E-Paper
Advertisement

CM Chandrababu: ఏపీలో పర్యటించిన మారిషస్ అధ్యక్షుడు.. సీఎం చంద్రబాబు మర్యాద పూర్వక భేటీ

CM Chandrababu: ఏపీలో పర్యటించిన మారిషస్ అధ్యక్షుడు.. సీఎం చంద్రబాబు మర్యాద పూర్వక భేటీ
Advertisement

CM Chandrababu: మారిషస్ అధ్యక్షుడు ధరమ్ బీర్ గోకుల్ తో ఏపీ సీఎం చంద్రబాబు మర్యాదపూర్వకంగా భేటీ అయ్యారు. గుంటూరు జరుగుతున్న 3వ ప్రపంచ తెలుగు మహాసభలకు హాజరైన సీఎం చంద్రబాబు… ఆ కార్యక్రమం అనంతరం మారిషస్ అధ్యక్షుడితో భేటీ అయ్యారు. సీఎం చంద్రబాబు, మారిషస్ అధ్యక్షుడు వివిధ అంశాలపై చర్చించుకున్నారు. ఏపీలో చేపట్టిన అభివృద్ధి కార్యక్రమాలను సీఎం చంద్రబాబు మారిషస్ అధ్యక్షుడు ధరమ్ బీర్ గోకుల్ కు వివరించారు. ఈ సందర్భంగా మారిషస్ లో నివసిస్తున్న తెలుగు వారి యోగక్షేమాలను సీఎం చంద్రబాబు అడిగి తెలుసుకున్నారు. గతంలో మారిషస్ లో సీఎం చంద్రబాబు పర్యటించిన రోజులను ఆ దేశ అధ్యక్షుడు ధరమ్ బీర్ గోకుల్ గుర్తు చేసుకున్నారు. 3వ ప్రపంచ తెలుగు మహా సభలకు హాజరయ్యేందుకు మారిషస్ అధ్యక్షుడు ఏపీలో పర్యటిస్తున్నారు.

గుంటూరులో జరుగుతున్న 3వ ప్రపంచ తెలుగు మహాసభల్లో పాల్గొనేందుకు వచ్చిన గోవా గవర్నర్ అశోక్ గజపతిరాజును సీఎం చంద్రబాబు మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ సందర్భంగా విజయనగరం ఎమ్మెల్యే అదితి గజపతిరాజు కూడా అక్కడ ఉన్నారు.

సంక్రాంతి కంటే ముందే వచ్చిన పండుగ- సీఎం చంద్రబాబు

Advertisement

మాతృ భాషను మర్చిపోతే మనల్ని మనం కోల్పోయినట్లే అని సీఎం చంద్రబాబు అన్నారు. గుంటూరులో నిర్వహిస్తున్న 3వ ప్రపంచ తెలుగు మహా సభల్లో పాల్గొన్న సీఎం.. మాట్లాడుతూ.. మాతృభాష మన మూలాలకు సంకేతమని అన్నారు. ఈ ఏడాది సంక్రాంతి కంటే ముందు వచ్చిన పండుగ తెలుగు మహా సభలు అన్నారు. తెలుగు వారి ఆత్మగౌరవాన్ని చాటిచెప్పిన ఎన్టీఆర్‌ పేరును ఈ వేదికకు పెట్టడం సంతోషదాయం అన్నారు. దేశంలోని ఆరు ప్రాచీన భాషల్లో తెలుగు ఒకటని గుర్తుచేశారు.

Also Read:   భోగాపురం ఎయిర్ పోర్టు ఉత్తరాంధ్ర అభివృద్ధికి కనెక్టివిటీ- సీఎం చంద్రబాబు

Advertisement

హిందీ, బెంగాలీ, మరాఠీ తర్వాత దేశంలో ఎక్కువగా మాట్లాడే భాష తెలుగు అని సీఎం చంద్రబాబు అన్నారు. ప్రపంచం మొత్తంలో సుమారు 10 కోట్ల మంది తెలుగు భాషను మాట్లాడుతున్నారన్నారు. ప్రపంచ తెలుగు మహాసభలలో పాల్గొనేందుకు దాదాపు 40 దేశాల నుంచి ప్రతినిధులు వచ్చారన్నారు. కొత్త సాంకేతికతో తెలుగులో మాట్లాడితే అదే భాషలో సమాధానమిస్తాయన్నారు. తెలుగు టైప్‌ చేయడంరాని వాళ్లు ఈ టెక్నాలజీ ఉపయోగించుకునే పరిస్థితి వస్తుందన్నారు.

Related News

కాంగ్రెస్ అభ్యర్థులపై దాడులు.. చంద్రబాబు సర్కారుపై షర్మిల సంచలన ఆరోపణలు

టైం మీది కొడుతున్నారు.. రేపు మా టైం వస్తుంది: జగన్ సంచలన వ్యాఖ్యలు!

వైసీపీకి బిగ్ షాక్.. నామినేషన్ల గడువు పెంపు పిటిషన్‌ను కొట్టివేసిన హైకోర్టు!

ఇచ్చాపురం మున్సిపాలిటీలో తోటికోడళ్ల కుర్చీ పోరు.. వైసీపీ పార్టీకి బిగ్ షాక్..?

దర్శిలో హైటెన్షన్.. వైసీపీ దాడిలో SI కి తీవ్ర గాయాలు

మా ప్రభుత్వం వస్తే నేనే హోంమంత్రిని: అంబటి రాంబాబు

సీఈసీ నియామకానికి మద్దతిచ్చి తప్పు చేశాం.. విజయవాడలో జగన్ సంచలన వ్యాఖ్యలు!

సీఎం చంద్రబాబుపై జగన్ తీవ్రమైన ఆరోపణలు.. గొడ్డళ్లు సప్లై చేశారంటూ మండిపాటు

Big Stories

Advertisement
×