E-Paper
Advertisement

ఆర్ఆర్‌బీ ఎన్టీపీసీ అడ్మిట్ కార్డులు వచ్చేశాయ్.. మే 7 నుంచి ఎగ్జామ్స్, ఎగ్జామ్ విధానమిదే..

ఆర్ఆర్‌బీ ఎన్టీపీసీ అడ్మిట్ కార్డులు వచ్చేశాయ్.. మే 7 నుంచి ఎగ్జామ్స్, ఎగ్జామ్ విధానమిదే..
Advertisement

రైల్వేలో ఉద్యోగం సాధించాలనే లక్ష్యంతో ఉన్న అభ్యర్థులకు కీలక అప్‌డేట్ వచ్చేసింది. రైల్వే రిక్రూట్‌మెంట్ బోర్డ్ (RRB) ఎన్టీపీసీ అండర్ గ్రాడ్యుయేట్-2026 పోస్టులకు సంబంధించి మొదటి విడత కంప్యూటర్ ఆధారిత పరీక్ష (CBT-1) హాల్‌టికెట్లను విడుదల చేసింది.

దరఖాస్తు చేసుకున్న అభ్యర్థులు అధికారిక వెబ్‌సైట్ rrbapply.gov.in ద్వారా తమ అడ్మిట్ కార్డులను డౌన్‌లోడ్ చేసుకోవచ్చని అధికారులు వెల్లడించారు. ఈ పోస్టుల భర్తీ ప్రక్రియలో భాగంగా మే 7వ తేదీ నుంచి పరీక్షలు ప్రారంభం కానున్నాయి. అభ్యర్థులు తమ రిజిస్ట్రేషన్ నంబర్, పుట్టిన తేదీ వివరాలను నమోదు చేసి హాల్‌టికెట్లను పొందవచ్చు.

Advertisement

పరీక్షా విధానం: మొత్తం 100 మార్కులకు ఆబ్జెక్టివ్ పద్ధతిలో ప్రశ్నా పత్రం ఉంటుంది. ఈ పరీక్షను పూర్తి చేయడానికి అభ్యర్థులకు 90 నిమిషాల సమయం కేటాయించారు. నెగటివ్ మార్కింగ్ విధానం అమలులో ఉన్నందున అభ్యర్థులు సమాధానాలు గుర్తించేటప్పుడు జాగ్రత్తగా ఉండాలి. ప్రతి మూడు తప్పు సమాధానాలకు ఒక మార్కు కోత విధిస్తారు. నెగటివ్ మార్కింగ్ ప్రభావం అభ్యర్థుల మెరిట్ జాబితాపై పడే అవకాశం ఉండటంతో ఖచ్చితత్వం పాటించడం ఎంతో ముఖ్యం.

ఒరిజనల్ ఆధార్ కార్డు: పరీక్షా కేంద్రానికి వెళ్లే సమయంలో హాల్‌టికెట్‌తో పాటు ఒరిజినల్ ఆధార్ కార్డును తప్పనిసరిగా తీసుకువెళ్లాలని అధికారులు స్పష్టం చేశారు.

Advertisement

ఈ నిబంధనలు తప్పనిసరి:  హాల్‌టికెట్ డౌన్‌లోడ్ చేసుకున్న తర్వాత అభ్యర్థులు అందులోని వివరాలను క్షుణ్ణంగా పరిశీలించుకోవాలి. పేరు, ఫోటో, పరీక్షా కేంద్రం వంటి వివరాలలో ఏవైనా తప్పులు ఉంటే వెంటనే సరిచేసుకోవాలి. సాంకేతిక సమస్యలు లేదా తప్పుల సవరణ కోసం రైల్వే బోర్డు ప్రత్యేక హెల్ప్ లైన్ నంబర్ 9513166169 అందుబాటులోకి తెచ్చింది.

పరీక్ష రోజున ఎలాంటి ఇబ్బందులు కలగకుండా ముందుగానే అధికారులను సంప్రదించి సందేహాలను నివృత్తి చేసుకోవాలని సూచించారు. ఆధార్ కార్డు లేని పక్షంలో పరీక్షకు అనుమతించబోరని అధికారులు స్పష్టమైన ఆదేశాలు జారీ చేశారు.

రైల్వే ఉద్యోగాల కోసం దేశవ్యాప్తంగా లక్షలాది మంది పోటీ పడుతున్నారు. అండర్ గ్రాడ్యుయేట్ స్థాయిలో ఉండే క్లర్క్ కమ్ టైపిస్ట్, అకౌంట్స్ క్లర్క్ వంటి వివిధ పోస్టుల భర్తీకి ఈ పరీక్ష నిర్వహిస్తున్నారు. అభ్యర్థులు పరీక్షా కేంద్రానికి నిర్ణీత సమయం కంటే ముందే చేరుకోవాలని నిబంధనలు వివరిస్తున్నాయి.

బయోమెట్రిక్ వెరిఫికేషన్ ప్రక్రియ ఉంటుంది కాబట్టి ఆధార్ కార్డు ఆధారంగానే ఈ ప్రక్రియను పూర్తి చేస్తారు. క్రమశిక్షణతో పరీక్షలు నిర్వహించేందుకు అన్ని ఏర్పాట్లు పూర్తి చేసినట్లు రైల్వే అధికారులు తెలిపారు.

ALSO READ: BREAKING: తమిళనాడు సీఎంగా విజయ్..? టీవీకేఎల్పీ నేతగా ఏకగ్రీవ ఎన్నిక

Related News

7 వేల ఉద్యోగాలకు.. సర్కార్ గ్రీన్ సిగ్నల్!

బ్యాంక్ ఉద్యోగమే మీ లక్ష్యమా? 6,715 పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదల

జయశంకర్ వర్సిటీలో అడ్మిషన్లు.. అప్లై చేయడానికి లాస్ట్ డేట్ ఇదే!

బ్యాంక్ ఆఫ్ బరోడాలో భారీ నోటిఫికేషన్.. 104 ప్రొఫెషనల్ ఉద్యోగాల భర్తీ!

AP EAPCET Result-2026: ఏపీలో ఈఏపీసెట్ ఫలితాలు.. ఇంజనీరింగ్‌లో 70 శాతం పైగా ఉత్తీర్ణత, మంత్రి శుభాకాంక్షలు

Hyderabad: విద్యార్థులకు అలర్ట్.. జులై 2 నుంచి తెలంగాణ పీజీఈసెట్‌ కౌన్సెలింగ్

టీజీ సీపీగెట్ ఎగ్జామ్ షెడ్యూల్ విడుదల

ఇంజనీరింగ్ కౌన్సెలింగ్.. నేటి నుంచి వెబ్ ఆప్షన్ల నమోదు

Big Stories

Advertisement
×