E-Paper
Advertisement

DK Shivakumar: ఆర్సీబీ ఫ్యాన్స్ కు ట్ర‌బుల్ షూట‌ర్‌ గుడ్ న్యూస్‌..చిన్న‌స్వామికి ఎలాంటి ఢోకా లేదు, ఇక పండ‌గే

DK Shivakumar: ఆర్సీబీ ఫ్యాన్స్ కు ట్ర‌బుల్ షూట‌ర్‌ గుడ్ న్యూస్‌..చిన్న‌స్వామికి ఎలాంటి ఢోకా లేదు, ఇక పండ‌గే
Advertisement

DK Shivakumar:  రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు ( Royal Challengers Bangalore ) జట్టు అభిమానులకు అదిరిపోయే శుభవార్త అందింది. చిన్న స్వామి స్టేడియంలోనే ( Chinnaswamy stadium) ఐపీఎల్ 2026 టోర్నమెంట్ కు సంబంధించిన మ్యాచ్‌లు జరగనున్నట్లు తెలుస్తోంది. ఈ మేరకు కాంగ్రెస్ పీసీసీ అధ్యక్షులు, ట్రబుల్ షూటర్ DCM డీకే శివకుమార్ ( DK Shivakumar) సంచలన ప్రకటన చేశారు. రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు అభిమానులు ఎలాంటి ఆందోళన పడాల్సిన అవసరం లేదని, ఎప్పటి లాగే మ్యాచ్ లు జరుగుతాయని ఆయన వెల్లడించారు. ఐపీఎల్ 2026 టోర్నమెంట్ కు సంబంధించిన మ్యాచ్ లు చిన్నస్వామి స్టేడియం వేదికగా జరుగుతాయని పేర్కొన్నారు. ఇక్కడి నుంచి మ్యాచ్ లు తరలిపోతాయని వస్తున్న వార్తలను ఆయన ఖండించారు. ఈ ప్రకటనతో రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు అభిమానులు సంబరపడిపోతున్నారు.

Also Read: Hardik Pandya: ఏంట్రా ఈ అరాచ‌కం..జిమ్ లో వ‌ర్కౌట్స్ కాదు, పాండ్యా-మహికా శర్మ ముద్దులాట‌

చిన్నస్వామి స్టేడియంలోనే ఐపీఎల్ మ్యాచ్ లు

Advertisement

చిన్నస్వామి స్టేడియం నుంచి ఇండియన్ ప్రీమియర్ లీగ్ టోర్నమెంట్ ( Indian Premier League Tournament 2026) మ్యాచ్ ల‌ను తరలించడానికి అనుమతించేది లేదని కర్ణాటక డిప్యూటీ ముఖ్యమంత్రి డీకే శివకుమార్ సంచలన వ్యాఖ్యలు చేశారు. ఇది కర్ణాటక అలాగే బెంగుళూరు (Benguluru) గౌరవానికి సంబంధించిన విషయమని తెలిపారు. భవిష్యత్తుల తొక్కిసలాటలు జరగకుండా చూస్తామని వెల్లడించారు డిప్యూటీ ముఖ్యమంత్రి డీకే శివకుమార్. కొత్త క్రికెట్ స్టేడియం కూడా నిర్మిస్తామని పోస్ట్ పెట్టారు డీకే శివకుమార్. బెంగళూరులోనే ఐపిఎల్ మ్యాచ్ లు నిర్వహించబడతాయని కూడా పేర్కొన్నారు. అయితే డీకే శివకుమార్ వ్యాఖ్యల నేపథ్యంలో భారత క్రికెట్ నియంత్రణ మండలి ఎలాంటి నిర్ణయం తీసుకుంటుందో చూడాలి. కానీ డీకే శివకుమార్ ప్రకటనతో రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు అభిమానులు అయితే సంబరాలు చేసుకుంటున్నారు.

11 మందిని బలి తీసుకున్న ఆర్సీబీ విజయోత్సవ ర్యాలీ

రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు జట్టు దాదాపు 18 సంవత్సరాల తర్వాత టైటిల్ గెలిచిన సంగతి తెలిసిందే. ఐపీఎల్ ప్రారంభమైనప్పటి నుంచి ఇప్పటి వరకు ఒకే ఒక్కసారి టైటిల్ గెలిచింది బెంగుళూరు. ఐపీఎల్ 2025 టోర్నమెంటు సందర్భంగా అద్భుతంగా రాణించిన రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు జట్టు, తొలిసారి టైటిల్ అందుకుంది. విరాట్ కోహ్లీ, రజత్ పటిదార్ లాంటి అద్భుతమైన ప్లేయర్ల సారధ్యంలో ఈ టైటిల్ గెలిచింది బెంగుళూరు.

Advertisement

అయితే తొలిసారి టైటిల్ గెలిచిన నేపథ్యంలో చిన్న స్వామి స్టేడియం దగ్గర విజయోత్సవ ర్యాలీ నిర్వహించారు. అనుకున్న స్థాయి కంటే ఎక్కువగా ఈ ర్యాలీకి జనాలు వచ్చారు. దాదాపు 3 లక్షల మందికి పైగా జనాలు గుమిగుడడంతో తొక్కిసలాట‌ జరిగింది. ఈ ప్రమాదం కారణంగా దాదాపు 11 మంది రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు 11 మంది అభిమానులు చనిపోయారు. ఈ సంఘటన నేపథ్యంలో ఐపీఎల్ మ్యాచ్ లు బెంగళూరు చిన్న స్వామి స్టేడియం వేదికగా నిర్వహించేది లేదని బీసీసీఐ నిర్ణయం తీసుకున్నట్లు వార్తలు వచ్చాయి.

ALSO READ: KL Rahul: స‌ల‌హాలు ఇచ్చిన కోహ్లీ ప‌రువు తీసిన రాహుల్‌..ప‌క్క‌కు వెళ్లి కూర్చో అంటూ 

Related News

ఐర్లాండ్ చేతిలో టీమిండియానే వైట్ వాష్ అయింది, అందుకే పాకిస్తాన్ ఓడిపోతోంది

ఎవ‌రెంత గింజుకున్నా, నేను రాజీనామా చేయ‌ను..న‌ఖ్వీ సంచ‌ల‌నం

ఒరేయ్ న‌ఖ్వీ? పాకిస్తాన్ జ‌ట్టును 9వ స్థానానికి దిగ‌జార్చావ్ క‌ద‌రా !

బోర్డర్-గవాస్కర్ ట్రోఫీ ఇండియాను వైట్ వాష్ చేస్తాం…రికీ పాంటింగ్ హెచ్చరిక

రిజ్వాన్ చేత‌కాని ద‌ద్ద‌మ్మ‌…భ‌విష్య‌తుల్లో పాకిస్తాన్ తరఫున మళ్లీ ఆడ‌కుండా చేస్తా

రెండు టైటిల్స్ గెలిచినా, RCB ప్లేయ‌ర్లను జంతువుల కంటే హీనంగా చూస్తున్నారు

మిస్ట‌ర్ భువీ..ఇక చాలు, అన్ని మూసుకుని రిటైర్మెంట్ ఇచ్చి ఇంట్లో కూర్చో

ఇలానే వదిలేస్తే, ఇమ్రాన్ ఖాన్ ఏ క్షణమైనా చావడం పక్కా..!

Big Stories

Advertisement
×