Vivek Razdhan cooked Fatima Sana: మహిళల ఆసియా కప్ 2026 టోర్నమెంట్ లో (Women’s Asia Cup 2026 Tournament) భాగంగా నిన్న టీమిండియా ఉమెన్స్ వర్సెస్ పాకిస్తాన్ మహిళల (India Women vs Pakistan Women, Match 9) జట్ల మధ్య 9వ మ్యాచ్ దుబాయ్ అంతర్జాతీయ క్రికెట్ స్టేడియం వేదికగా ( Dubai International Cricket Stadium, Dubai) జరిగింది. ఇందులో అద్భుతంగా రాణించిన టీమిండియా మహిళల జట్టు, ఏకంగా ఏడు వికెట్ల తేడాతో బంపర్ విజయాన్ని నమోదు చేసుకుంది.
బౌలింగ్ అదే సమయంలో బ్యాటింగ్ రెండు విభాగాల్లోను అద్భుతంగా రాణించిన టీమిండియా మహిళల జట్టు.. సేఫ్ గేమ్ ఆడి విజయం సాధించేసింది. ఇక మరోసారి ఓటమిపాలైన పాకిస్తాన్ జట్టును సోషల్ మీడియాలో ఏకీపారేస్తున్నారు జనాలు. అయితే ఈ మ్యాచ్ సందర్భంగా పాకిస్తాన్ కెప్టెన్ ఫాతిమా సనా (Fatima Sana) చేసిన ఓవరాక్షన్ పై తీవ్ర దుమారం రాజుకుంది. ఇండియన్ ఓపెనర్ షఫాలీ వర్మను అవుట్ చేసిన తర్వాత… డ్రెస్సింగ్ రూమ్ కు వెళ్లిపో అంటూ ఓవరాక్షన్ చేసింది ఫాతిమా సనా. ఈ వీడియో ఇప్పుడు హాట్ టాపిక్ అయింది.
టీమిండియాతో జరిగిన మ్యాచ్ సందర్భంగా పాకిస్తాన్ కెప్టెన్ ఫాతిమా సనా చేసిన ఓవరాక్షన్ వైరల్ అయిన నేపథ్యంలో ఆమెకు స్ట్రాంగ్ కౌంటర్ ఇస్తున్నారు క్రికెట్ అభిమానులు. తాజాగా ఇదే అంశంపై టీమిండియా మాజీ క్రికెటర్ వివేక్ రజ్దాన్ ( Vivek Razdhan ) కూడా స్పందించారు. 55 పరుగులకు ఆల్ అవుట్ అయినా కూడా పాకిస్తాన్ కెప్టెన్ ఫాతిమా సనాకు సిగ్గు రాలేదా ? అంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు. పరుగులు చేయడం చేతకాదు కానీ.. ఇలా టీమిండియాను రెచ్చగొట్టడం మాత్రం బాగా వచ్చా? అంటూ నిలదీశారు. 55 పరుగులు చేస్తేనే ఇంత ఓవరాక్షన్ చేస్తున్న ఫాతిమా… 150 పరుగుల వరకు రన్స్ చేస్తే… అసలు భూమి మీదనే నిలబడకపోయేది అంటూ చురకలు అంటించారు. ఈ ఓవరాక్షన్ తగ్గించుకుంటేనే పాకిస్తాన్ గాడిలో పడుతుందని కౌంటర్ ఇచ్చారు.
ఉమెన్స్ ఆసియా కప్ 2026 టోర్నమెంట్ సందర్భంగా దుబాయ్ వేదికగా టీమిండియా వర్సెస్ పాకిస్తాన్ మధ్య మ్యాచ్ జరిగింది. ఇందులో మొదటి బ్యాటింగ్ చేసిన పాకిస్తాన్ మహిళల టీమ్ 18.1 ఓవర్లు ఆడింది. ఈ క్రమంలో 55 పరుగులు చేసి కుప్ప కూలింది పాకిస్తాన్ మహిళల జట్టు. ఒక్కరంటే ఒక్కరు కూడా సరిగ్గా రాణించలేదు. టీమిండియా బౌలర్ల దాటికి అడ్రస్ లేకుండా పోయారు. ఈ లక్ష్యాన్ని టీమిండియా 8.4 ఓవర్లలోనే చేదించింది టీమిండియా. మూడు వికెట్లు నష్టపోయి లక్ష్యాన్ని అందుకుంది. దీంతో ఏడు వికెట్ల తేడాతో బంపర్ విజయాన్ని నమోదు చేసుకుంది.