E-Paper
Advertisement

BIG Academy: బిగ్ అకాడమీ సరికొత్త విద్యా విధానం.. రేపే ప్రారంభం, బ్రాండ్ అంబాసిడర్‌గా యువరాజ్ సింగ్

BIG Academy: బిగ్ అకాడమీ సరికొత్త విద్యా విధానం.. రేపే ప్రారంభం, బ్రాండ్ అంబాసిడర్‌గా యువరాజ్ సింగ్
Advertisement

హైదరాబాద్ వేదికగా విద్యా రంగంలో సరికొత్త విప్లవానికి శ్రీకారం చుడుతూ బిగ్ అకాడమీ  తన ప్రస్థానాన్ని ప్రారంభించనుంది. “No Torture, Just Intelligent Learning: BIG Academy’s New-Age Education Mode” అనే నినాదంతో ఐఐటీ- జెఈఈ (IIT-JEE), నీట్ (NEET) లాంటి పోటీ పరీక్షలకు సిద్ధమయ్యే విద్యార్థుల కోసం ఈ నూతన విద్యా వేదికను రూపొందించారు.

హైదరాబాద్‌లోని నోవాటెల్ హెచ్‌ఐసిసి (Novotel HICC) వేదికగా 2026 జనవరి 6న ఈ ప్లాట్‌ఫారమ్ అధికారికంగా ప్రారంభం కానుంది. ఈ కార్యక్రమంలో బిగ్ అకాడమీ బ్రాండ్ అంబాసిడర్, ప్రముఖ క్రికెటర్ యువరాజ్ సింగ్ ముఖ్య అతిథిగా హాజరు కానున్నారు. పట్టుదల, క్రమశిక్షణతో కూడిన ఆయన ప్రస్థానం అకాడమీ ఆశయాలకు అద్దం పడుతుందని నిర్వాహకులు పేర్కొన్నారు.

Advertisement

ఈ ఆవిష్కరణ కార్యక్రమానికి ప్రభుత్వ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి సీవీ ఆనంద్ (IPS), హైదరాబాద్ మేయర్ గద్వాల్ విజయలక్ష్మి, బిగ్ టీవీ వ్యవస్థాపకులు, ఛైర్మన్ విజయ్ రెడ్డి, బిగ్ టీవీ మలయాళం మేనేజింగ్ ఎడిటర్ అనిల్ ఆయూర్ హాజరై ప్రొగ్రామ్ ప్రత్యేకత గురించి వివరించనున్నారు. విద్యారంగంలో ఆవిష్కరణలు, బాధ్యతాయుతమైన బోధన ప్రాముఖ్యత గురించి వీరు క్లియర్ కట్ గా వివరించనున్నారు.

బిగ్ అకాడమీ వ్యవస్థాపకులు, CEO రమణ భూపతి మాట్లాడుతూ.. కేవలం చదువును బట్టీ పట్టే విధానానికి స్వస్తి చెప్పాలని అన్నారు. విద్యార్థులకు అకడమిక్ పరంగానే కాకుండా మానసికంగా కూడా సపోర్టును ఇచ్చే వ్యవస్థను నిర్మించడమే తమ లక్ష్యమని తెలిపారు. టెక్నాలజీ, మానవ మేధస్సు కలయికతో విద్యార్థులను భావి విజయాల కోసం సిద్ధం చేస్తామని ఆయన ధీమా వ్యక్తం చేశారు.

Advertisement

ఈ ప్రోగ్రామ్ కీలక అంశాలు.. 

హైబ్రిడ్ లెర్నింగ్: డిజిటల్ పాఠాలు, ఆఫ్-లైన్ లో విద్యను అభ్యసించడం..

టెక్నాలజీ వినియోగం: పర్ఫార్మెన్స్ ట్రాకింగ్, పర్సనలైజ్డ్ మెంటార్‌షిప్ ద్వారా మెరుగైన ఫలితాలు.

సమగ్ర అభివృద్ధి: విద్యార్థులపై ఒత్తిడిని తగ్గించి, వారి మానసిక ఆరోగ్యాన్ని కాపాడుతూ నాణ్యమైన విద్యను అందించడం.

రానున్న రోజుల్లో తన సాంకేతిక సామర్థ్యాన్ని, విద్యా విభాగాలను మరింత విస్తరించాలని బిగ్ అకాడమీ యోచిస్తోంది. మరిన్ని వివరాల కోసం www.bigacademyedu.com లేదా https://www.bigacademyedu.com వెబ్‌సైట్‌ను సందర్శించవచ్చు లేదా 77102 58373 నంబర్‌ను సంప్రదించవచ్చు.

ALSO READ: MS Dhoni-Chandrababu: ఏపీలో ధోని ప‌ర్య‌ట‌న‌..చంద్ర‌బాబుతో స‌మావేశం..అస‌లు కార‌ణం ఇదే !

Related News

భార్య ప్రైవేట్ వీడియో భర్తకే పంపి.. తోటి ఆఫీసర్‌పై ఐపీఎస్ ట్రైనీ లైంగిక వేధింపులు!

Jawaharnagar: ప్లాట్ల పేరుతో భారీ మోసం.. డబ్బులతో రాత్రికి రాత్రే పరార్..!

బండి, ఈటల రాజీపడితే రాజ్యం వచ్చేస్తుందా? బీజేపీపై రాజాసింగ్ సంచలన వ్యాఖ్యలు!

చంద్రబాబు, నితీష్ మద్దతుతోనే మోడీ ప్రధాని.. విదేశాల్లో ఫోజులు తప్ప ఏం లేదు- కాంగ్రెస్ ఎంపీ!

JNTUH Inspections: మేడ్చల్‌లో హైటెన్షన్.. మల్లారెడ్డి, సీఎంఆర్ కాలేజీల్లో జేఎన్‌టీయూహెచ్ దాడులు!

El Niño Telangana: బిగ్ అలర్ట్.. తెలంగాణలో ఎన్నడూ లేని కరువు గండం..!

Transfers: అటవీ శాఖ ఉద్యోగులకు బిగ్ షాక్.. ఇటీవల జరిగిన బదిలీలు రద్దు!

Telangana PCC: ఢిల్లీని షేక్ చేస్తున్న తెలంగాణ.. టీపీసీసీకి రాహుల్ గాంధీ సీక్రెట్ టాస్క్..?

Big Stories

Advertisement
×