E-Paper
Advertisement

Sai Sudharsan: సాయి సుద‌ర్శ‌న్ కు ఔట్‌..3వ స్థానంలో సుంద‌ర్‌..గంభీర్ పై ట్రోలింగ్స్‌

Sai Sudharsan:  సాయి సుద‌ర్శ‌న్ కు ఔట్‌..3వ స్థానంలో సుంద‌ర్‌..గంభీర్ పై ట్రోలింగ్స్‌
Advertisement

Sai Sudharsan:  టీమిండియా వర్సెస్ దక్షిణాఫ్రికా ( India vs South Africa, 1st Test) మధ్య ఇవాళ్టి నుంచి టెస్ట్ సిరీస్ ప్రారంభమైన సంగతి తెలిసిందే. ఈ రెండు జట్ల మధ్య కలకత్తాలోని ఈడెన్ గార్డెన్స్ ( Eden Gardens, Kolkata ) వేదికగా మొదటి టెస్ట్ జరుగుతోంది. అయితే ఈ టెస్ట్ ప్రారంభమైన నేపథ్యంలో టీమిండియా హెడ్ కోచ్ గౌతమ్ గంభీర్ పై (Gautam Gambhir ) దారుణంగా ట్రోలింగ్స్ మొదలయ్యాయి. సాయి సుదర్శన్ (Sai Sudarshan ) లాంటి కీలక ప్లేయర్ ను జట్టులోంచి తొలగించి, ఆల్ రౌండర్ వాషింగ్టన్ సుందర్ ను ( Washington Sundar) మూడవ స్థానంలో తీసుకుంది టీమిండియా. ఇదంతా గౌతమ్ గంభీర్ ప్లాన్ అంటూ సోషల్ మీడియాలో చర్చ జరుగుతోంది. దీంతో గంభీర్ నుంచి టార్గెట్ చేసి, సీరియ‌స్ అవుతున్నారు ఫ్యాన్స్.

Also Read: PAK vs SL 2nd ODI: ఇస్లామాబాద్ లో బ్లాస్టింగ్‌..పాకిస్తాన్ నుంచి పారిపోయిన 16 మంది శ్రీలంక ప్లేయ‌ర్లు, వ‌న్డే సిరీస్ ర‌ద్దు ?

సాయి సుదర్శన్ కు నో ఛాన్స్, రంగంలోకి సుందర్

Advertisement

దక్షిణాఫ్రికా వర్సెస్ టీమ్ ఇండియా మధ్య మొదటి టెస్ట్ కాసేపటికి క్రితమే ప్రారంభమైంది. ఇందులో టాస్ గెలిచిన దక్షిణాఫ్రికా మొదట బ్యాటింగ్ చేయాలని డిసైడ్ అయింది. అయితే, టాస్ ముగిసిన తర్వాత టీమిండియా జట్టును ప్రకటించారు శుభమాన్‌ గిల్. ఈ లిస్టులో సాయి సుదర్శన్ లాంటి కీలక ప్లేయర్ కు ఛాన్స్ దక్కలేదు. అతని స్థానంలో మూడవ వికెట్ కోసం వాషింగ్టన్ సుందర్ ను తీసుకుంది టీమిండియా. ఆల్ రౌండర్ గా వాషింగ్ట‌న్ సుంద‌ర్ ప‌నికి వ‌స్తాడ‌న్న ఉద్దేశ్యంతో, అత‌న్ని తీసుకున్న‌ట్లు తెలుస్తోంది. అయితే, ఫ్యాన్స్ మాత్రం దీనిపై పెద‌వి విరుస్తున్నారు. వ‌ర‌ల్డ్ టెస్ట్ ఛాంపియ‌న్స్ ట్రోఫీ వ‌స్తున్న నేప‌థ్యంలో సాయి సుద‌ర్శ‌న్ ను ప‌క్క‌కు పెడితే, టీమిండియా రాణించ‌డం క‌ష్ట‌మేన‌ని అంటున్నారు. విరాట్ కోహ్లీ రేంజ్ లో ఆడే సాయి సుద‌ర్శ‌న్ త‌ప్పించ‌డం దారుణమంటున్నారు. ఇది ఇలా ఉండ‌గా, లంచ్ బ్రేక్ స‌మ‌యానికి క‌ష్టాల్లో ప‌డింది ద‌క్షిణాఫ్రికా. 27 ఓవ‌ర్లు ఆడిన ద‌క్షిణాఫ్రికా 3 వికెట్లు న‌ష్ట‌పోయి 105 ప‌రుగులు సాధించింది. 3.89 ర‌న్ రేట్ సాధించింది. బుమ్రా రెండు వికెట్లు ప‌డ‌గొట్ట‌గా, కుల్దీప్ యాద‌వ్ ఒక వికెట్ తీశారు.

ఇరు జ‌ట్లు ఇవే

దక్షిణాఫ్రికా (ప్లేయింగ్ XI): ఐడెన్ మార్క్‌రామ్, ర్యాన్ రికెల్టన్, వియాన్ ముల్డర్, టెంబా బావుమా (C ), టోనీ డి జోర్జి, ట్రిస్టన్ స్టబ్స్, కైల్ వెర్రెయిన్(w), సైమన్ హార్మర్, మార్కో జాన్సెన్, కార్బిన్ బాష్, కేశవ్ మహారాజ్

Advertisement

భారత్ (ప్లేయింగ్ XI): యశస్వి జైస్వాల్, కెఎల్ రాహుల్, వాషింగ్టన్ సుందర్, శుభ్‌మన్ గిల్ (C), రిషబ్ పంత్ (w), రవీంద్ర జడేజా, ధ్రువ్ జురెల్, అక్షర్ పటేల్, కుల్దీప్ యాదవ్, జస్ప్రీత్ బుమ్రా, మహ్మద్ సిరాజ్

Also Read: PAK VS SL: పాకిస్తాన్ లో చ‌చ్చినా ప‌ర్లేదు, మ్యాచ్ ఆడండి..లేక‌పోతే 2 ఏళ్ల బ్యాన్‌…శ్రీలంక బోర్డు హెచ్చ‌రిక‌లు

Related News

రిజ్వాన్ చేత‌కాని ద‌ద్ద‌మ్మ‌…భ‌విష్య‌తుల్లో పాకిస్తాన్ తరఫున మళ్లీ ఆడ‌కుండా చేస్తా

రెండు టైటిల్స్ గెలిచినా, RCB ప్లేయ‌ర్లను జంతువుల కంటే హీనంగా చూస్తున్నారు

మిస్ట‌ర్ భువీ..ఇక చాలు, అన్ని మూసుకుని రిటైర్మెంట్ ఇచ్చి ఇంట్లో కూర్చో

ఇలానే వదిలేస్తే, ఇమ్రాన్ ఖాన్ ఏ క్షణమైనా చావడం పక్కా..!

దున్న‌పోతుల్లా తిన‌డం త‌ప్ప‌…మా ద‌ద్ద‌మ్మ‌ల‌కు ఆడ‌టం చేత‌కాదు

రిటైర్మెంట్ ఇచ్చే వ‌రకు శ్రేయస్ అయ్యర్ కెప్టెన్ గా కొన‌సాగుతాడు

బాబర్ ఆజం, షాహీన్ అఫ్రిది మధ్య గొడవలే పాకిస్తాన్ కు ఈ దరిద్రం

బాబ‌ర్ ఆజంకు చేత‌కాదు, నాకు కెప్టెన్సీ ఇవ్వండి !

Big Stories

Advertisement
×