E-Paper
Advertisement

Kamareddy Theft Case: దొంగతనంలోనూ ఫాస్ట్ ట్రాక్.. తాళంతో కుస్తీ వద్దు.. బీరువానే ముద్దు అనుకున్న వింత దొంగలు!

Kamareddy Theft Case: దొంగతనంలోనూ ఫాస్ట్ ట్రాక్.. తాళంతో కుస్తీ వద్దు.. బీరువానే ముద్దు అనుకున్న వింత దొంగలు!
Advertisement

Kamareddy Theft Case: కామారెడ్డి జిల్లా కేంద్రంలోని వినాయక్ నగర్ కాలనీలో ఆదివారం అర్ధరాత్రి జరిగిన ఒక వింతైన దొంగతనం స్థానికులను భయాందోళనకు గురిచేసింది. సాధారణంగా బీరువాలోని నగదు, నగలు ఎత్తుకెళ్లే దొంగలను చూస్తుంటాం, కానీ ఇక్కడ ఏకంగా బీరువానే మోసుకెళ్లడం గమనార్హం. బాధితురాలు శమీమున్నీసా బేగం తన ఇంటికి తాళం వేసి వ్యక్తిగత పనుల నిమిత్తం బయటకు వెళ్లిన సమయంలో ఈ ఘటన చోటుచేసుకుంది.

దుండగులు పక్కా పథకం ప్రకారమే ఈ చోరీకి పాల్పడినట్లు తెలుస్తోంది. ఇంటికి తాళం వేసి ఉండటాన్ని గమనించిన దొంగలు, ప్రధాన ద్వారం తాళాలు పగులగొట్టి లోపలికి ప్రవేశించారు. బీరువా తాళాలు తీయడానికి సమయం పడుతుందనో లేదా లోపల భారీగా సొత్తు ఉంటుందనే ఉద్దేశంతోనో గానీ, ఏకంగా బీరువాను బయటకు తరలించుకుపోయారు. అందులో సుమారు రెండు తులాల బంగారు ఆభరణాలు, కొంత నగదు ఉన్నట్లు బాధితులు వాపోతున్నారు.

Advertisement

సమాచారం అందుకున్న వెంటనే పోలీసులు రంగంలోకి దిగారు. బాధితులు ‘100’కు కాల్ చేయడంతో సంఘటనా స్థలానికి చేరుకున్న పోలీసు సిబ్బంది, ప్రాథమిక ఆధారాలను సేకరించారు. క్లూస్ టీమ్, స్థానిక పోలీసులు వినాయక్ నగర్ పరిసరాల్లోని సీసీటీవీ ఫుటేజీలను నిశితంగా పరిశీలిస్తున్నారు. బీరువాను తరలించడానికి దొంగలు ఏదైనా వాహనాన్ని ఉపయోగించారా? లేక ఎంతమంది ఈ ముఠాలో ఉన్నారు? అనే కోణంలో దర్యాప్తు ముమ్మరం చేశారు.

Also Read: ప్రియురాలిని చంపి.. ఆత్మను పిలిచేందుకు తాంత్రిక పూజలు! ఇండొర్ లో దారుణం..

Advertisement

ఈ ఘటనతో పట్టణంలోని కాలనీవాసులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. తాళం వేసిన ఇళ్లే లక్ష్యంగా దొంగలు పడుతుండటంతో, ప్రజలు అప్రమత్తంగా ఉండాలని పోలీసులు సూచిస్తున్నారు. అనుమానిత వ్యక్తులు ఎవరైనా కనిపిస్తే వెంటనే సమాచారం అందించాలని కోరారు. త్వరలోనే నిందితులను పట్టుకుని సొత్తును రికవరీ చేస్తామని పోలీసులు ధీమా వ్యక్తం చేస్తున్నారు.

Related News

మధ్యప్రదేశ్‌లో విషాదం.. ఎద్దును రక్షించబోయి ముగ్గురు మృతి!

ఘోర బస్సు ప్రమాదం.. క్షణాల వ్యవధిలో తగలబడిన బస్సు.. స్పాట్‌లో!

ఘట్‌కేసర్‌లో ఘోర విషాదం.. రైలు కింద పడి దంపతుల ఆత్మహత్య!

ఈగల్ ఫోర్స్ ‘మరో’ సక్సెస్ ఆపరేషన్.. 180 కిలోల గంజాయి సీజ్!

26 రోజుల ఎదురుచూపు.. ఏజెన్సీ గ్రామాలను కుదిపేస్తున్న తండ్రి ఆవేదన!

టోల్ ప్లాజా వద్ద పేలిన ఎల్పీజీ ట్యాంకర్.. ఆరుగురు మృతి!

పెళ్లి వేడుకల్లో ఊహించని విషాదం.. లారీ రూపంలో వచ్చిన రాక్షసుడు.. ఒకే కుటుంబంలో నలుగురు బలి!

ఆదిభట్ల గౌరా ఎయిరోస్పేస్‌లో భారీ అగ్నిప్రమాదం.. ఎగిసిపడిన మంటలు, రంగంలోకి ఫైర్ ఫైటర్స్!

Big Stories

Advertisement
×