E-Paper
Advertisement

Vaibhav Suryavanshi: వైభ‌వ్ ఊచ‌కోత‌..68 పరుగులు, అందులో 10 సిక్సర్లు..టీమిండియా విజ‌యం

Vaibhav Suryavanshi: వైభ‌వ్ ఊచ‌కోత‌..68 పరుగులు, అందులో 10 సిక్సర్లు..టీమిండియా విజ‌యం

Vaibhav Suryavanshi:  14 ఏళ్ల వైభవ్ సూర్య వంశీ ( Vaibhav Suryavanshi) మరో సరికొత్త చరిత్ర సృష్టించాడు. అత్యంత ప్రమాదకరమైన ఇన్నింగ్స్ ఆడి ప్రత్యర్థి బౌలర్లకు చుక్కలు చూపించాడు. 68 పరుగులు సాధించ‌డ‌మే కాకుండా అందులో 10 సిక్సర్లు బాది, బౌలర్లకు ముచ్చెమటలు పట్టించాడు. సౌత్ ఆఫ్రికా వర్సెస్ టీమ్ ఇడియా అండర్ 19 ( South Africa U19 vs India U19, 2nd Youth ODI), 50 ఓవర్ల మ్యాచ్ లో ఈ సంఘటన జరిగింది. టీమిండియా అండర్ 19 కెప్టెన్ గా వ్యవహరిస్తున్న వైభవ్ సూర్యవంశీ ఇవాళ జరిగిన మ్యాచ్ లో 19 బంతుల్లోనే అర్థ సెంచరీ నమోదు చేసుకున్నాడు. అంతేకాదు మొత్తం 24 బంతులు ఎదుర్కొన్న వైభవ్ సూర్యవంశీ, పది సిక్సర్లు అలాగే ఒక బౌండరీ సాధించి మొత్తం 68 పరుగులు చేశాడు. ఆ తర్వాత 68 పరుగుల వద్ద వికెట్ సమర్పించుకున్నాడు వైభవ్ సూర్య వంశీ ( Vaibhav Suryavanshi). అంటే 283.83 స్ట్రైక్ రేటుతో సత్తా చాటాడు. అదే ఊపులో వైభవ్ సూర్య వంశీ బ్యాటింగ్ చేస్తే రికార్డు సెంచరీ నమోదు కూడా చేసేవాడు. దీంతో వైభవ్ సూర్యవంశీ చేసిన అర్థ సెంచరీ వైరల్ గా మారింది.

Also Read:  BCCI-Mustafizur Rahman: ఐపీఎల్ నుంచి ముస్తాఫిజుర్ ఔట్..బీసీసీఐ కీల‌క ఆదేశాలు, రూ.9.20 కోట్లు గంగ‌పాలు

వైభ‌వ్ ఊచ‌కోత‌..68 పరుగులు, అందులో 10 సిక్సర్లు

దక్షిణాఫ్రికా వర్సెస్ అండర్ 19 టీమిండియా ( South Africa U19 vs India U19, 2nd Youth ODI) జట్ల మధ్య వన్డే సిరీస్ కొనసాగుతున్న సంగతి తెలిసిందే. ఇప్పటికే ఈ రెండు జట్ల మధ్య ఒక వన్డే పూర్తి కాగా ఇవాళ రెండవ వన్డే బెనోనోయ్ వేదికగా జరిగింది. ఈ మ్యాచ్ లో మొదటి బ్యాటింగ్ చేసిన దక్షిణాఫ్రికా 49.3 ఓవర్లు ఆడి 245 పరుగుల వద్ద ఆల్ అవుట్ అయింది. సౌత్ ఆఫ్రికా కు చెందిన జాసెన్ రోల్స్ 114 పరుగులు చేసి దుమ్ము లేపాడు. మిగిలిన బ్యాటర్లందరూ విఫలమైనప్పటికీ జాసెన్ మాత్రం అదరగొట్టాడు. ఈ నేపథ్యంలో 245 పరుగులు సాధించింది దక్షిణాఫ్రికా అండర్ 19 జట్టు ( South Africa U19 vs India U19, 2nd Youth ODI).

ఇక ఈ లక్ష్యాన్ని చేదించే క్రమంలో టీమిండియా దూకుడుగా ఆడింది. ముఖ్యం గా టీమిండియా అండర్ 19 (Team India U19) కెప్టెన్ వైభవ్ సూర్య వంశీ ( Vaibhav Suryavanshi) 24 బంతుల్లో 68 పరుగులు చేసి బీభత్సం సృష్టించాడు. దీంతో 23.3 ఓవర్లలో రెండు వికెట్లు నష్టపోయిన టీమిండియా అండర్-19 టీం 176 పరుగులు సాధించింది. అయితే వాతావరణ పరిస్థితులు అనుకూలించకపోవడంతో డక్వర్త్ లూయిస్ పద్ధతిని అమలు చేశారు. ఈ రూల్ ప్రకారం టీమిండియా 8 వికెట్ల తేడాతో విజయం సాధించింది. దీంతో ఈ టోర్నమెంట్లో వరుసగా రెండు మ్యాచ్ లు టీమిండియా, సిరీస్ కైవసం చేసుకుంది. మూడవ వన్డే జనవరి ఏడవ తేదీన జరగనుంది.

Also Read: Ravichandran Ashwin: టీ20 వ‌ర‌ల్డ్ క‌ప్ 2026 కంటే సీరియ‌ల్స్ చూడ‌టం బెట‌ర్‌..టీమిండియా ఆడ‌టం దండ‌గే

 

 

Related News

Tanveer Ahmed: బాబ‌ర్ ను ఐపీఎల్ లోకి తీసుకోండి..వైభ‌వ్ కంటే భ‌యంక‌రంగా ఆడ‌తాడు

వైభ‌వ్ ఇంకా స్కూల్ లోనే ఉంటే బాగుండు.. వాడికి బౌలింగ్ వేయాలంటేనే భ‌య‌మెస్తోంది

Jos Buttler: న‌న్ను నంబ‌ర్ 4లో పంపి, ఆశిష్ నెహ్రానే స‌ర్వ నాశ‌నం చేశాడు !

బాబ‌ర్ పై ట్రోల్స్‌..ఇండియ‌న్స్ అనుకుని, ఆస్ట్రేలియా ఫ్యాన్స్ ను అరెస్ట్ చేసిన పాక్ !

మైదానంలోనే స్మోకింగ్..మ‌రో వివాదంలో టిమ్ డేవిడ్, ఇక ప‌ర్మినెంట్ బ్యాన్ !

టీమిండియాకు బిగ్ షాక్‌..బంగ్లాదేశ్ లోనే ఆసియా కప్ 2027, షెడ్యూల్ ఇదే

ఎలిమినేట‌ర్ లో ఓడిపోయిన‌ SRHకు ఊపిరిపోసిన పాకిస్తాన్ ప్లేయ‌ర్

రెండోసారి ఛాంపియ‌న్ గా RCB..ప్ర‌మాదంలో సూర్య‌, శ్రేయ‌స్ అయ్య‌ర్ భ‌విష్య‌త్తు !

Big Stories

×