Wasim Akram: ఇండియన్ ప్రీమియర్ లీగ్ 2026 టోర్నమెంట్ ( Indian Premier League 2026 Tournament) నేపథ్యంలో వైభవ్ సూర్య వంశీ ( Vaibhav suryavanshi) పేరు మార్మోగుతోంది. 13 ఏళ్ల వయసులోనే ఇండియన్ ప్రీమియర్ లీగ్ టోర్నమెంట్లో అడుగుపెట్టిన వైభవ్ సూర్యవంశీ, ఇప్పుడు బుమ్రా లాంటి బౌలర్లను కూడా చీల్చి చెండాడుతున్నాడు. ఈ క్రమంలోనే వైభవ్ సూర్యవంశీ పై మాజీ క్రికెటర్లు అటు పాకిస్తాన్ ఆటగాళ్లు కూడా ప్రశంసల వర్షం కురిపిస్తున్నారు. తాజాగా పాకిస్తాన్ మాజీ ఫాస్ట్ బౌలర్ వసీం అక్రమ్ ( Wasim Akram ) కూడా వైభవ్ సూర్య వంశీపై ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. 15 ఏళ్ల వైభవ్ సూర్య వంశీకి బౌలింగ్ చేయాలంటే తమ పాకిస్తాన్ బౌలర్లు కూడా గజగజ వణికి పోతారని బాంబు పేల్చారు. బుమ్రానే ( Bumrah) ఉతికి ఆరేశాడు.. ఇక మా పాకిస్తాన్ బౌలర్లు ఒక లెక్కనా ? అంటూ ఓ రేంజ్ లో రియాక్ట్ అయ్యారు వసీం అక్రమ్.
Also Read: Virender Sehwag: రాసిపెట్టుకోండి…బుమ్రా బౌలింగ్ లో వైభవ్ 6 బంతుల్లో ఆరు సిక్సరు కొడతాడు
ఇండియన్ ప్రీమియర్ లీగ్ 2026 టోర్నమెంట్ ( Indian Premier League 2026 Tournament) నేపథ్యంలో ముంబై ఇండియన్స్ వర్సెస్ రాజస్థాన్ రాయల్స్ మధ్య రెండు రోజుల కిందట మ్యాచ్ జరిగింది. వర్షం కారణంగా ఈ మ్యాచ్ 11 ఓవర్లకు కుదించేశారు. ఈ క్రమంలో 11 ఓవర్లలో 150 పరుగులు చేసి చరిత్ర సృష్టించింది రాజస్థాన్ రాయల్స్. ఈ మ్యాచ్ లో కేవలం 14 బంతుల్లో 46 పరుగులు చేసి అదరగొట్టాడు వైభవ్ సూర్యవంశీ. ముఖ్యంగా బుమ్రా బౌలింగ్ లో రెండు సిక్సర్లు కొట్టడం హైలైట్ గా నిలిచింది. బుమ్రా అంటే ఎలాంటి భయం లేకుండా ఉతికి ఆరేశాడు వైభవ్ సూర్యవంశీ. దీంతో సోషల్ మీడియాలో వైభవ్ గురించి కూడా కోడై కూస్తున్నారు. తాజాగా పాకిస్తాన్ మాజీ ఫాస్ట్ బౌలర్ వసీం అక్రమ్ ( Wasim Akram) కూడా దీనిపై ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు.
15 ఏళ్ల కుర్రాడు వైభవ్, బుమ్రా లాంటి నెంబర్ వన్ బౌలర్లకు కూడా భయపడడం లేదని వ్యాఖ్యానించారు. ముంబైలో బోల్ట్, శార్దుల్ ఠాకూర్, దీపక్ చాహర్ లాంటి పెద్ద బౌలర్లు ఉన్నా కూడా ఏ మాత్రం వెనకడుగు వేయలేదని గుర్తు చేశారు. అందరి బౌలింగ్ లో సిక్సర్లు కొట్టి శభాష్ అనిపించాడని కొనియాడారు వసీమక్రం. ముఖ్యంగా బుమ్రా బౌలింగ్ లో రెండు సిక్సర్లు కొట్టడం హైలైట్ అయిందన్నారు. బుమ్రా లాంటి బౌలర్లను ఉతికి ఆరేసిన వైభవ్, పాకిస్తాన్ ప్లేయర్లకు చుక్కలు చూపిస్తాడని హెచ్చరించారు. ఇలాంటి 15 ఏళ్ల వైభవ్ కు బౌలింగ్ వేయాలన్నా కూడా పాకిస్తాన్ బౌలర్లు భయపడిపోతారని సెటైర్లు పేల్చారు. భవిష్యత్తులో వైభవ్ కు బౌలింగ్ వేసే పరిస్థితి రాకుండా పాకిస్తాన్ బౌలర్లు అల్లాను మొక్కుకోవాల్సిందేనని చురకలు అంటించారు.
Also Read: Tanveer Ahmed: వైభవ్ పచ్చి మోసగాడు…వాడి ఏజ్ ఒక్కటే కాదు, బ్యాట్లు కూడా చెక్ చేయాల్సిందే