E-Paper
Advertisement

Sci-fi Thrilller OTT : పొరపాటున కాలంలో వెనక్కెళ్ళే కుర్రాడు… క్లాసిక్ టైమ్ ట్రావెల్ మూవీ… అస్సలు మిస్ అవ్వొద్దు

Sci-fi Thrilller OTT : పొరపాటున కాలంలో వెనక్కెళ్ళే కుర్రాడు… క్లాసిక్ టైమ్ ట్రావెల్ మూవీ… అస్సలు మిస్ అవ్వొద్దు
Advertisement

Sci-fi Thrilller OTT : టైమ్ ట్రావెల్ కాన్సెప్ట్‌ తో వచ్చే సినిమాలను చూసేందుకు ఆడియన్స్ ఆసక్తిని చూపిస్తుంటారు. ఈ మధ్య టెక్నాలజీ బాగా డెవలప్ అవ్వడంతో విజువల్ ఎఫ్ఫెక్ట్స్ ని బాగానే చూపిస్తున్నారు. అయితే ఇప్పుడు మనం చప్పుకోబోయే సినిమా 1985లో వచ్చి భారీ హిట్ కొట్టింది. ఇది 1985లో ప్రపంచవ్యాప్తంగా అత్యధిక వసూళ్లు సాధించిన చిత్రంగా నిలిచింది. అంతేకాకుండా ఉత్తమ సౌండ్ ఎడిటింగ్‌కు ఆస్కార్ అవార్డును కూడా గెలుచుకుంది. ఇది ఫ్యామిలీతో కలిసి చూడటానికి పర్ఫెక్ట్ మూవీ. ఈ సినిమా పేరు, ఏ ఓటీటీలో ఉంది ? అనే వివరాలను కూడా తెలుసుకుందాం పదండి.

ఏ ఓటీటీకి ఉందంటే

1985 లో రాబర్ట్ జెమెకిస్ దర్శకత్వంలో వచ్చిన ఈ అమెరికన్ సైన్స్ ఫిక్షన్ మూవీ పేరు ‘బ్యాక్ టు ద ఫ్యూచర్’ (Back to the future). ఇందులో మైఖేల్ జె. ఫాక్స్, క్రిస్టోఫర్ లాయిడ్, లియా థాంప్సన్, క్రిస్పిన్ గ్లోవర్, థామస్ విల్సన్ ప్రధాన పాత్రల్లో నటించారు. స్టీవెన్ స్పీల్‌బర్గ్ దీనికి ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్ గా ఉన్నారు. ఇది టైమ్ ట్రావెల్ కాన్సెప్ట్‌ను ఫన్‌గా, స్మార్ట్‌గా చూపించిన మొదటి హిట్ మూవీల్లో ఒకటి. బ్యాక్ టు ద ఫ్యూచర్ ట్రైలాజీలో మొదటి భాగం. 1985లో రిలీజ్ అయిన తర్వాత భారీ సక్సెస్ అయింది. ప్రస్తుతం ఈ సినిమా netflixలో  అందుబాటులో ఉంది.

స్టోరీ ఏమిటంటే

Advertisement

మార్టీ మెక్‌ఫ్లై అనే యంగ్ బాయ్ తన ఫ్రెండ్ డాక్ బ్రౌన్‌తో కలిసి, 1985నాటి కాలంలో తన డెలోరియన్ కారును టైమ్ మెషిన్గా మారుస్తాడు. ఒక ఒక ప్రమాదకరమైన పరిస్థితిలో తప్పించుకునే క్రమంలో, మార్టీ ఆ కారులో అనుకోకుండా 30 ఏళ్ల వెనక్కి, అంటే 1955వ సంవత్సరానికి వెళ్ళిపోతాడు. అక్కడ అతను పొరపాటున తన తల్లిదండ్రులు మొదటిసారి కలుసుకునే మూమెంట్ ని అడ్డుకుంటాడు. దీనివల్ల అతని తల్లిదండ్రులు ప్రేమలో పడకపోతే, భవిష్యత్తులో మార్టీ అసలు పుట్టనే పుట్టడు. ఇక తన ఉనికిని కాపాడుకోవడానికి, మార్టీ ఎలాగైనా తన తల్లిదండ్రులను మళ్ళీ కలిపించాల్సి వస్తుంది.

అదే సమయంలో 1955లో ఉన్న డాక్ బ్రౌన్‌ను మార్టీ కలుసుకుంటాడు. అప్పట్లో టైమ్ మెషిన్‌కు అవసరమైన ప్లుటోనియం దొరకదు కాబట్టి, తిరిగి 1985కి వెళ్లడం అసాధ్యంగా కనిపిస్తుంది. కానీ పిడుగు ద్వారా వచ్చే విద్యుత్తును ఉపయోగించి తిరిగి వెళ్లవచ్చని వాళ్ళు ప్లాన్ వేస్తారు. మార్టీ తన తల్లి దండ్రులను ప్రేమలో పడేలా చేస్తాడు. చివరకు ఆ పిడుగు పడుతుందా ? మార్టీ క్షేమంగా తన సొంత కాలానికి చేరుకుంటాడా ? అనేది ఈ సినిమాను చూసి తెలుసుకోవాల్సిందే.

Advertisement

Read Also :  హోలీ పండగ రోజు ఊర్లో ఒకరు బలి… గ్రామాన్ని వెంటానే భయంకరమైన శాపం… మతిపోగొట్టే మరాఠీ ఒరిజినల్ సిరీస్

Tags

Related News

అల్లరి నరేష్ రంభ ఊర్వశి మేనక ఓటీటీ పార్టనర్ లాక్..స్ట్రీమింగ్ ఎప్పుడంటే?

కోర్టు రూమ్‌లోనే జడ్జ్‌కి మైండ్ బ్లాకింగ్ ఛాలెంజ్… క్షణక్షణం సీట్ ఎడ్జ్ మైండ్ గేమ్‌లున్న ఈ లీగల్ డ్రామా తెలుగులోనే

ఆకాశంలోనే మిస్సయిన భారీ విమానం… దిమ్మతిరిగే మిలిటరీ ఇన్వెస్టిగేషన్

చిన్నతనంలోనే ప్రపంచాన్ని చుట్టేసిన కుర్రాడి అడ్వెంచర్స్… కళ్ళు ఆర్పకుండా చూసే రియల్ డాక్యుమెంటరీ

నిధి వేట… దెయ్యాలతో ఆట… హారర్ ట్విస్ట్‌తో వస్తున్న వందల కోట్ల నవ్వుల ఫ్రాంచైజీ

పేదరికం నుంచి సామ్రాజ్యం దిశగా విజనరీ ప్రయాణం… కళ్లు చెమర్చేలా చేసే రియల్ లైఫ్ లయన్ స్టోరీ

12 ఏళ్ల ప్రయాణానికి మైండ్ బ్లోయింగ్ ముగింపు… మోటార్ ప్రపంచంలో అడ్వెంచరస్ రోలర్‌కోస్టర్ రైడ్

కుటుంబం, ప్రేమ మధ్య నలిగిపోయే క్లాసికల్ మ్యూజిషియన్ కథ… కన్నీళ్లు పెట్టించే ఎమోషనల్ జర్నీ

Big Stories

Advertisement
×