Virat Kohli Sister Reposted This Anti Modi reel: టీమిండియా స్టార్ క్రికెటర్ విరాట్ కోహ్లీ సోదరి భావనా కొహ్లి ధింగ్రా (Bhawna Kohli Dhingra) వివాదంలో చిక్కుకున్నారు. యూట్యూబర్ ధ్రువ్ రాఠీ, కాక్రోచ్ జనతా పార్టీకి సంబంధించిన ఓ రీల్ ను సోషల్ మీడియాలో ఆమె షేర్ చేశారు. అయితే ఈ రీల్ పూర్తిగా మోడీ ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఉండడమే ఇప్పుడు హాట్ టాపిక్ అయింది. దీంతో భావనా కోహ్లీ ధింగ్రాపై బీజేపీ కార్యకర్తలు సోషల్ మీడియా వారియర్స్ దారుణంగా ట్రోలింగ్ చేయడం మొదలు పెట్టారు.
అయితే ఈ వివాదం రాజుకుంటున్న నేపథ్యంలో వెంటనే కోహ్లీ సోదరి భావనా కోహ్లీ ధింగ్రా అలర్ట్ అయ్యారు. సోషల్ మీడియాలో షేర్ చేసిన వీడియో పై క్లారిటీ ఇచ్చారు. వివాదానికి తెరలేపిన ఆ వీడియోను పొరపాటున రీ-పోస్టు చేశానని ఆమె క్లారిటీ ఇచ్చారు. తనకు ధ్రువ్ రాఠీ, కాక్రోచ్ జనతా పార్టీ లాంటి సంస్థలతో ఎలాంటి సంబంధం లేదని ఆమె వెల్లడించారు. పొరపాటున రిపోర్టు చేసిన వీడియోను ఎవరు పట్టించుకోకూడదని.. ఇది అందరూ అర్థం చేసుకుంటారని ఆమె వ్యాఖ్యానించారు. ఇందులో ఎలాంటి రాజకీయ దృక్పథాలు లేవని కుండబద్దలు కొట్టి చెప్పారు. దీంతో ఈ వివాదానికి చెక్ పెట్టినట్టైంది .
విరాట్ కోహ్లీ సోదరి రీ పోస్ట్ చేసిన వీడియోలో ప్రధాని నరేంద్ర మోడీ అలాగే కేంద్ర ప్రభుత్వ విధానాలపై ధ్రువ్ రాఠీ విమర్శలు తీవ్రస్థాయిలో చేశారు. నిరుద్యోగ సమస్య విపరీతంగా పెరిగిందని… అసలు యువత మాట పట్టించుకోవడం లేదని మోడీ ప్రభుత్వం పై ఆయన ఘాటుగా ఈ వీడియోలో స్పందించారట. దేశ నడిబొడ్డున నిరసనలు తెలిపితే మోడీ ప్రభుత్వం భయపడుతోందని కూడా పేర్కొన్నట్టు సమాచారం.
CJP పనితీరును మెచ్చుకున్నట్టు కూడా ఉందని సమాచారం. ఇది ఇలా ఉండగా ఇటీవల కాలంలోనే విరాట్ కోహ్లీపై కాక్రోచ్ జనతా పార్టీ వ్యవస్థాపకుడు సౌరవ్ దాస్ వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. లండన్ లో విరాట్ కోహ్లీ నివసించడం ఇండియాకు అవమానం అన్నారు. అతడికి దేశమైన గౌరవం లేదంటూ విమర్శలు చేశారు. ఇండియాలోనే విరాట్ కోహ్లీ ఉండాల్సిందని వ్యాఖ్యానించారు. దీంతో కోహ్లీపై కాక్రోచ్ జనతా పార్టీ వ్యవస్థాపకుడు సౌరవ్ దాస్ చేసిన వ్యాఖ్యలు అప్పట్లో వివాదంగా మారాయి. ఇంతలోనే కోహ్లీ సోదరి భావనా కొహ్లి ధింగ్రా (Bhawna Kohli Dhingra) చేసిన రీ పోస్టులు హాట్ టాపిక్ అయ్యాయి.