E-Paper
Advertisement

షాహీన్ అఫ్రిదికి రంకు మొగుడు.. పాకిస్తాన్ ఆక‌లి తీర్చే మ‌గాడు…ఇంత‌కు ఎవ‌రీ ఖుర్రం షెహజాద్ ?

షాహీన్ అఫ్రిదికి రంకు మొగుడు.. పాకిస్తాన్ ఆక‌లి తీర్చే మ‌గాడు…ఇంత‌కు ఎవ‌రీ ఖుర్రం షెహజాద్ ?
Advertisement

Khurram Shehzad VS Shaheen:  ఇండియన్ ప్రీమియర్ లీగ్ 2026 టోర్నమెంట్ (Indian Premier League 2026 Tournament) ఒక పక్క జరుగుతుంటే… మరోవైపు బంగ్లాదేశ్ వర్సెస్ పాకిస్తాన్ (Bangladesh vs Pakistan) మధ్య టెస్ట్ సిరీస్ కొనసాగుతోంది. ఈ టోర్నమెంట్ లో ఇప్పటికే మొదటి టెస్ట్ ఫినిష్ అయింది. ఇవాల్టి నుంచి రెండవ టెస్ట్ కూడా షురూ అయింది. అయితే మొదటి టెస్ట్ లో దారుణంగా ఓడిపోయిన పాకిస్తాన్, భారీ మార్పులతో రెండో టెస్టులో బరిలోకి దిగింది. ముఖ్యంగా ఫాస్ట్ బౌలర్ షాహీన్ అఫ్రిదిని (Shaheen Afridi ) పక్కకు పెట్టిన షాన్ మసూద్, కొత్త బౌలర్ ఖుర్రం షెహజాద్ ను ( Khurram Shehzad) బరిలోకి దింపాడు. అయితే ఖుర్రం షెహజాద్ ను తీసుకు వచ్చిన షాన్ మసూద్…కెప్టెన్ గా వందకు రెండు వందల శాతం సక్సెస్ అయ్యాడు. తొలిరోజు ముగియ‌క‌ ముందే బంగ్లాదేశ్ ఆల్ అవుట్ అయ్యేలా ప్రణాళికలు వేశాడు. షాహీన్ అఫ్రిది స్థానంలో వచ్చిన ఖుర్రం షెహజాద్ అద్భుతంగా రాణించి, నాలుగు వికెట్లు పడగొట్టారు.

Also Read: జాకబ్ బెథెల్ గోల్డ్ చైన్ దొంగిలించిన RCB ఫ్యాన్స్ ? పాకిస్తాన్ వెధ‌వ‌ల్లాగా త‌యారు అవుతున్నారంటూ ట్రోల్స్!

షాహీన్ అఫ్రిదికి రంకు మొగుడు.. పాకిస్తాన్ ఆక‌లి తీర్చే మ‌గాడు

Advertisement

బంగ్లాదేశ్ వర్సెస్ పాకిస్తాన్ మధ్య తొలి టెస్ట్ ఇవాళ ప్రారంభమైన సంగతి తెలిసిందే. సిల్హెట్ అంతర్జాతీయ క్రికెట్ స్టేడియం వేదికగా ఈ రెండు జట్ల మధ్య రెండో టెస్ట్ ప్రారంభమైంది. ఇందులో టాస్ ఓడిపోయి మొదట బ్యాటింగ్ చేసింది బంగ్లాదేశ్. ఈ క్రమంలో 77 ఓవర్లు వాడిన బంగ్లాదేశ్ 278 పరుగుల వద్ద ఆల్ ఔట్ అయింది. బంగ్లాదేశ్ లో వికెట్ కీపర్ లిటన్ దాస్ ఒక్కడు మాత్రమే 126 పరుగులు చేసి రాణించారు. ఇక మిగిలిన ప్లేయర్లు ఎవరూ కూడా పెద్దగా రాణించలేదు. దీంతో 278 పరుగులు మాత్రమే చేసింది బంగ్లాదేశ్. అయితే బంగ్లాదేశ్ ఇంత తక్కువ పరుగులకు ఆల్ అవుట్ కావడానికి ముఖ్య కారణం ఫాస్ట్ బౌలర్ ఖుర్రం షెహజాద్. షాహీన్ అఫ్రిది స్థానంలో వచ్చిన ఖుర్రం షెహజాద్ 81 పరుగులు ఇచ్చి ఏకంగా నాలుగు వికెట్లు పడగొట్టాడు.

ఆ నాలుగు వికెట్లు కూడా చాలా కీలకమైనవి. దీంతో బంగ్లాదేశ్ కోలు కోలేకపోయింది. ఈ క్రమంలో సోషల్ మీడియాలో ఖుర్రం షెహజాద్ గురించి తెగ సెర్చ్ చేస్తున్నారు. ప్రీమియర్ బౌలర్ అని చెప్పుకునే షాహీన్ అఫ్రిది స్థానంలో ఇకపైన ఖుర్రం షెహజాద్ ను మాత్రమే ఆడించాలని డిమాండ్ చేస్తున్నారు క్రికెట్ అభిమానులు. షాహీన్ అఫ్రిది బిల్డప్ ఎక్కువ బిజినెస్ తక్కువ అన్నట్లుగా వ్యవహారం తయారైందని.. వాడిని ఏ టోర్నమెంట్ కు కూడా సెలెక్ట్ చేయకూడదని కోరుతున్నారు. షాహిన్ అఫ్రిదికి రంకు మొగుడి లాగా సహజ తయారయ్యాడని.. పాకిస్తాన్ ఆకలి తీర్చే మగాడు అయ్యాడని ఖుర్రం షెహజాద్ పైన సోషల్ మీడియాలో పోస్టులు పెడుతున్నారు.

ఇంత‌కు ఎవ‌రీ ఖుర్రం షెహజాద్ ?

Advertisement

బంగ్లాదేశ్ తో జరుగుతున్న రెండో టెస్ట్ సందర్భంగా ఖుర్రం షెహజాద్ అద్భుతంగా రాణిస్తున్నాడు. ఈ మ్యాచ్ లో 4 వికెట్లు పడగొట్టాడు. ఇతను పాకిస్తాన్ లోని పంజాబ్ లో 1999 నవంబర్ 25వ తేదీన జన్మించాడు. ఇతడు కుడి చేతి మీడియం ఫాస్ట్ బౌలర్ అన్న సంగతి తెలిసిందే. ఇప్పటి వరకు 7 అంతర్జాతీయ టెస్టులు మాత్రమే ఆడాడు. ఆస్ట్రేలియాతో జరిగిన టెస్ట్ లోనే అరంగేట్రం చేశాడు. ఇప్పటివరకు ఏడు మ్యాచ్ ల‌లో మొత్తం 24 వికెట్లు పడగొట్టాడు. ఫస్ట్ క్లాస్ క్రికెట్ లో 69 మ్యాచ్లో 241 వికెట్లు తీయడం జరిగింది. దీంతో షాహీన్ అఫ్రిది స్థానంలో ఇకపైన ఖుర్రం షెహజాద్ ను తీసుకోవాలని డిమాండ్ చేస్తున్నారు ఫ్యాన్స్.

 

Also Read: రాజీవ్ శుక్లా భాగోతం బ‌య‌ట‌పెట్టిన ల‌లిత్ మోడీ…ఐపీఎల్ లో ఛాన్స్ ఇస్తామ‌ని డ‌బ్బులు వ‌సూళ్లు, ప్రైవేట్ వీడియోలు చూపించి !

 

 

Related News

గోల్ కీపర్ మార్టినెజ్ ఒక్క‌డు లేక‌పోతే…10-0 తేడాతో అర్జెంటీనా ఓడిపోయేది

సెంచ‌రీ చేసినా రోహిత్ శ‌ర్మ‌పై ఆగ‌ని ట్రోలింగ్…స్లో బ్యాటింగ్ అంటూ వాయించేస్తున్నారుగా

ఫిఫా వ‌ర‌ల్డ్ క‌ప్ 2026 విజేతగా స్పెయిన్‌..ఏకంగా 16 ఏళ్ల త‌ర్వాత స‌రికొత్త చ‌రిత్ర‌

రోహిత్ శ‌ర్మ లార్డ్స్ సెంచ‌రీ వెనుక సీక్రెట్ ఇదే, అత‌ని వ‌ల్లే ల‌క్ క‌లిసివ‌చ్చిందా?

గంభీర్ వెనక కోహ్లీ కుప్పిగంతులు..అస‌భ్యక‌రంగా చేతులు చూపిస్తూ డ్యాన్స్

లార్ట్స్ మైదానంలో ఈ గంట కొట్ట‌డానికి కార‌ణం ఏంటి? దీని వెనుక ఉన్న‌ర‌హ‌స్యం

రోహిత్ శ‌ర్మ‌, కోహ్లీ ఇద్ద‌రూ టీమిండియాకు హార్ట్ బీట్ లాంటోళ్లు..వాళ్ల‌ను ట‌చ్ చేయెద్దు

ఫిఫా వ‌ర‌ల్డ్ క‌ప్ 2026 ఫైన‌ల్ మ్యాచ్ టైమింగ్స్ ఇవే..ఇండియాలో లైవ్ ఎప్పుడంటే ?

Big Stories

Advertisement
×