E-Paper
Advertisement

Vaishnavi Sharma: నా అందాల రాకుమారుడు అత‌నే..టీమిండియా ప్లేయ‌ర్ పై బోల్డ్ కామెంట్స్

Vaishnavi Sharma: నా అందాల రాకుమారుడు అత‌నే..టీమిండియా ప్లేయ‌ర్ పై బోల్డ్ కామెంట్స్
Advertisement

Vaishnavi Sharma: టీమిండియా మహిళా క్రికెటర్ వైష్ణవి శర్మ ( Vaishnavi Sharma) ఈ మధ్యకాలంలో సోషల్ మీడియాలో తెగ పాపులర్ అవుతున్న సంగతి తెలిసిందే. అతి చిన్న వయసులోనే టీమిండియా జట్టులోకి ఎంట్రీ ఇచ్చింది వైష్ణవి శర్మ. దానికి తోడు హీరోయిన్ లాగా ఉండడంతో జనాలందరూ ఆమె గురించి సెర్చ్ చేస్తున్నారు. అటు శ్రీలంక జట్టు పై జరిగిన మ్యాచ్ లలో కూడా అద్భుతంగా రాణించింది. దీంతో సోషల్ మీడియాలో వైష్ణవి శర్మ పేరు మారుమోగుతోంది. అలాంటి వైష్ణవి శర్మ తాజాగా చేసిన కామెంట్స్ వైరల్ గా మారాయి. విరాట్ కోహ్లీని ఉద్దేశించి ఆమె ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. అతడు తన ఫేవరెట్ క్రికెటర్ అంటూ వైష్ణవి శర్మ పేర్కొన్నారు.

Also Read: BCCI central contracts: రోహిత్ శ‌ర్మ‌, కోహ్లీకి షాక్‌..గిల్ కు ప్ర‌మోష‌న్‌..ఏ ప్లేయ‌ర్ ఏ లిస్ట్ లో ఉన్నారంటే ?

అతడే నా అందాల రాకుమారుడు.. వైష్ణవి శర్మ బోల్డ్ కామెంట్స్

Advertisement

టీమిండియా మాజీ కెప్టెన్ విరాట్ కోహ్లీ ( Virat Kohli) అంటే చాలా మందికి ఇష్టం అన్న సంగతి తెలిసిందే. మన ఇండియాలోనే కాకుండా ప్రపంచవ్యాప్తంగా విరాట్ కోహ్లీకి అభిమానులు ఉన్నారు. పాకిస్తాన్ వాళ్లు కూడా కోహ్లీ ఆటతీరును ఇష్టపడతారు. ఒకానొక సమయంలో విరాట్ కోహ్లీని పాకిస్తాన్ కు ఇవ్వండి అంటూ డిమాండ్లు కూడా చేశారు అక్కడి అభిమానులు. అయితే అలాంటి విరాట్ కోహ్లీపై వైష్ణవి శర్మ చేసిన వైఖ్యులు దుమారం రేపుతున్నాయి. విరాట్ కోహ్లీని మెచ్చుకుంటూనే కాస్త బోల్డ్ గా మాట్లాడింది. అతడే తన అందాల రాకుమారుడు అంటూ పేర్కొన్నారు. ప్రపంచంలోనే హ్యాండ్సమ్ క్రికెటర్ విరాట్ కోహ్లీ అని.. అతన్ని చూస్తేనే మత్తెక్కిపోతుందని పేర్కొన్నారు వైష్ణవి శర్మ. పురుషుల క్రికెటర్లలో చూడడానికి విరాట్ కోహ్లీ అద్భుతంగా ఉంటాడని వెల్లడించింది. అతని స్టైల్ ఒక లెవెల్ లో ఉంటుందని స్పష్టం చేసింది.

బ్యాటింగ్, ఫిట్నెస్, ఫీల్డింగ్, మానవతావాదం, అతని రికార్డులు అబ్బో అన్ని రంగాల్లో విరాట్ కోహ్లీ చాలా పర్ఫెక్ట్ అంటూ వ్యాఖ్యానించింది వైష్ణవి శర్మ. దీంతో వైష్ణవి చేసిన కామెంట్స్ వైరల్ గా మారాయి. ఆమె కామెంట్లకు నేటిజన్స్ రియాక్ట్ అవుతున్నారు. అనుష్క శర్మకు ( Anushka Sharma) ఎర్త్ పెట్టేలా వైష్ణవి శర్మ కామెంట్స్ ఉన్నాయని కౌంటర్ ఇస్తున్నారు. ఇప్పటికైనా విరాట్ కోహ్లీని చాలా జాగ్రత్తగా చూసుకోవాలని అనుష్క శర్మకు సూచనలు చేస్తున్నారు. లేకపోతే వైష్ణవి శర్మ లాంటి అమ్మాయి.. కోహ్లీని పడేయడం గ్యారంటీ అంటున్నారు. టీమిండియా జట్టులోకి ఇటీవల కాలంలోనే వైష్ణవి శర్మ ఎంట్రీ ఇచ్చిన సంగతి తెలిసిందే. శ్రీలంక వర్సెస్ టీమ్ ఇండియా మధ్య జరిగిన సిరీస్ నేపథ్యంలోనే జట్టులో స్థానం దక్కించుకుంది. 20 ఏళ్ల వైష్ణవి శర్మ, అండర్-19 ప్రపంచ కప్ టోర్నమెంట్ గెలుచుకున్న టీమిండియా జట్టులో సభ్యురాలు కూడా కావడం గమనార్హం. ఈ అండర్ 19 మహిళల వరల్డ్ కప్ లో అత్యధిక వికెట్లు తీసిన బౌలర్గా కూడా చరిత్ర సృష్టించింది.

Advertisement

Also Read: Monty Panesar: వీడి ముఖానికి టీమిండియా హెడ్ కోచా ? గ‌ల్లీ క్రికెట్ కు కూడా ప‌నికిరాడు, గంభీర్ ఇజ్జ‌త్ తీశాడుగా ! 

 

 

Related News

ఫిఫా వ‌ర‌ల్డ్ క‌ప్ లో వాడిన‌ బంతుల్లో చిప్స్…షాకింగ్ వీడియో వైర‌ల్ !

టైటిల్ గెల‌వ‌గానే త‌ల‌కెక్కిన పొగ‌రు..ట్రంప్ ను తోసేసి, స్పెయిన్ ఓవ‌రాక్ష‌న్‌

గోల్ కీపర్ మార్టినెజ్ ఒక్క‌డు లేక‌పోతే…10-0 తేడాతో అర్జెంటీనా ఓడిపోయేది

సెంచ‌రీ చేసినా రోహిత్ శ‌ర్మ‌పై ఆగ‌ని ట్రోలింగ్…స్లో బ్యాటింగ్ అంటూ వాయించేస్తున్నారుగా

ఫిఫా వ‌ర‌ల్డ్ క‌ప్ 2026 విజేతగా స్పెయిన్‌..ఏకంగా 16 ఏళ్ల త‌ర్వాత స‌రికొత్త చ‌రిత్ర‌

రోహిత్ శ‌ర్మ లార్డ్స్ సెంచ‌రీ వెనుక సీక్రెట్ ఇదే, అత‌ని వ‌ల్లే ల‌క్ క‌లిసివ‌చ్చిందా?

గంభీర్ వెనక కోహ్లీ కుప్పిగంతులు..అస‌భ్యక‌రంగా చేతులు చూపిస్తూ డ్యాన్స్

లార్ట్స్ మైదానంలో ఈ గంట కొట్ట‌డానికి కార‌ణం ఏంటి? దీని వెనుక ఉన్న‌ర‌హ‌స్యం

Big Stories

Advertisement
×