E-Paper
Advertisement

Boycott Pakistan: టీ20 ప్రపంచ కప్ కు ముందు పాకిస్తాన్ కు మ‌రో షాక్‌..బాయ్ కాట్ చేసిన ఆస్ట్రేలియా..ఇక న‌ఖ్వీ బిచ్చ‌గాడు కావాల్సిందే

Boycott Pakistan: టీ20 ప్రపంచ కప్ కు ముందు పాకిస్తాన్ కు మ‌రో షాక్‌..బాయ్ కాట్ చేసిన ఆస్ట్రేలియా..ఇక న‌ఖ్వీ బిచ్చ‌గాడు కావాల్సిందే
Advertisement

Boycott Pakistan: టి20 ప్రపంచ కప్ 2026 టోర్నమెంట్ ( T20 World Cup 2026 ) కంటే ముందు పాకిస్తాన్ కు ఊహించని ఎదురు దెబ్బ తగిలింది. ఇప్పటికే పాకిస్తాన్ కు ఐసీసీ చుక్కలు చూపిస్తున్న నేపథ్యంలో, ఇప్పుడు ఆస్ట్రేలియా ( Australia) రూపంలో భారీ నష్టం జరిగింది. రేపటి నుంచి అంటే జనవరి 29వ తేదీ నుంచి ఆస్ట్రేలియా వర్సెస్ పాకిస్తాన్ ( Australia tour of Pakistan, 2026) మధ్య మూడు టి20 సిరీస్ ప్రారంభం కానున్న సంగతి తెలిసిందే. అయితే పాకిస్తాన్ వేదిక‌గా జరగబోయే ఈ టి20 సిరీస్ కు సంబంధించిన ప్రసార హక్కులను కొనుగోలు చేసేందుకు ఆస్ట్రేలియా TV బ్రాడ్ కాస్ట‌ర్లు  ( Australian TV broadcasters ) వెనుకడుగు వేశారట. ఈ సిరీస్ కు సంబంధించిన ప్రసార హక్కులు కొనుగోలు చేయబోమని బాయ్ కాట్ ( Boycott Pakistan ) చేసినట్లు వార్తలు వస్తున్నాయి. దీంతో పాకిస్తాన్ క్రికెట్ బోర్డుకు తీవ్రస్థాయిలో నష్టం జరిగే ప్రమాదం ఉన్నట్లు చెబుతున్నారు.

Also Read: BAN PAK – T20 World Cup: PCB తిక్క కుదిర్చిన ఐసీసీ.. టీ20 ప్ర‌పంచ క‌ప్ లో పాకిస్తాన్ స్థానంలో బంగ్లాదేశ్ ఎంట్రీ ?

పాకిస్తాన్ కు మ‌రో షాక్‌..బాయ్ కాట్ చేసిన ఆస్ట్రేలియా

Advertisement

టి20 ప్రపంచ కప్ 2026 టోర్నమెంట్ ( T20 World Cup 2026) కంటే ముందు పాకిస్తాన్ క్రికెట్ బోర్డుకు ఝ‌లక్ ఇచ్చింది ఆస్ట్రేలియా టీవీ బ్రాడ్ కాస్ట‌ర్ల సంఘం. పాకిస్తాన్ వర్సెస్ ఆస్ట్రేలియా మధ్య టి20 ప్రపంచ కప్ 2026 టోర్నమెంట్ కంటే ముందు మూడు టీ20లు జరగనున్నాయి. జనవరి 29 అంటే రేపటి నుంచి ఫిబ్రవరి ఒకటో తేదీ వరకు వరుసగా నిర్వహించనున్నారు. ఇప్పటికే పాకిస్తాన్ లో ఆస్ట్రేలియా జట్టు కూడా పర్యటించి మ్యాచ్ కోసం ప్రిపేర్ అవుతోంది. అయితే ఈ నేపథ్యంలో ఈ మూడు టి20 లకు సంబంధించిన ప్రసార హక్కులను కొనుగోలు చేసేందుకు ఆస్ట్రేలియాకు చెందిన టీవీ బ్రాడ్ కాస్ట‌ర్లు ముందుకు రాలేదు. ఈ సిరీస్ హక్కులను కొనుగోలు చేసేందుకు ఆస్ట్రేలియా టీవీ బ్రాడ్ కాస్ట‌ర్లు నిరాకరించారట. కొన్ని అనివార్య కారణాల వల్ల బాయ్ కాట్‌ చేస్తున్నట్లు ప్రకటించినట్లు వార్తలు వస్తున్నాయి.

బాయ్ కాట్‌ చేయడం వెనుక కారణం ఇదే

ఆస్ట్రేలియా వర్సెస్ పాకిస్తాన్ మధ్య జరగనున్న ఈ మూడు టి20 సిరీస్ ను ఆస్ట్రేలియా టీవీ బ్రాడ్ కాస్ట‌ర్లు, బాయ్ కాట్ చేయడం వెనుక ప్రత్యేక కారణం ఉంది. రేపటి నుంచి ప్రారంభం కానున్న ఆస్ట్రేలియా వర్సెస్ పాకిస్తాన్ టి20 సిరీస్ పాకిస్తాన్ కాలమానం ప్రకారం సాయంత్రం 4:30 గంటలకు ప్రారంభం అవుతుంది. అయితే ఆస్ట్రేలియా కాలమానం ప్రకారం రాత్రి 10 గంటల తర్వాత ఈ మ్యాచ్ లు ప్రారంభం కానున్నాయి. అంటే ఆ సమయంలో ఆస్ట్రేలియాలో ఉన్న క్రికెట్ అభిమానులు అందరూ హాయిగా నిద్రిస్తారు. ఇలాంటి నేపథ్యంలో ఈ సిరీస్ కు సంబంధించిన ప్రసార హక్కులు కొనుగోలు చేస్తే ఎలాంటి లాభం లేదని బ్రాడ్ కాస్ట‌ర్లు నిర్ణయం తీసుకున్నారట. యాడ్స్ కూడా రాబోవు అని అంచనా వేసుకున్నారట. ఎన్ని కోట్లు పెట్టినా ప్రయోజనం ఉండబోదని ఆస్ట్రేలియా టీవీ బ్రాడ్ కాస్ట‌ర్లు ఈ నిర్ణయం తీసుకున్నట్లు వార్తలు వస్తున్నాయి. దానికి తోడు ఈ టోర్నమెంట్లో స్టార్ ఆటగాళ్లు కూడా లేకపోవడం మైనస్ గా మారింది. ఇప్పుడు ఇదే అంశం పాకిస్తాన్ క్రికెట్ బోర్డు కు తీవ్ర నష్టం తీసుకువచ్చే ప్రమాదం ఉంది. ఆస్ట్రేలియా టీవీ బ్రాడ్ కాస్ట‌ర్ల ద్వారా కోట్ల డబ్బులు వస్తాయని పాకిస్తాన్ క్రికెట్ బోర్డు అంచనా వేసింది అంట. కానీ చివరి నిమిషంలో వాళ్లు బాయ్ కాట్‌ చేయడంతో పాకిస్తాన్ కకావికలమవుతోంది. కాగా పాక్ వ‌ర్సెస్ ఆసీస్ మ‌ధ్య తొలి టీ20 గడాఫీ స్టేడియంలో జ‌రుగ‌నుంది.

Advertisement

Also Read: Abhishek Sharma vs Chris Gayle: అభిషేక్ శ‌ర్మ వ‌ర్సెస్ క్రిస్ గేల్..ఇందులో ఎవ‌రు రియ‌ల్ “యునివర్సల్‌ బాస్‌ “

 

Related News

ఈ ద‌ద్ద‌మ్మకు టీమిండియాపై ఆడ‌టం చేత‌కాదు…స‌ల్మాన్ సెంచ‌రీపై బాజిద్ ఖాన్ ఫైర్‌

శ‌భాష్ స‌ల్మాన్‌…నీ దెబ్బ‌కు న‌ఖ్వీ గాడి రెండు చెంప‌లు వాచిపోయింటాయ్ ?

అస‌లు నీకు బుర్ర ఉందా ? ష‌న‌కా బ్యాటింగ్ పై గ్యారీ కిర్‌స్టెన్ సీరియ‌స్‌

ఆ పాట‌లు పెట్టి ధోని న‌న్ను రెచ్చ‌గొట్టేవాడు…వీరూ సంచ‌ల‌న వ్యాఖ్య‌లు

బాబ‌ర్‌, షాహీన్‌, షాబాద్, హారిస్ రోజులు లెక్క‌బెట్టుకోవాల్సిందే…పాకిస్తాన్ నుంచి త‌రిమేసే టైమ్ వ‌చ్చింది!

2027 వ‌ర‌ల్డ్ క‌ప్ పాకిస్తాన్ కు అందిస్తా..లేక‌పోతే త‌ల న‌రుక్కుంటా ?

డ‌బుల్ సెంచ‌రీ చేయ‌కుండా ద్రవిడ్ అడ్డుకున్నాడు..స‌చిన్ సంచ‌ల‌నం !

కావ్య పాప‌ పెళ్లికి పాకిస్తాన్ క్రికెట‌ర్లు…SRHను బ్యాన్ చేయాలంటూ మ‌ళ్లీ పోస్టులు ?

Big Stories

Advertisement
×