E-Paper
Advertisement

MS DHONI: త‌మిళ‌నాడు CMగా విజ‌య్…చ‌క్రం తిప్పింది ధోనినే అంటూ పోస్టులు !

MS DHONI: త‌మిళ‌నాడు CMగా విజ‌య్…చ‌క్రం తిప్పింది ధోనినే అంటూ పోస్టులు !
Advertisement

MS DHONI:  తమిళనాడు రాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల్లో హీరో విజయ్ ( Vijay ) సరికొత్త చరిత్ర సృష్టించాడు. పార్టీ పెట్టిన రెండు సంవత్సరాలలోనే అధికారంలోకి రాబోతున్నాడు విజయ్. తాజాగా జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో 234 సీట్లకు గాను 108 సీట్లు దక్కించుకున్నాడు విజయ్. మరో 10 మంది ఎమ్మెల్యేలు మద్దతు తెలిపితే, TVK పార్టీ తమిళనాడు రాష్ట్రంలో అధికారంలోకి రాబోతుంది. తదనంతరం విజయ్ ముఖ్యమంత్రిగా బాధ్యతలు కూడా తీసుకుంటారు. ఇలాంటి క్రమంలో మహేంద్ర సింగ్ ధోని ( Dhoni ) పేరు తెరపైకి వచ్చింది. విజయ్ సక్సెస్ వెనుక మహేంద్ర సింగ్ ధోని ఉన్నాడంటూ సోషల్ మీడియాలో వార్తలు వైరల్ అవుతున్నాయి. అతని కారణంగానే ఇప్పుడు ముఖ్యమంత్రి కాబోతున్నాడని అంటున్నారు.

Also Read: Raghu Sharma Letter: 33 ఏళ్ల వ‌య‌స్సులో ఐపీఎల్ లోకి ఎంట్రీ, జై శ్రీ రామ్ అంటూ లెట‌ర్‌…ఇంత‌కు ఎవ‌రీ రఘు శర్మ ?

తమిళనాడు ముఖ్యమంత్రిగా విజయ్.. చక్రం తిప్పిన MSD ధోని

Advertisement

ప్రపంచంలో ఏ మూలన ఏది జరిగినా మహేంద్ర సింగ్ ధోనీకి ముడి పెట్టడం అలవాటుగా మారిపోయింది. మంచి జరిగితే ధోనిని మెచ్చుకోవడం, చెడు జరిగితే మరొకరిపై తోసేయడం MSD అభిమానులకు అలవాటుగా మారిపోయింది. అయితే లేటెస్ట్ గా తమిళనాడు ముఖ్యమంత్రిగా విజయ్ బాధ్యతలు తీసుకోబోతున్న నేపథ్యంలో ధోని చక్రం తిప్పాడని అభిమానులు భజన మొదలుపెట్టారు. ఎన్నికల కంటే ముందు ధోనీని విజయ్ కలిసాడని.. అందువల్లే అతడికి లక్కు కలిసి వచ్చిందని అంటున్నారు. ఈ నేపథ్యంలోనే TVK పార్టీ అఖండ విజయాన్ని నమోదు చేసుకున్నట్లు చెబుతున్నారు. గతంలో కూడా గుజరాత్ ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ప్రధాని నరేంద్ర మోడీ… మహేంద్ర సింగ్ ధోనిని కలిశాడని… ఈ దెబ్బకు దేశ ప్రధాని అయిపోయాడని అంటున్నారు. అలాగే ధోనీని ట్రంప్ కలవడంతో అమెరికా అధ్య‌క్షుడు అయ్యాడ‌ని గుర్తు చేస్తున్నారు. ఇక ఇప్పుడు ధోనిని విజ‌య్ క‌లిసిన నేప‌థ్యంలో 108 సీట్ల‌తో అధికారంలోకి వ‌చ్చిన‌ట్లు గుర్తు చేస్తున్నారు ఫ్యాన్స్. ఈ మేర‌కు త‌ల ఫ‌ర్ రీజ‌న్ అంటూ కామెంట్స్ చేస్తున్నారు ధోని ఫ్యాన్స్‌.

విజ‌య్ ట‌చ్ లోకి 10 మంది ఎమ్మెల్యేలు ?

తమిళనాడు రాష్ట్రంలో చరిత్ర సృష్టించిన విజయ్ పార్టీకి ( Vijay Party) మద్దతు తెలిపేందుకు పదిమంది ఎమ్మెల్యేలు సిద్ధమైనట్లు వార్తలు వస్తున్నాయి. 108 సీట్లు సాధించిన విజయ్ పార్టీకి… మరో 10 మంది ఎమ్మెల్యేల మద్దతు అవసరం. ఈ క్రమంలో డీఎంకే పార్టీకి సంబంధించిన పదిమంది ఎమ్మెల్యేలు జంప్ అయ్యేందుకు సిద్ధమయ్యారట. దీంతో మే ఏడవ తేదీన ముఖ్యమంత్రిగా విజయ్ ప్రమాణస్వీకారం కూడా చేయబోతున్నట్లు తెలుస్తోంది. అటు రెండు చోట్ల గెలిచిన విజయ్, ఒకచోట రాజీనామా చేయనున్నారని సమాచారం అందుతోంది. ఇదే జరిగితే త్రిషను రాజీనామా చేసిన చోట బరిలోకి దింపే అవకాశాలు ఉన్నాయి. ఆమె గెలిస్తే డిప్యూటీ సీఎం పదవి కూడా ఇస్తారని అంటున్నారు.

Advertisement

 

Also Read: Tanveer Ahmed: బాబ‌ర్ ఒక్క‌ టైటిల్ గెలిస్తే, కోహ్లీ మాత్రం కెప్టెన్సీ కోసం బిచ్చగాడిలా మారాడు Tanveer Ahmed

 

?igsh=dWRnOW11bDRibTlz

 

 

Related News

నా అల్లుడిపై బ్యాన్ వేస్తే, అంద‌రి భాగోతాలు బ‌య‌ట‌పెడ‌తా..ఇంజ‌మామ్ హెచ్చ‌రిక‌

మ‌రో వివాదంలో మ‌హ్మ‌ద్ రిజ్వాన్..డ్ర‌గ్స్ తీసుకున్న‌ట్లు ఆరోప‌ణ‌లు !

బాబ‌ర్ ఆజం గొప్పోడని డ‌బ్బా కొట్ట‌డం త‌ప్ప‌, పీకిందేమీ లేదు..అంతా ప్ర‌చారం మాత్ర‌మే

ఓయో రూంల్లో ఉండ‌నున్న టీమిండియా ప్లేయ‌ర్లు ?

ధోని చాణ‌క్యం…బెంగాలీ రాద‌ని డ్రామాలు ఆడి బంగ్లా ప‌ళ్లు రాలగొట్టాడు

ఇంగ్లండ్ చేతిలో వైట్ వాష్ అయినా, టీమిండియా అంతు చూస్తాం !

స్మృతి మందాన‌ బ్యాట్ లో AI చిప్స్…అందుకే సెంచ‌రీ చేసింది

విజయ్ మాల్యాతో మందుకొట్టిన ధోనీ, రిషబ్ పంత్..షాకింగ్ వీడియో వైర‌ల్ !

Big Stories

Advertisement
×