E-Paper
Advertisement

Zim vs NZ 2nd Test : జింబాబ్వే కు చుక్కలు చూపిస్తున్న న్యూజిలాండ్.. మ్యాచ్ పూర్తి వివరాలు ఇవే

Zim vs NZ 2nd Test : జింబాబ్వే కు చుక్కలు చూపిస్తున్న న్యూజిలాండ్.. మ్యాచ్ పూర్తి వివరాలు ఇవే
Advertisement

Zim Vs NZ 2nd Test :  ప్రస్తుతం జింబాబ్వే వర్సెస్ న్యూజిలాండ్ మధ్య రెండో టెస్ట్ మ్యాచ్ జరుగుతున్న విషయం తెలిసిందే. తొలుత టాస్ గెలిచిన జింబాబ్వే జట్టు బ్యాటింగ్ కి దిగి తొలి ఇన్నింగ్స్ లో కేవలం 125 పరుగులకే ఆలౌట్ అయింది. ఈ మ్యాచ్ లో జింబాబ్వే బ్యాటర్ బ్రెండన్ టేలర్ (44) పరుగులు చేసి టాప్ స్కోరర్ గా నిలిచాడు. మరో ఓపెనర్ బ్రెన్నెల్ డకౌట్ కావడం గమనార్హం. నిక్ వెక్ 11, విలియమ్స్ 11, క్రాగ్ ఇర్విన్ 07, రజా 5, తఫద్జ్వా త్సిగా 33 పరుగులు చేసి నాటౌట్ గా నిలిచాడు.  గ్వాండ్ 0, విన్సెంట్ మాసకేస 1, ముజారబాని 3, చివంగ 4 పరుగులు చేశారు. కేవలం నలుగురు బ్యాట్స్ మెన్స్ మినహా మిగతా బ్యాటర్లందరూ సింగిల్ డిజిట్ కే పరిమితం కావడం గమనార్హం. 

టేలర్ రికార్డు.. 

Advertisement

అనంతరం కివీస్ తొలిరోజు ఆట ముగిసే సమయానికి 174/1 స్కోర్ తో తిరుగులేని స్థితిలో నిలిచింది. దీంతో 49 పరుగుల ఆధిక్యంలో ఉన్న న్యూజిలాండ్ కి ఇంకా 9 వికెట్లు చేతిలో ఉన్నాయి. జింబాబ్వే బ్యాటర్ బ్రెండన్ టేలర్ అరుదైన రికార్డును అందుకున్నాడు. 21 శతాబ్దంలో టెస్ట్ ల్లో ఆరంగేట్రం చేసి ఎక్కువ సంవత్సరాలు కెరీర్ కొనసాగించిన క్రికెటర్ గా రికార్డును అధిగమించాడు. 21 సంవత్సరాల 93 రోజుల పాటు తన కెరీర్ ను కొనసాగించాడు. ప్రస్తుతం న్యూజిలాండ్ తో ఆడుతున్నాడు. అలాగే ఇంగ్లాండ్ క్రికెటర్ జేమ్స్ అండర్స్ 21 సంవత్సరాల 51 రోజులను అధిగమించాడు. ఇక 39 ఏళ్ల టేలర్ 2004లో శ్రీలంక పై సుదీర్ఘ ఫార్మాట్ లో అరంగేట్రం చేశాడు. 39 ఏళ్ల టేలర్ పై 2022లో అంతర్జాతీయ క్రికెట్ కౌన్సిల్ నిషేదం విధించింది. ఓ వ్యాపారవేత్త వద్ద నుంచి బహుమతులు తీసుకోవడంతో అతనిపై ఐసీసీ చర్యలకు ఉపక్రమించింది. అయితే ఇప్పుడు ఐసీసీ అతని పై బ్యాన్ ఎత్తేయడంతో రీ ఎంట్రీ ఇచ్చాడు.

హెన్రీ అరుదైన రికార్డు

Advertisement

మరోవైపు తొలి ఇన్నింగ్స్ లో న్యూజిలాండ్ బౌలర్ హెన్రీ 5 వికెట్లతో సత్తా చాటాడు. కివీస్ బౌలర్లలో హెన్రీతో పాటు ఫౌల్క్స్ 4 వికెట్లతో అదరగొట్టాడు. ఇక జింబాబ్వే బ్యాటర్లలో మూడేళ్ల తరువాత జట్టులో ఎంట్రీ ఇచ్చిన బ్రెండన్ టేలర్ (44) టాప్ స్కోరర్ గా నిలిచాడు. ఈ క్రమంలోనే మాట్ హెన్రీ ఓ అరుదైన రికార్డును తన పేరిట లిఖించుకున్నాడు. జింబాబ్వే పై టెస్టుల్లో అత్యధిక సార్లు 5 వికెట్ల హాల్ సాధించిన న్యూజిలాండ్ బౌలర్ గా క్రిస్ కెయిర్న్స్ రికార్డును హెన్రీ సమం చేశాడు. కెయిర్న్స్ తన కెరీర్ లో జింబాబ్వే పై 8 టెస్టులు ఆడి.. 39 వికెట్లు సాధించాడు. అందులో రెండు 5 వికెట్ హాల్స్ ఉన్నాయి. మాట్ హెన్రీ కెరీర్ లో ఇప్పటివరకు రెండు టెస్టులు మాత్రమే ఆడి 14 వికెట్లు పడగొట్టాడు. అందులో రెండు 5 వికెట్ హాల్స్ ఉన్నాయి. మరో వైపు తమ తొలి ఇన్నింగ్స్ ను ప్రారంభించిన న్యూజిలాండ్ జట్టు నిలకడగా ఆడుతోంది. ఆట ముగిసే సమయానికి న్యూజిలాండ్ జట్టు 39 ఓవర్లలో 174 పరుగులు చేసింది. కేవలం ఒక వికెట్ మాత్రమే కోల్పోయింది. విల్ యంగ్ 74 పరుగులు చేసి ఔట్ అయ్యాడు. క్రావే 79, జాకొబ్ డఫ్పీ 08 పరుగులు చేసి క్రీజులో ఉన్నారు.

?igsh=OHgzenUycmRscHpq

Related News

ఇమామ్ ఉల్ హక్ పెద్ద ద‌ద్ద‌మ్మ‌…త‌న‌ మామ ఇంజ‌మామ్ లాగా బ‌ద్ధ‌క‌స్తుడే

టీమిండియా ఓట‌మిని శాసించిన‌ సామ్‌ కర్రన్..అత‌ను వేసిన మూన్ బాల్స్ కొంప‌ముంచాయి

లార్డ్స్ వన్డేలో బాల్ టాంపరింగ్…శ్రేయస్ అయ్యర్ పై బ్యాన్?

లార్డ్స్ నుంచి అలిగి ఇంటికి వెళ్లిపోయిన గంభీర్..?

ఫిఫా వ‌ర‌ల్డ్ క‌ప్ లో వాడిన‌ బంతుల్లో చిప్స్…షాకింగ్ వీడియో వైర‌ల్ !

టైటిల్ గెల‌వ‌గానే త‌ల‌కెక్కిన పొగ‌రు..ట్రంప్ ను తోసేసి, స్పెయిన్ ఓవ‌రాక్ష‌న్‌

గోల్ కీపర్ మార్టినెజ్ ఒక్క‌డు లేక‌పోతే…10-0 తేడాతో అర్జెంటీనా ఓడిపోయేది

సెంచ‌రీ చేసినా రోహిత్ శ‌ర్మ‌పై ఆగ‌ని ట్రోలింగ్…స్లో బ్యాటింగ్ అంటూ వాయించేస్తున్నారుగా

Big Stories

Advertisement
×