E-Paper
Advertisement

భారత కార్ల మార్కెట్‌ లో మారుతి దూకుడు, టాప్ 10లో ఏకంగా 6 మోడళ్లు అవే!

భారత కార్ల మార్కెట్‌ లో మారుతి దూకుడు, టాప్ 10లో ఏకంగా 6 మోడళ్లు అవే!
Advertisement

Best Selling Cars in May 2026: భారత కార్ల మార్కెట్లో మేలోనూ మారుతి సుజుకి తన ఆధిపత్యాన్ని కొనసాగించింది. అత్యధికంగా అమ్ముడైన టాప్-10 కార్ల జాబితాలో ఏకంగా ఆరు మారుతి మోడళ్లు చోటు దక్కించుకోగా, మొదటి మూడు స్థానాలు కూడా మారుతి ఖాతాలోకే వెళ్లాయి. సెడాన్, క్రాస్‌ ఓవర్, MPV లాంటి విభిన్న విభాగాల్లో వినియోగదారులను ఆకట్టుకుంటూ కంపెనీ బలమైన అమ్మకాలను నమోదు చేసింది.

1.మారుతి డిజైర్

అత్యధికంగా అమ్ముడైన కారుగా మారుతి డిజైర్ నిలిచింది. మే నెలలో ఈ కాంపాక్ట్ సెడాన్ 24,546 యూనిట్లు అమ్ముడైంది. గత ఏడాది ఇదే కాలంతో పోలిస్తే.. 36 శాతం వృద్ధిని నమోదు చేసింది. డిజైర్ ధరలు రూ. 6.26 లక్షల నుంచి ప్రారంభమవుతున్నాయి.

2.మారుతి ఫ్రాంక్స్

Advertisement

రెండో స్థానంలో మారుతి ఫ్రాంక్స్ నిలిచింది. ఈ క్రాస్‌ ఓవర్ SUV మే నెలలో 20,686 యూనిట్లు సేల్ అయ్యాయి.  గత ఏడాదితో పోలిస్తే 52 శాతం వృద్ధి నమోదు చేయడం విశేషం.

3.మారుతి ఎర్టిగా

మూడో స్థానంలో మారుతి ఎర్టిగా నిలిచింది. దేశంలో అత్యధికంగా అమ్ముడవుతున్న MPVగా కొనసాగుతున్న ఎర్టిగా 20,350 యూనిట్ల అమ్మకాలతో మరోసారి మంచి ఫలితాలు సాధించింది.

4.టాటా పంచ్

Advertisement

నాలుగో స్థానంలో టాటా పంచ్ ఉంది. పంచ్, పంచ్ EV కలిపి 20,208 యూనిట్లు అమ్ముడయ్యాయి. అమ్మకాలు పెరిగినప్పటికీ ర్యాంకింగ్‌ లో ఒక స్థానం వెనక్కి వెళ్లింది.

5.టాటా నెక్సాన్

ఐదో స్థానంలో టాటా నెక్సాన్ నిలిచింది. 19,100 యూనిట్ల అమ్మకాలతో ఈ SUV గత ఏడాదితో పోలిస్తే 46 శాతం వృద్ధిని సాధించింది.

6.మారుతి బాలెనో

ఆరవ స్థానంలో మారుతి బాలెనో నిలిచింది. 18,396 యూనిట్ల అమ్మకాలతో ఈ ప్రీమియం హ్యాచ్‌ బ్యాక్ టాప్-10 జాబితాలో అత్యధిక వార్షిక వృద్ధి రేటును నమోదు చేసింది.

7.మారుతి వాగన్ ఆర్

ఏడో స్థానంలో మారుతి వాగన్ ఆర్ నిలిచింది. మే నెలలో ఈ హ్యాచ్‌ బ్యాక్ 18,076 యూనిట్లు విక్రయించింది.

8.మారుతి స్విఫ్ట్

ఎనిమిదో స్థానంలో మారుతి స్విఫ్ట్ ఉంది. 17,519 యూనిట్ల అమ్మకాలతో ఇది కూడా మంచి వృద్ధిని నమోదు చేసింది.

9.మహీంద్రా స్కార్పియో

తొమ్మిదో స్థానంలో మహీంద్రా స్కార్పియో నిలిచింది. స్కార్పియో క్లాసిక్, స్కార్పియో N మోడళ్లు కలిపి 15,774 యూనిట్లు విక్రయించబడ్డాయి.

10.హ్యుందాయ్ క్రెటా

పదో స్థానంలో హ్యుందాయ్ క్రెటా నిలిచింది. మిడ్-సైజ్ SUV విభాగంలో క్రెటా ఇంకా బలమైన స్థానాన్ని కొనసాగిస్తున్నప్పటికీ, ఇతర కంపెనీల నుంచి పెరుగుతున్న పోటీ కారణంగా మొత్తం జాబితాలో 10వ స్థానానికి పరిమితమైంది. మే నెలలో ఈ SUV 15,523 యూనిట్లు అమ్ముడైంది.

మే 2026లో భారత మార్కెట్లో మారుతి సుజుకి పూర్తి ఆధిపత్యాన్ని ప్రదర్శించింది. అదే సమయంలో టాటా, మహీంద్రా, హ్యుందాయ్ మోడళ్లు కూడా టాప్-10 జాబితాలో తమ స్థానాలను నిలబెట్టుకుని పోటీలో నిలిచాయి.

Read Also: హోండా To BMW.. జూన్‌ లో మార్కెట్ లోకి అడుగు పెట్టబోతున్న 7 కొత్త కార్లు ఇవే!

Related News

జూలైతో పోల్చితే ఆగస్టులో తగ్గిన EV స్కూటర్ అమ్మకాలు.. కారణం ఏంటంటే?

కైనెటిక్ లవర్స్ కు గుడ్ న్యూస్.. ఇప్పుడు ఏకంగా 132 కి.మీ రేంజ్!

టెస్లా సైబర్‌ ట్రక్‌కు ఇండియన్ టచ్.. ఫొటోలు చూస్తే నవ్వు ఆపుకోలేరు!

నెక్సాన్ To కర్వ్.. సెప్టెంబర్ లో టాటా కార్లపై ఊహించని డిస్కౌంట్లు!

మహీంద్రా SUVలపై భారీ డిస్కౌంట్లు.. స్కార్పియో Nపై ఏకంగా రూ.3 లక్షల తగ్గింపు!

ఎలక్ట్రిక్ స్కూటర్లకు సూపర్ డిమాండ్.. 8 నెలల్లోనే 13 లక్షలకు పైగా అమ్మకాలు!

సింపుల్ ఎనర్జీ సూపర్ జోష్.. ఏడాదిలో 10 వేలకుపైగా ఈవీ స్కూటర్ల సేల్!

ఈవీ రంగంలో హీరో దూకుడు.. నంబర్ వన్ కోసం అదిరిపోయే ప్లాన్!

Big Stories

Advertisement
×