E-Paper
Advertisement

Ind vs Sa 3rd Odi: స్టెప్ క్యాచ్ ప‌ట్టి, రివ్యూ తీసుకున్న కేఎల్ రాహుల్‌.. కోహ్లీ రియాక్ష‌న్ చూడండి, న‌వ్వుకోవాల్సిందే

Ind vs Sa 3rd Odi: స్టెప్ క్యాచ్ ప‌ట్టి, రివ్యూ తీసుకున్న కేఎల్ రాహుల్‌.. కోహ్లీ రియాక్ష‌న్ చూడండి, న‌వ్వుకోవాల్సిందే
Advertisement

Ind vs Sa 3rd Odi:  టీమిండియా వర్సెస్ దక్షిణాఫ్రికా ( India vs South Africa, 3rd ODI ) మధ్య విశాఖ వేదికగా శనివారం రోజున మూడో వన్డే జరిగిన సంగతి తెలిసిందే. ఈ మూడవ వన్డేలో అద్భుతంగా రాణించిన భారత జట్టు 9 వికెట్ల తేడాతో గ్రాండ్ విక్టరీ కొట్టింది. అయితే ఈ మ్యాచ్ నేపథ్యంలో ఆసక్తికర సంఘటన చోటు చేసుకుంది. టీమిండియా తాత్కాలిక వన్డే కెప్టెన్ కేఎల్ రాహుల్ చేసిన పని అందరికీ నవ్వు తెప్పించింది. స్టెప్ క్యాచ్ అందుకొని, అది ఔట్ అంటూ రివ్యూకు వెళ్లారు. తీరా రిప్లై చూసేసరికి నాటౌట్ అని తెలిపోయింది. దీంతో విరాట్ కోహ్లీతో పాటు క్రికెట్ ఫ్యాన్స్ కూడా నవ్వుకున్నారు. దీంతో ఈ సంఘటన వైరల్ అయింది.

ALSO READ: KL Rahul: స‌ల‌హాలు ఇచ్చిన కోహ్లీ ప‌రువు తీసిన రాహుల్‌..ప‌క్క‌కు వెళ్లి కూర్చో అంటూ 

స్టెప్ క్యాచ్ ప‌ట్టి, రివ్యూ తీసుకున్న కేఎల్ రాహుల్‌

Advertisement

టీమిండియా వర్సెస్ దక్షిణాఫ్రికా ( India vs South Africa, 3rd ODI ) మధ్య విశాఖ ( ACA-VDCA Cricket Stadium, Visakhapatnam ) వేదికగా మూడవ వన్డే జరిగింది. అయితే ఈ మ్యాచ్ లో 7 వికెట్లు పడిన నేపథ్యంలో కేశ‌వ్ మ‌హ‌రాజ్ ( Keshav Maharaj) బ్యాటింగ్ చేస్తున్నాడు. ఆ సమయంలో కుల్దీప్ యాదవ్ ( Kuldeep Yadav) బౌలింగ్ చేశాడు. ఇక అతని బౌలింగ్ లో కట్ షాట్ ఆడబోయి ఫెయిల్ అయ్యాడు కేశ‌వ్ మ‌హ‌రాజ్. ఇక ఆ బంతి స్టెప్పు పడి, కేఎల్ రాహుల్ షూల మధ్యలో చిక్కింది. ఇక ఆ బంతిని అలాగే అందుకున్న కేఎల్ రాహుల్, అప్పీల్ కి వెళ్ళాడు. అది నిజమే అనుకోని అంపైర్లు కూడా రిప్లైలో చూశారు. చివ‌ర‌కు అది నాటౌట్ అని తేలింది. బంతి స్టెప్పు పడిన తర్వాత కేఎల్ రాహుల్ ( Kl Rahul ) షూల మధ్యలో ఇరికింది. ఇది స్క్రీన్ పైన క్లారిటీగా కనిపించింది. ఇది చూసిన విరాట్ కోహ్లీ ( Virat Kohli) దారుణంగా ఏడిపించాడు. ఏంట్రా స్టెప్ క్యాచ్ పట్టుకొని ఔట్ అంటున్నారు.. ఇజ్జత్ తీశారు కదా అంటూ సైగలు చేశాడు కోహ్లీ. అటు మిగిలిన ప్లేయర్లు కూడా నవ్వుకున్నారు.

ఇది ఇలా ఉండగా దక్షిణాఫ్రికాపైన మూడవ వన్డేలో 9 వికెట్ల తేడాతో గ్రాండ్ విక్టరీ కొట్టింది టీమిండియా. ఈ మ్యాచ్ లో మొదటి బ్యాటింగ్ చేసిన దక్షిణాఫ్రికా 47.5 ఓవర్లలో 270 పరుగులు చేసి ఆలౌట్ అయింది. ఆ తర్వాత బ్యాటింగ్ కు దిగిన టీమిండియా 39.5 ఓవర్లలో ఒకే ఒక్క వికెట్ నష్టపోయి 271 పరుగుల లక్ష్యాన్ని అవలీలగా చేధించింది. రోహిత్ శర్మ, యశస్వి జైస్వాల్ అటు విరాట్ కోహ్లీ అద్భుతంగా రాణించారు. యశస్వి జైస్వాల్ సెంచరీ చేసి దుమ్ము లేపాడు. ఈ దెబ్బకు 2-1 తేడాతో 300 సిరీస్ ను కైవసం చేసుకుంది టీమిండియా.

Advertisement

Also Read: Hardik Pandya: ఏంట్రా ఈ అరాచ‌కం..జిమ్ లో వ‌ర్కౌట్స్ కాదు, పాండ్యా-మహికా శర్మ ముద్దులాట‌

 

?igsh=Y3QzZmR1bThhbWF3

Related News

ఫిఫా వ‌ర‌ల్డ్ క‌ప్ 2026 ఫైన‌ల్ మ్యాచ్ టైమింగ్స్ ఇవే..ఇండియాలో లైవ్ ఎప్పుడంటే ?

రెండు మ్యాచ్ ల‌కే గాయ‌ప‌డ్డ బుమ్రాతో వ‌ర‌ల్డ్ క‌ప్ గెలుస్తారా? గ‌వాస్క‌ర్ సీరియ‌స్‌

2027 వ‌న్డే వ‌ర‌ల్డ్ క‌ప్..త‌న డ్రీమ్ టీమిండియాను ప్ర‌క‌టించిన ర‌విశాస్త్రి

శ్రీలంక‌లో షాహీన్ అఫ్రిదికి ఘోర అవ‌మానం…ప్రీమియ‌ర్ బౌల‌ర్ కాస్త..మీడియం అయ్యాడు

టీమిండియా చాలా వీక్ గా ఉంది..పాకిస్తాన్ మ‌హిళ‌ల చేతిలో కూడా ఓడిపోవ‌డం ఖాయం!

రోహిత్ శ‌ర్మ‌ కూడా స్లాగ‌రే..గుడ్డిగా బ్యాట్ ఊపితే, వ‌ర‌ల్డ్ క‌ప్ గెల‌వ‌లేరు

గంభీర్ ను వెధ‌వ‌ను చేసేందుకు రోహిత్ శ‌ర్మ PR స్టంట్..రిటైర్మెంట్, బొక్కా లేదు

దక్షిణాఫ్రికాలో వ‌ర‌ల్డ్ క‌ప్ గెల‌వాలంటే, రోహిత్ శ‌ర్మ ఉండాల్సిందే

Big Stories

Advertisement
×