E-Paper
Advertisement

Ola Electric Shares: స్టాక్ మార్కెట్ లో ఓలా ఎలక్ట్రిక్ దూకుడు, ఏకంగా 30 శాతం పెరిగిన షేర్ ధర!

Ola Electric Shares: స్టాక్ మార్కెట్ లో ఓలా ఎలక్ట్రిక్ దూకుడు, ఏకంగా 30 శాతం పెరిగిన షేర్ ధర!
Advertisement

Ola Electric Mobility Shares: ఎలక్ట్రిక్ మోటార్ సైకిళ్ల తయారీ సంస్థ ఓలా ఎలక్ట్రిక్ స్టాక్ మార్కెట్లలో దూకుడు కొనసాగుతోంది. కొత్త సంవత్సరంలో సరికొత్త జోష్ తో దూసుకెళ్తోంది. ఇవాళ వరుసగా రెండవ సెషన్‌ లోనూ లాభాల్లో కొనసాగుతోంది. ఇన్వెస్టర్లు కంపెనీ డిసెంబర్ అమ్మకాల పట్ల సానుకూలంగా స్పందించడంతో.. కంపెనీ షేర్ ధర 9 శాతం పెరిగి ఈ రోజు గరిష్ట స్థాయి ధర రూ. 40.77కి చేరుకుంది. ఓలా ఎలక్ట్రిక్ షేర్ ధరను ఒక నెల గరిష్ట స్థాయికి పెరిగింది. డిసెంబర్ మధ్యలో ప్రారంభమైన రికవరీతో 10 ట్రేడింగ్ సెషన్లలో 30.5 శాతం పెరుగుదలకు  కారణం అయ్యింది.

మూడు రాష్ట్రాల్లో టాప్ పొజిషన్

గురువారం ఎక్స్ఛేంజీలకు అందించిన వివరాల్లో డిసెంబర్‌ లో ఎలక్ట్రిక్ టూవీలర్స్ మార్కెట్లో తమ వాటాను 9.3 శాతం MoMకి మెరుగుపడినట్లు ప్రకటించింది. 9,020 యూనిట్ల అమ్మకాలను నమోదు చేసింది. నవంబర్ 2025లో దాని మార్కెట్ వాటా 7.2 శాతం దగ్గర ఉంద.  దీనికి అదనంగా, డిసెంబర్ 2025 రెండవ భాగంలో కంపెనీ మార్కెట్ వాటా దాదాపు 12 శాతానికి   పెరిగింది. ఇది డిమాండ్, మార్కెట్ వాటా లాభాలలో స్పష్టమైన పెరుగుదలను కనబరిచింది.  డిసెంబర్ 2025లో మార్కెట్ వాటా లాభాలు, అధిక డిమాండ్ కారణంగా, తమిళనాడు, ఉత్తరప్రదేశ్, బీహార్, జార్ఖండ్, పంజాబ్, హర్యానా లాంటి కీలక EV మార్కెట్లతో సహా దాదాపు డజను రాష్ట్రాల్లో టాప్ మూడు EV ప్లేయర్లలో టాప్ ప్లేస్ కు చేరినట్లు కంపెనీ తెలిపింది.

మార్కెట్ లోకి కొత్త మోడల్స్

Advertisement

అటు చాలా ఇష్యూలకు ఒకే రోజు సర్వీసును అందించే హైపర్‌ సర్వీస్, ఫాస్ట్ స్కేల్ అప్ మధ్య అడ్డంకులను ఎదుర్కొన్న తర్వాత దాని సర్వీస్ విధానాన్ని బలోపేతం చేయడం మొదలుపెట్టింది. ఈ సర్వీస్ రిజల్యూషన్ వేగంలో గణనీయమైన మెరుగుదలను అందిస్తున్నట్లు కంపెనీ తెలిపింది. డిసెంబర్ 2025లో తొలి రోజున 77% సర్వీస్ రిక్వెస్ట్ లను పూర్తి చేసినట్లు తెలిపారు.  మరోవైపు సర్వీస్ రికవరీతో పాటు, ఓలా ఎలక్ట్రిక్ తన 4680 భారత్ సెల్ ఎనర్జీతో పని చేసే S1 ప్రో+ 5.2 kWh స్కూటర్ల డెలివరీలను నవంబర్ 2025లో ప్రారంభించినట్లు తెలిపింది. అదే సమయంలో కంపెనీ డిసెంబర్ 2025లో 4680 భారత్ సెల్ పవర్ తో పని చేసే రోడ్‌స్టర్ X+ మోటార్‌ సైకిల్‌కు ప్రభుత్వ ధృవీకరణ పొందినట్లు వెల్లడించింది. ఓలా ఎలక్ట్రిక్..  ప్యూయెల్ బిజినెస్ కూడా స్కేల్ చేయడానికి సిద్ధంగా ఉన్నట్లు తెలిపింది. రెగ్యులేటరీ ఫైలింగ్ ప్రకారం.. మరికొద్ది నెలల్లో ఓలా శక్తి   డెలివరీలు ప్రారంభం కానున్నాయి.

Read Also: ఓలా To హీరో.. లక్షలోపు సూపర్ ఎలక్ట్రిక్ స్కూటర్లు ఇవే!

Advertisement

ఓలా ఎలక్ట్రిక్ 2025 చివరిలో రికవరీని ప్రారంభించినప్పటికీ, 58% క్రాష్‌తో ముగించింది. ఇది న్యూ ఏజ్ టెక్ స్టాక్‌లలో అతిపెద్ద పతనాన్ని పొందింది.  ఇప్పుడు రికవరీ మొదలైందని అనలిస్టులు చెబుతున్నారు. డిసెంబర్ 2025 సేల్స్ పెర్ఫార్మెన్స్, మార్కెట్ షేర్ పెరుగుదల కారణం షేర్ వ్యాల్యూ పెరిగిందంటున్నారు.

Read Also: వచ్చేస్తోంది హోండా యాక్టివా 7G, లాంచింగ్ ఎప్పుడో తెలుసా?

Related News

వోక్స్‌ వ్యాగన్ కార్లపై కళ్లు ఆఫర్లు.. ఆ మోడల్ పై ఏకంగా రూ.6 లక్షల తగ్గింపు!

సింగిల్ ఛార్జ్ తో 243 కి.మీ రేంజ్.. సింపుల్ వేవ్ సూపర్ స్కూటర్ వచ్చేసింది!

2027లో కొత్త నెక్సాన్.. డిజైన్ నుంచి ఇంజిన్ వరకు అన్నీ మారనున్నాయా?

5 ఏళ్ల తర్వాత పజెరో రీఎంట్రీ.. కొత్త లుక్‌తో మిత్సుబిషి బిగ్ సర్‌ప్రైజ్!

EV కొనేముందు ఈ విషయం చెక్ చేశారా? లేదంటే ఇబ్బందులు తప్పవు!

టాటా దూకుడు.. మహీంద్రా జోరు! ఆగస్టు అమ్మకాల్లో ఎవరు టాప్?

హోండా కొత్త ఈ-స్కూటర్‌కు పేటెంట్.. స్పీడ్ ఎంతో తెలిస్తే వావ్ అనాల్సిందే!

100 కి.మీ స్పీడ్.. 200 కి.మీ రేంజ్.. ఆంపియర్ కొత్త ఎలక్ట్రిక్ బైక్‌కు పేటెంట్!

Big Stories

Advertisement
×