

టి20 ప్రపంచ కప్ 2026 టోర్నమెంట్ కోసం యూఎస్ఏ ప్రకటించిన జట్టులో ఆరోన్ జోన్స్ ఉన్నాడు. ఇన్ని ఆరోపణలు వచ్చినా కూడా ఆరోన్ జోన్స్ ను ఈ టోర్నమెంటులో ఆడిస్తే… తప్పుడు ప్రచారం జనాల్లోకి వెళ్లే ప్రమాదం ఉందని ఐసీసీ ఈ తీసుకుందట. మ్యాచ్ ఫిక్సింగ్ ఆరోపణలు వచ్చిన నేపథ్యంలో అతడు టి20 ప్రపంచకప్ 2026 టోర్నమెంట్ ఆడకూడదని కూడా ఐసీసీ ఆదేశాలు ఇచ్చింది. దీంతో ఆరోన్ జోన్స్ ఇండియాకు రాకుండా అమెరికాలోనే ఉండనున్నాడు.

Also Read: Boycott Pakistan: టీ20 ప్రపంచ కప్ కు ముందు పాకిస్తాన్ కు మ‌రో షాక్‌..బాయ్ కాట్ చేసిన ఆస్ట్రేలియా..ఇక న‌ఖ్వీ బిచ్చ‌గాడు కావాల్సిందే

 

 

Related News

Tanveer Ahmed: బాబ‌ర్ ను ఐపీఎల్ లోకి తీసుకోండి..వైభ‌వ్ కంటే భ‌యంక‌రంగా ఆడ‌తాడు

వైభ‌వ్ ఇంకా స్కూల్ లోనే ఉంటే బాగుండు.. వాడికి బౌలింగ్ వేయాలంటేనే భ‌య‌మెస్తోంది

Jos Buttler: న‌న్ను నంబ‌ర్ 4లో పంపి, ఆశిష్ నెహ్రానే స‌ర్వ నాశ‌నం చేశాడు !

బాబ‌ర్ పై ట్రోల్స్‌..ఇండియ‌న్స్ అనుకుని, ఆస్ట్రేలియా ఫ్యాన్స్ ను అరెస్ట్ చేసిన పాక్ !

మైదానంలోనే స్మోకింగ్..మ‌రో వివాదంలో టిమ్ డేవిడ్, ఇక ప‌ర్మినెంట్ బ్యాన్ !

టీమిండియాకు బిగ్ షాక్‌..బంగ్లాదేశ్ లోనే ఆసియా కప్ 2027, షెడ్యూల్ ఇదే

ఎలిమినేట‌ర్ లో ఓడిపోయిన‌ SRHకు ఊపిరిపోసిన పాకిస్తాన్ ప్లేయ‌ర్

రెండోసారి ఛాంపియ‌న్ గా RCB..ప్ర‌మాదంలో సూర్య‌, శ్రేయ‌స్ అయ్య‌ర్ భ‌విష్య‌త్తు !

Big Stories

×