BigTV English

Virat Kohli: తెల్ల గడ్డంతో విరాట్ కోహ్లీ…నెల రోజులకే ముసలోడు అయ్యాడా !

Virat Kohli:  తెల్ల గడ్డంతో విరాట్ కోహ్లీ…నెల రోజులకే ముసలోడు అయ్యాడా !

Virat Kohli: టీం ఇండియా స్టార్ క్రికెటర్ విరాట్ కోహ్లీ గురించి ప్రత్యేకంగా పరిచయం అవసరం లేదు. విరాట్ కోహ్లీ తనదైన ఆట తీరుతో టీమ్ ఇండియాకు ఎన్నో అద్భుతమైన విజయాలను అందించారు. కోహ్లీకి విపరీతంగా అభిమానులు ఉన్న సంగతి తెలిసిందే. తన ఆట తీరుకు ఎవరైనా ఫిదా అవ్వాల్సిందే. కొద్ది రోజుల క్రితమే కోహ్లీ టెస్టులు, t20 లకు రిటైర్మెంట్ ప్రకటించిన సంగతి తెలిసిందే. రిటైర్మెంట్ అనంతరం కోహ్లీ తన కుటుంబ సభ్యులతో కలిసి లండన్ లో నివాసం ఉంటున్నారు. తన భార్య అనుష్క శర్మ, కూతురు, కుమారుడితో కలిసి లండన్ లో హ్యాపీగా ఉంటున్నారు. ఎంతో దూరంలో ఉన్నప్పటికీ తన అభిమానుల కోసం విరాట్ కోహ్లీ సోషల్ మీడియాలో చాలా యాక్టివ్ గా ఉంటారు. తనకు సంబంధించిన ప్రతి ఒక్క ఫోటోను తన అభిమానులతో షేర్ చేసుకోగా అవి వైరల్ గా మారుతూ ఉంటాయి.


Also Read: Zim vs NZ 2nd Test : జింబాబ్వే కు చుక్కలు చూపిస్తున్న న్యూజిలాండ్.. మ్యాచ్ పూర్తి వివరాలు ఇవే

ఈ క్రమంలోనే తాజాగా విరాట్ కోహ్లీ దిగిన ఓ ఫోటో సోషల్ మీడియా మాధ్యమాల్లో వైరల్ అవుతుంది. అందులో కోహ్లీ ఇప్పటివరకు ఎన్నడు లేని విధంగా మెరిసిన గడ్డం, మీసాలతో ఓల్డ్ ఏజ్ లుక్ లో కనిపించి అందరికీ షాక్ ఇచ్చాడు. ఈ ఫోటోను చూసిన కోహ్లీ అభిమానులు ఇతడిని ఇలా చూడలేకపోతున్నాం అంటూ కామెంట్లు చేస్తున్నారు. మరికొందరేమో కోహ్లీ 50 ఏళ్లు పైబడిన వ్యక్తిలా కనిపిస్తున్నాడని అంటున్నారు. ఇది నిజమైన ఫోటో కాదని ఏఐ ఫోటో అయి ఉంటుందని కొంతమంది అంటున్నారు. ఏది ఏమైనాప్పటికీ ఈ ఫోటోలో మాత్రం కోహ్లీ చాలా ఓల్డ్ ఏజ్ వ్యక్తిలా కనిపిస్తున్నాడు. టెస్టులు, t20 లకు రిటైర్మెంట్ ప్రకటించినప్పటికీ వన్డే మ్యాచ్లు మాత్రం ఆడుతున్నారు. వన్డే మ్యాచ్లు ఉన్న సమయంలో ఇండియాకు వచ్చి ఆట ముగించుకొని తిరిగి లండన్ వెళ్లిపోతాడు.


నెల రోజులకే ముసలివాడైన కోహ్లీ

విరాట్ కోహ్లీ నెల రోజుల కిందట అంటే జూలైలో లండన్ లో జరిగిన బ్యాడ్మింటన్ కార్యక్రమానికి వచ్చాడు. ఈ సందర్భంగా సూటు బూటు వేసుకొని కనిపించాడు. అప్పుడు బ్లాక్ గడ్డంతో కనిపించాడు విరాట్ కోహ్లీ. అయితే నెల రోజులు గడిచిన తర్వాత… అంటే ఇప్పుడు విరాట్ కోహ్లీ తెల్ల గడ్డంతో మెరిశాడు.

మరోవైపు అనుష్క శర్మ కూడా సినిమాలు చేయడం పూర్తిగా తగ్గించేసింది. తన పూర్తి సమయాన్ని తన కుటుంబానికే కేటాయించింది. తన కూతురు కుమారుడితో కలిసి సంతోషంగా లైఫ్ కొనసాగిస్తోంది. వీరి జంట నేటి కాలంలో ఎంతో మందికి ఆదర్శంగా చెప్పుకోవచ్చు. ప్రేమ వివాహం చేసుకున్నప్పటికీ ఎంతో అన్యోన్యంగా వారి వైవాహిక జీవితాన్ని కొనసాగిస్తున్నారు. నేటి కాలంలో చాలామంది చిన్న చిన్న గొడవలకు విడిపోయి పిల్లల భవిష్యత్తును నాశనం చేస్తున్నారు. కానీ కోహ్లీ, అనుష్క శర్మ జంట చాలా అన్యోన్యంగా, సంతోషంగా వారి జీవితాన్ని గడుపుతున్నారు. వీరిని ఆదర్శంగా తీసుకుంటే కొంతమంది అయినా విడాకులు తీసుకోవడం మానుకుంటారని కోహ్లీ, అనుష్క అభిమానులు కామెంట్లు చేస్తున్నారు.

Also Read:  Girls In Stadium : స్టేడియంలో అందమైన అమ్మాయిలనే ఎందుకు చూపిస్తారు.. ఇది ఎలా సాధ్యం

Related News

Rahul Dravid : రాహుల్ ద్రావిడ్ ఎప్పుడైనా సిక్స్ లు కొట్టడం చూశారా.. ఇదిగో వరుసగా 6,6,6… వీడియో చూస్తే షాక్ అవ్వాల్సిందే

Mohammed Siraj : ప్రియురాలితో రాఖీ కట్టించుకున్న టీమిండియా ఫాస్ట్ బౌలర్!

Free Hit : ఇకపై వైడ్ బాల్ కు కూడా Free Hit ఇవ్వాల్సిందే.. ఎప్పటినుంచి అంటే ?

Sanju Samson : ఆ 14 ఏళ్ల కుర్రాడి వల్లే….RR నుంచి సంజూ బయటకు వెళ్తున్నాడా!

Akash deep Car : రక్షాబంధన్… 50 లక్షల కారు గిఫ్ట్ ఇచ్చిన టీమిండియా ఫాస్ట్ బౌలర్ ఆకాష్

RCB – Kohli: ఛత్తీస్‌గఢ్ బుడ్డోడికి కోహ్లీ, డివిలియర్స్ కాల్స్.. రజత్ ఫోన్ దొంగతనం చేసారా ?

Big Stories

×