E-Paper
Advertisement

బ్యాటరీ యాజ్ ఎ సర్వీస్ అంటే ఏంటి? EV కొనుగోలుదారులకు లాభమా? నష్టమా?

బ్యాటరీ యాజ్ ఎ సర్వీస్ అంటే ఏంటి? EV కొనుగోలుదారులకు లాభమా? నష్టమా?
Advertisement

Battery Subscription for EVs:  ఎలక్ట్రిక్ వెహికల్స్ ధరలు ఎక్కువగా ఉండటానికి ప్రధాన కారణం వాటిలో ఉండే బ్యాటరీ.   వాహనం మొత్తం ధరలో ఎక్కువగా బ్యాటరీదే ఉంటుంది. ఈ సమస్యకు పరిష్కారంగా వచ్చిన విధానమే బ్యాటరీ యాజ్ ఎ సర్వీస్ (BaaS). ఈ స్కీమ్ లో కారును మాత్రమే కొనుగోలు చేస్తారు. బ్యాటరీని కొనరు. బ్యాటరీ యాజమాన్యం కంపెనీ , ఫైనాన్స్ భాగస్వామి దగ్గరే ఉంటుంది. దానిని ఉపయోగించేందుకు మీరు నెలవారీగా లేదంటే వినియోగానికి అనుగుణంగా చెల్లింపులు చేస్తారు. దీంతో ఈవీ కాస్ట్ చాలా తగ్గుతుంది.

కారు మీద.. బ్యాటరీ కంపెనీది!

సాధారణంగా BaaSలో రెండు ఒప్పందాలు ఉంటాయి. ఒకటి వాహన యాజమాన్యం, రెండోది బ్యాటరీ సబ్‌ స్క్రిప్షన్. కారు మీ పేరుపైనే రిజిస్టర్ అవుతుంది. కానీ, బ్యాటరీ మాత్రం కంపెనీ సొంతంగానే ఉంటుంది. దేశంలో ప్రస్తుతం ఎక్కువ EVలు ఫిక్స్‌ డ్ బ్యాటరీ సబ్‌ స్క్రిప్షన్ విధానంలోనే అందుబాటులో ఉన్నాయి. అంటే, బ్యాటరీ వాహనంలో శాశ్వతంగా అమర్చబడి ఉంటుంది. మీరు ఇంట్లో, పబ్లిక్ ఛార్జింగ్ స్టేషన్‌లో ఛార్జ్ చేసుకోవచ్చు. తేడా ఒక్కటే.. బ్యాటరీ మీ సొంతం కాదు.

భారీగా ధర తగ్గే అవకాశం

Advertisement

BaaS వల్ల EV ధరలు లక్షల రూపాయలు తగ్గే అవకాశం ఉంది. ఉదాహరణకు టాటా టియాగో EV ధర రూ.6.99 లక్షల నుంచి రూ.4.69 లక్షలకు, MG కామెట్ EV రూ.6.99 లక్షల నుంచి రూ.4.99 లక్షలకు, టాటా పంచ్ EV రూ.9.69 లక్షల నుంచి రూ.6.49 లక్షలకు తగ్గుతుంది. MG విండ్సర్, MG ZS EV, మారుతి ఈ విటారా, కియా కారెన్స్ క్లావిస్ EV లాంటి మోడళ్లలో కూడా 4 నుంచి 5 లక్షల వరకు ప్రారంభ ధర తగ్గుతోంది.

బ్యాటరీ కోసం ప్రత్యేక ఛార్జ్

తక్కువ ధరకు కారు కొనుగోలు చేసిన తర్వాత బ్యాటరీ కోసం ప్రత్యేకంగా చెల్లించాల్సి ఉంటుంది. కొన్ని కంపెనీలు కిలోమీటరుకు రుసుము వసూలు చేస్తాయి. మరికొన్ని నెలవారీ సబ్‌స్క్రిప్షన్ విధానాన్ని అమలు చేస్తాయి. ఉదాహరణకు కిలోమీటరుకు రూ.3.90 చొప్పున చార్జ్ చేస్తే, నెలకు 1,500 కిలోమీటర్లు ప్రయాణించే వ్యక్తి బ్యాటరీ కోసం మాత్రమే దాదాపు రూ.5,800 చెల్లించాల్సి రావచ్చు. దీనికి అదనంగా ఛార్జింగ్ కోసం విద్యుత్ ఖర్చు కూడా ఉంటుంది.

Advertisement

తక్కువ డౌన్ పేమెంట్, తక్కువ EMIలు కోరుకునే వారికి BaaS మంచి ఎంపిక కావచ్చు. అలాగే తరచూ ఈవీ ఉపయోగించే వారు కూడా దీని ద్వారా ప్రయోజనం పొందగలరు. మరో ముఖ్యమైన విషయం ఏమిటంటే, బ్యాటరీ పనితీరు తగ్గినా,  బ్యాటరీ ఛేంజ్ చేయాల్సి వచ్చినా దాని బాధ్యత కంపెనీపైనే ఉంటుంది.

అందరికీ BaaS సూటవుతుందా?

నిజం చెప్పాలంటే BaaS అనేది అందరికీ సరిపోదు. నెలకు తక్కువ దూరం మాత్రమే ప్రయాణించే వారికి సబ్‌ స్క్రిప్షన్ చార్జీలు భారంగా మారుతాయి. అలాగే 8-10 సంవత్సరాల పాటు కారును ఉంచుకోవాలనుకునే వారు దీర్ఘకాలంలో బ్యాటరీ ఫీజుల రూపంలో ఎక్కువ మొత్తాన్ని చెల్లించే అవకాశం ఉంది. వాహనం అమ్మే సమయంలో బ్యాటరీ ఒప్పందాన్ని కొత్త యజమానికి బదిలీ చేయాల్సి రావడం కూడా కొంత ఇబ్బందిగా మారవచ్చు.

Read Also: ఎలక్ట్రిక్ To హైబ్రిడ్.. భారత మార్కెట్లోకి ఎంట్రీ ఇవ్వబోతున్న సూపర్ 7-సీటర్ SUVలు ఇవే!

Related News

జూలైతో పోల్చితే ఆగస్టులో తగ్గిన EV స్కూటర్ అమ్మకాలు.. కారణం ఏంటంటే?

కైనెటిక్ లవర్స్ కు గుడ్ న్యూస్.. ఇప్పుడు ఏకంగా 132 కి.మీ రేంజ్!

టెస్లా సైబర్‌ ట్రక్‌కు ఇండియన్ టచ్.. ఫొటోలు చూస్తే నవ్వు ఆపుకోలేరు!

నెక్సాన్ To కర్వ్.. సెప్టెంబర్ లో టాటా కార్లపై ఊహించని డిస్కౌంట్లు!

మహీంద్రా SUVలపై భారీ డిస్కౌంట్లు.. స్కార్పియో Nపై ఏకంగా రూ.3 లక్షల తగ్గింపు!

ఎలక్ట్రిక్ స్కూటర్లకు సూపర్ డిమాండ్.. 8 నెలల్లోనే 13 లక్షలకు పైగా అమ్మకాలు!

సింపుల్ ఎనర్జీ సూపర్ జోష్.. ఏడాదిలో 10 వేలకుపైగా ఈవీ స్కూటర్ల సేల్!

ఈవీ రంగంలో హీరో దూకుడు.. నంబర్ వన్ కోసం అదిరిపోయే ప్లాన్!

Big Stories

Advertisement
×