IND VS AFG: ఆఫ్ఘనిస్తాన్ వర్సెస్ టీమిండియా (India vs Afghanistan, One-off Test) మధ్య ఏకైక టెస్టు సిరీస్ మూడు రోజుల కిందట ప్రారంభమైన సంగతి తెలిసిందే. ఇందులో అద్భుతంగా రాణించిన టీమిండియా ఆఫ్ఘనిస్తాన్ పై గ్రాండ్ విక్టరీ కొట్టింది. ఆఫ్ఘనిస్తాన్ పై ఏకంగా 300 పరుగుల తేడాతో బంపర్ విజయాన్ని నమోదు చేస్తుంది. ఈ మ్యాచ్ లో ఫాలోవన్ ఆడిన ఆఫ్ఘనిస్తాన్.. టీమిండియా బౌలర్ల దెబ్బకు విలవిల లాడిపోయింది. ఈ క్రమంలో మూడు రోజుల్లోనే మ్యాచ్ ఫినిష్ అయింది.
Also Read: Tanveer Ahmed: బాబర్ ను ( babar azam) ఐపీఎల్ లోకి తీసుకోండి..వైభవ్ కంటే భయంకరంగా ఆడతాడు
ఆఫ్గనిస్తాన్ వర్సెస్ టీమ్ ఇండియా (India vs Afghanistan, One-off Test) మధ్య టెస్ట్ సిరీస్ జరిగిన నేపథ్యంలో కెప్టెన్ శుభ్మన్ గిల్ కు (Shubman Gill) ఘోర అవమానం ఎదురైంది. ఈ టెస్ట్ సందర్భంగా వికెట్ కీపర్ రిషబ్ పంత్ రెచ్చిపోయి ప్రవర్తించాడు. తానే కెప్టెన్ అన్నట్లుగా బిహేవ్ చేశాడు. కెప్టెన్ గిల్ ను కూడా లెక్కచేయకుండా… అతన్నే ఫీల్డింగు చేయమని ఆదేశాలు జారీ చేశాడు. రెండో ఇన్నింగ్స్ లో మొత్తం అతడే ఫీల్డింగ్ సెట్ చేశాడు.. అటు డ్రెస్సింగ్ రూమ్ లో బౌలర్లతో చర్చలు కూడా చేశాడు రిషబ్ పంత్ (Rishabh Pant).
ఈ క్రమంలో ఈ సంఘటనకు సంబంధించిన ఫోటోలు అలాగే వీడియోలు వైరల్ గా మారాయి. దీంతో టీమిండియా కెప్టెన్ అసలు గిల్ ఆ ? లేక రిషబ్ పంతా ? అంటూ సోషల్ మీడియాలో దారుణంగా కామెంట్లు చేస్తున్నారు క్రికెట్ అభిమానులు. దీనిపై పాకిస్తాన్ బలాదూర్లు కూడా రెచ్చిపోయి పోస్టులు పెడుతున్నారు. అసలు టీమిండియాలో ఏం జరుగుతోంది ? ఎవడు కెప్టెన్ గా ఉన్నాడో తెలియడం లేదని బాంబు పేల్చుతున్నారు. టీమిండియాలో చీలిక వచ్చిందని పోస్టులు పెడుతున్నారు.
ఆఫ్ఘనిస్తాన్ తో జరిగిన ఏకైక టెస్ట్ సిరీస్ లో టీమిండియా విజయం సాధించింది. ఈ టెస్ట్ మ్యాచ్ మూడు రోజుల్లో ఫినిష్ కాగా.. 300 పరుగుల తేడాతో టీమిండియా విక్టరీ సాధించింది. ఇందులో మొదటి బ్యాటింగ్ చేసిన టీమ్ ఇండియా ఎనిమిది వికెట్ల నష్టానికి 564 పరుగులు సాధించింది. అటు ఆఫ్ఘనిస్తాన్ మొదటి ఇన్నింగ్స్ లో 152 పరుగులు చేయగా.. ఫాలో ఆన్ ఆడింది. ఇందులో కూడా 112 పరుగులకే కుప్ప కూలింది. దీంతో ఆఫ్ఘనిస్తాన్ పై టీమిండియా విక్టరీ సాధించింది. ఈ తరుణంలోనే టెస్ట్ సిరీస్ కైవసం చేసుకుంది. ఇక ఈ నెల 13వ తేదీ నుంచి 3 వన్డేల సిరీస్ ఆఫ్ఘనిస్తాన్ తో జరగనుంది. అనంతరం ఐర్లాండ్, ఇంగ్లాండ్ తో టీ20లు ఆడనుంది టీమిండియా.
🚨 WHO IS THE INDIA'S TEST CAPTAIN AGAINST AFGANISTAN 🚨
Who is CAPTAIN – Rishabh pant or shubman gill
– Rishabh pant is doing everything on field behind the wicket
– He is setting the fielding
– He is giving the suggestion to blowers like Manav Suthar & kuldeep yadav etc
-… pic.twitter.com/UFy9wzJZyF— VK (@Aur_vicky) June 8, 2026