BigTV English

Kantara Movie: కాంతారను వెంటాడుతున్న విషాదాలు.. గుండెపోటుతో మరో నటుడు మృతి

Kantara Movie: కాంతారను వెంటాడుతున్న విషాదాలు.. గుండెపోటుతో మరో నటుడు మృతి

Kantara Actor T Prabhakar Kalyan Died: కాంతార మూవీని వరుస విషాదాలు వెంటాడుతున్నాయి. సినిమాలో నటించిన, నటిస్తోన్న నటులు వరుసగా ప్రాణాలు కోల్పోతున్నారు. అంతేకాదు మూవీ సెట్లోనూ తరచూ ప్రమాదాలు జరుతుండటం ఆందోళన కలిగిస్తోంది. ఇటీవల కాంతార చాప్టర్ 1లో నటిస్తోన్న పులువురు ఆర్టిస్టులు వివిధ ఘటనల్లో ప్రాణాలు కోల్పోయిన సంగతి తెలిసిందే. తాజాగా మరో కాంతార నటుడు కన్నుమూశారు. కాంతార ఫస్ట్ పార్ట్ లో కీలక పాత్రలో నటించిన టి ప్రభాకర్ కళ్యాణ్ గుండెపోటుతో మృతి చెందారు. కర్ణాటక ఉడిపి జిల్లాలోని హిరియాడ్కాలోని తన నివాసంలో శుక్రవారం ఆయన గుండెపోటుతో తుదిశ్వాస విడిచినట్టు ఆయన కుటుంబ సభ్యులు తెలిపారు.


ఐదేళ్ల క్రితమే గుండెపోటు

కాంతార సినిమాలో ఆయన మహాదేవ పాత్రలో కనిపించారు. తొలుత నాటక రంగంలో ఉన్న ఆయన క్రమంలో సినిమాల్లో అవకాశాలు అందుకున్నారు. ఈ క్రమంలో కాంతారలో మహాదేవగా కీలక పాత్ర పోషించారు. ఐదేళ్ల క్రితమే ఆయనకు హార్ట్ ఆపరేషన్ జరిగింది. తాజాగా ఆయనకు తన నివాసంలో శుక్రవారం ఛాతి నొప్పి రావడంతో కుప్పకూలిపోయారు. దీంతో కుటుంబ సభ్యులు ఆయనను ఆస్పత్రికి తరలించగా.. పరీక్షించిన వైద్యులు ఆయన మృతి చెందినట్టు ధ్రువీకరించారు. ఆయన మృతి పై కన్నడ చిత్ర పరిశ్రమలో విషాదం నెలకొంది. ఆయన మరణంపై నటీనటులు దిగ్భ్రాంతి వ్యక్తం చేస్తున్నారు. ఆయన ఆత్మకు శాంతి చేకూరాలని ప్రార్థిస్తూ నివాళులు అర్పిస్తున్నారు.


కాంతారకు ప్రీక్వెల్ ఇది

కాగా కన్నడ నటుడు రిషబ్ శెట్టి స్వీయ దర్శకత్వంలో తెరకెక్కిన చిత్రం కాంతార. 2022లో విడుదలైన ఈ సినిమా ఎంతటి విజయం సాధించిందో తెలిసిందే. కన్నడిగులు దైవం పంచర్ల సంస్కృతి నేపథ్యంలో వచ్చిన ఈ చిత్రం అన్ని భాషల్లోనూ మంచి విజయం సాధించింది. హోంబలె ఫిల్మ్స్ నిర్మించిన ఈ చిత్రాన్ని రీజనల్ సినిమాగా తెరకెక్కించి కన్నడలో విడుదల చేశారు. ప్రేక్షకులు నుంచి విశేష స్పందన రావడంతో ఆ తర్వాత తెలుగుతో పాటు హిందీ, తమిళ్, మలయాళ భాషల్లో విడుదల చేశారు. అన్ని భాషల్లోనూ ఈ చిత్రం బ్లాక్ బస్టర్ హిట్ అందుకుంది. కన్నడ కల్చర్ మూవీ కావడంతో అన్ని వర్గాల ఆడియన్స్ ఆకట్టుకుంది.

Also Read: Samantha: సమంతనే నాగచైతన్యను వదిలించుకుంది.. అమెదంతా దొంగ ఏడుపు.. సానుభూతి కోసమే..

వెంటాడుతున్న వరుస విషాదాలు

ఈ సినిమా భారీ విజయం సాధించడం దీనికి ప్రీక్వెల్ గా కాంతార చాప్టర్ 1ను తీసుకువస్తున్నారు. ప్రస్తుతం ఈ సినిమా షూటింగ్ ను జరుపుకుంటోంది. అయితే ఈ చిత్రం సెట్ పైకి వచ్చినప్పటి తరచ ఆటంకాలు ఎదురవుతున్నాయి. తొలుత షూటింగ్ జరిగిన ప్రమాదంలో ప్రొడక్షన్ బాయ్ చనిపోయాడు. ఆ తర్వాత మూవీలోని జూనియర్ ఆర్టిస్టులు ప్రయాణిస్తున్న బస్సుకి ప్రమాదం జరగడంతో చాలా మందికి గాయాలయ్యాయి. ఆ తర్వాత ఓ నది ఒడ్డును వేసిన సెట్ లోనూ ఊహించని ప్రమాదం జరిగింది. ఇందులో నటిస్తున్న క్యారెక్టర్ ఆర్టిస్టులు వివిధ ఘటనల్లో మరణించారు. దీంతో కాంతార చాప్టర్ వన్ విషయంలో ఏం జరుగుతుందని అభిమానులు, ఆడియన్స్ అంత ఆందోళన చెందుతున్నారు.

Related News

Kantara: కాంతారా నటులను ఆ శాపమే వెంటాడుతుందా? వరస మరణాల వెనుక ఆంతర్యం ఇదేనా ?

Mouni Roy: బ్యాక్ గ్రౌండ్ ఉంటేనే అవకాశాలు.. మరోసారి కెలికిన నాగిని!

Cine Workers Strike : ఆమరణ దీక్షకు రెడీ… సినీ కార్మికులను ఎవరూ ఆపలేరా ?

Weapons Movie : హెవీ హాంటెడ్ సీన్స్… థియేటర్లలో జనాలను పరుగులు పెట్టిస్తున్న ఇంగ్లీష్ మూవీ

Chiranjeevi: ఫెడరేషన్ సభ్యులు నన్ను కలవలేదు.. తప్పుడు ప్రచారాలను ఆపండి.. ఫైర్ అయిన చిరు

kaantha Movie: పసి మనసే.. వినదసలే.. కాంత మెలోడి సాంగ్ వచ్చేసింది.. విన్నారా?

Big Stories

×