Bigg Boss 9 Telugu Promo : బుల్లితెర టాప్ రియాలిటీ షో బిగ్ బాస్ సీజన్ 9 చివరి దశకు చేరుకుంది. నాల్గవ సీజన్ తర్వాత మన తెలుగు బిగ్ బాస్ హిస్టరీ లో అత్యధిక టీఆర్ఫీ రేటింగ్స్ ని సొంతం చేసుకున్నట్టు వార్తలు వినిపిస్తున్నాయి. గత సీజన్లతో పోలిస్తే ఈ సీజన్లో కామనర్స్ ఎక్కువగా ఉండటమే కారణం అని సోషల్ మీడియాలో వార్తలు వినిపిస్తున్నాయి.. 13 వారాలు పూర్తి చేసుకున్న ఈ షో ప్రస్తుతం 14వ వారంలోకి అడుగు పెట్టింది. గతవారం లిస్ట్ ఓటింగ్ తో బిగ్ బాస్ హౌస్ నుంచి రీతు చౌదరి ఎలిమినేట్ అయింది.. మరి 14 వ వారం హౌస్ నుంచి ఎవరు ఎలిమినేట్ అవుతారు అన్నది ప్రశ్నార్ధకంగా మారింది.. ప్రస్తుతం హౌస్ లో ఉన్న వాళ్ళందరూ కూడా స్ట్రాంగ్ కంటెస్టెంట్లు కావడంతో ఈ వారం నామినేషన్స్ లోకి ఎవరు వస్తారు అన్నది ఆసక్తిగా మారింది.. ఇవాళ ఎపిసోడ్ ప్రోమోని బిగ్ బాస్ రిలీజ్ చేసింది.. గత వారం లాగా ఈవారం నామినేషన్స్ లేనట్లు కనిపిస్తుంది.. మరి ఈ వారం నామినేషన్స్ గురించి ప్రోమో లో ఏం చెప్పారో ఒకసారి వివరంగా తెలుసుకుందాం..
గత ఎనిమిది సీజన్లలో ఎప్పుడు లేని విధంగా ఈ సీజన్లో 14వ వారం నామినేషన్స్ ప్రక్రియ లేదని తెలుస్తుంది.. ప్రస్తుతం హౌస్ లో ఏడు మంది స్ట్రాంగ్ కంటెస్టెంట్లు ఉన్నారు.. వీరిలో ఈ వారం డబల్ ఎలిమినేషన్ ఉండబోతుందని జనాలు అనుకున్నారు కానీ.. తాజా ఎపిసోడ్ ప్రోమో ని చూస్తే నామినేషన్స్ లేవని తెలుస్తుంది.. మరి ఈ వీక్ ఎవరు? ఎలా? నామినేట్ అవుతారన్నది ప్రశ్నార్థకంగా మారింది.. తాజాగా రిలీజ్ అయిన ప్రోమో ని చూస్తే కంటెస్టెంట్లకు నెంబర్స్ ఇవ్వనున్నట్లు తెలుస్తుంది.. బహుశా ఆ నెంబర్స్ ప్రకారం నామినేట్ చేస్తారేమో ఇవాళ ఎపిసోడ్లో చూడాలి..
14 వ వారంలోకి బిగ్ బాస్ అడుగు పెట్టేసింది.. ఈ వారం మొదటి ఎపిసోడ్ ప్రోమోను బిగ్ బాస్ రిలీజ్ చేసింది.. ఈ ప్రోమో ఎలా ఉందో చూస్తే.. ముందుగా బిగ్ బాస్ ఇన్ని వారాలు మీరు హౌస్ లో అందరితో పోటీ పడుతూ బాగానే రాణించారు.. మీ ముందు ఆరు పెట్టెలు ఉన్నాయి. అందులో నంబర్స్ ఉన్నాయి. వాటి ప్రకారం ఫైనలిస్ట్స్ ఎంపిక అవుతారని బిగ్ బాస్ అంటాడు. గార్డెన్ ఏరియాలో ఏర్పాటు చేసిన ఒక పైప్ నుంచి బాలు కింద పడుతుంది. దాన్ని పట్టుకున్న వాళ్లు హౌస్ మెట్స్ కు నంబర్ ఇవ్వాల్సి ఉంటుందని బిగ్ బాస్ అంటారు. ముందుగా బాలును కళ్యాణ్ అందుకుంటాడు. అతను ఒకరికి నంబర్ ఇస్తాడు. రెండో సారి బాలును భరణి అందుకుంటాడు. అతను ఎవరికి నంబర్ ఇస్తారన్నది తెలియలేదు.. కానీ సంజన, తనూజ ఈ నంబర్స్ గురించి హౌస్ లో చర్చలు మొదలు పెడతారు. మరి సీక్రెట్ గా ఈ నంబర్స్ ద్వారా బిగ్ బాస్ నామినేషన్స్ చేస్తారా? లేదా అన్నది ఇవాళ ఎపిసోడ్ లో తెలిసిపోనుంది.. ప్రోమోను చూస్తుంటే ఈరోజు ఎపిసోడ్ గొడవలకు కేరాఫ్ గా మారబోతుందని తెలుస్తుంది. ఏం జరుగుతుందో తెలుసుకోవాలంటే ఈరోజు జరగబోతున్న ఎపిసోడ్ ని మిస్ అవ్వకుండా చూడాల్సిందే..
Also Read : ఈ ఏడాది గూగుల్లో ఎక్కువమంది సెర్చ్ చేసిన సినిమాలు, వెబ్ సిరీస్ లు ఇవే..
బిగ్ బాస్ మరికొన్ని రోజుల్లో పూర్తికా వస్తున్న నేపథ్యంలో ఈ సీజన్ విన్నర్ ఎవరన్న ప్రశ్నలు జనాల్లో వినిపిస్తున్నాయి.. ఒక్కొక్కరూ ఒక్కొక్కరిని విన్నర్ గా అనుకుంటున్నారు. అయితే ఎక్కువ మంది మాత్రం తనుజ, కళ్యాణ్ ల పేరు చెప్తున్నారు. అటు సోషల్ మీడియాలో కూడా వీరిద్దరిలో ఎవరో ఒకరు విన్నర్ అవుతారని ప్రచారం జరుగుతుంది. ఏది ఏమైనా కూడా విన్నర్ ఎవరో తెలుసుకోవాలంటే ఈ వారం ఆడియన్స్ బిగ్ బాస్ ని అసలు మిస్ అవ్వకుండా చూడాలి..