Viral Video : సాధారణంగా క్రికెట్ లో రకరకాల సంఘటనలు చోటు చేసుకుంటాయి. కొంత మంది అద్బుతంగా ఆడితే.. మరికొందరూ అట్టర్ ప్లాఫ్ గా ఆడుతుంటారు. కొందరూ యావరేజ్ గా ఇలా రకరకాలుగా వ్యవహరిస్తుంటారు. కొంత మంది జట్టులో స్థానం కోల్పోతుంటారు. మరికొందరూ తమ ప్రతిభ కనబరిచి జట్టులో చోటు సంపాదిస్తారు. ఇలా ఏ ఆటలోనైనా ఇలాంటి సంఘటనలు చోటు చేసుకోవడం నిత్యం చూస్తూనే ఉంటాం. అయితే ఇక్కడ ఓ ఆసక్తికర ఘటన చోటు చేసుకోవడం గమనార్హం.
Also Read : AUS Vs ENG 4th Test : ఉత్కంఠ పోరులో విజయం సాధించిన స్టోక్స్ సేన
అక్కడ అంతా స్టేడియంలోనే ఉన్నారు. కొంతమంది బ్యాటింగ్ చేయడానికి వేచి ఉన్నారు. సిక్సర్ కొట్టడానికి సిద్ధంగా ఉన్నవారు ఉన్నారు. అయితే అప్పుడే కెప్టెన్ వచ్చి ఇన్నింగ్స్ ముగిసినట్టు చెబుతాడు. అదే సమయంలో చాలా మంది గుసగుసలాడుతూ ఇంటికి వెళ్లిపోతారు. కానీ ఓ ఆటగాడు మాత్రం వెళ్లడు. నేను ఆడకపోతే ఎవ్వరూ ఆడలేరు.. అనేలా చూపించారు. ప్రస్తుతం అందుకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ఒక వ్యక్తికి గ్రామ స్థాయి క్రికెట్ లో బ్యాటింగ్ చేసే అవకాశం రాలేదు. దీంతో అతను కోపంతో క్రికెట్ ఆడే గ్రౌండ్ నే మొత్తం దున్నేశాడు.క్రికెట్ లో బ్యాటింగ్ రాకుంటే ఇలా కూడా చేస్తారా..? అని సోషల్ మీడియాలో చర్చించుకుంటున్నారు. బ్యాటింగ్ చేసేందుకు అవకాశం రాకపోవడంతో కలత చెందిన ఆ వ్యక్తి.. మ్యాచ్ ను తనదైన శైలీలో ముగించాలని నిర్ణయించుకున్నాడు. అరవలేదు. కరవలేదు. బెదరలేదు. కేవలం ట్రాక్టర్ సహాయంతో మైదానాన్ని దున్నేశాడు.
దీంతో ఒక్కసారిగా క్రికెట్ మ్యాచ్ మొత్తం ఆగిపోయింది. ఆటగాళ్లు అందరూ నిస్సహాయం నిలబడిఇ చూస్తున్నారు. మారిన మట్టి కింద తమ క్రికెట్ పిచ్ అదృశ్యమవుతుందని ఆశ్చర్యంగా చూడటం విశేషం. ప్రస్తుతం ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ఈ వీడియో పై మీమ్స్, జోక్సులు, కామెంట్స్ చేసుకుంటూ నెటిజన్లు తెగ ఎంజాయ్ చేస్తున్నారు. బ్యాటింగ్ రాకుంటే అంతే.. మరీ చిన్నప్పుడు మనం కూడా ఇలా చేయకపోయినా.. ఏదో ఒక విధంగా ఆటను రద్దు చేయాలని చూశామని కొందరూ అంటుంటే.. ఇలా చేయడం మంచి పద్దతి కాదు అని మరికొందరూ ఇలా రకరకాలుగా కామెంట్స్ చేయడం విశేషం. “ఇది నా జీవితంలో నేను చూసిన అతి చిన్న విషయం.. వాట్ ఎ లూజర్” అని ఒక వినియోగదారు రాశారు. మరో నెటిజన్ ఇలాంటి ట్రెండింగ్ వీడియోలు చూస్తేనే క్రికెట్ అభిమానులు ఎంజాయ్ చేస్తారు అంటున్నాడు. కొందరూ దీనిని హానీ చేయని పల్లెటూరి హాస్యం గా చూస్తారు. మరికొందరూ దీనిని చాలా దూరం తీసుకున్న పిల్లతనం అని పిలుస్తారు అని ఎవ్వరికీ తోచిన విధంగా వాళ్లు దీనిపై కామెంట్స్ చేయడం గమనార్హం.
Also Read : Dhruv Shorey : వరుసగా 5 సెంచరీలతో రికార్డు.. వరల్డ్ రికార్డు బ్రేక్ చేసే ఛాన్స్..!
https://www.facebook.com/reel/849212097940450