E-Paper
Advertisement

Tirumala: మొదటి సారి తిరుమలలో అంగప్రదక్షిణకు వెళ్తున్నారా – కచ్చితంగా ఈ విషయాలు తెలుసుకోవాల్సిందే

Tirumala: మొదటి సారి తిరుమలలో అంగప్రదక్షిణకు వెళ్తున్నారా – కచ్చితంగా ఈ విషయాలు తెలుసుకోవాల్సిందే
Advertisement

Tirumala: మొదటిసారి తిరుమలలో శ్రీవారి అంగ ప్రదక్షిణకు వెళ్తున్నారా..? అయితే కొన్ని విషయాలు మీరు తప్పకుండా తెలుసుకోవాల్సిందే. ఈ విషయాలు తెలుసుకోవడం ద్వారా మీ యాత్రను మరింత సులభతరం చేసుకోవచ్చు. అక్కడికి వెళ్లి కన్పీజ్‌ కాకుండా అంగ ప్రదక్షిణలో మొదటి నుంచి దర్శనం కంప్లీట్ అయి గుడి బయటకు వచ్చే వరకు ఏంమేం చేయాలో ఇప్పుడు ఈ కథనంలో తెలుసుకుందాం.

కలియుగ వైకుంఠం తిరుమల శ్రీవారి దర్శన భాగ్యం కోసం కోట్ల మంది భక్తులు ఎదురుచూస్తుంటారు. అయితే దర్శనం మాత్రమే కాకుండా స్వామి దగ్గర చాలా రకాల సేవలు అందుబాటులో ఉంటాయి. అవే కాకుండా స్వామి ఆనంద నిలయం చుట్టూ అంగ ప్రదక్షిణ చేయడానికి కూడా తిరుమల తిరుపతి దేవస్థానం భక్తులకు అవకాశం కల్పిస్తుంది. అయితే మొదటిసారి అంగ ప్రదక్షిణకు వెళ్లే భక్తులు ముఖ్యంగా ఈ విషయాలు తెలుసుకోవాలి.

శ్రీవారి పుష్కరిణిలో స్నానం:

Advertisement

అంగప్రదక్షిణ చేసేవారు రాత్రి 12 గంటలకు ప్రధాన ఆలయం పక్కనే ఉన్న శ్రీవారి పుష్కరిణిలో ఒంటిమీద బట్టలతోనే మూడు మునకలు వేసి అలాగే తడి బట్టలతో వైకుంఠం 1 క్యూ కాంప్లెక్స్ స్పెషల్ ఎంట్రీ దర్శనం దగ్గరకు వెళ్లితో అక్కడి నుంచి లోపలికి పంపిస్తారు. ఇక్కడ రిపొర్టింగ్ చేయాల్సిన సమయం  రాత్రి ఒంటి గంటకు. అక్కడ సెక్యూరిటీకి మీ టికెట్, ఐడి చూపించాక లోపలికి అనుమతిస్తారు.

స్త్రీ, పురుషులకు ప్రత్యేక లైన్‌, దర్శనం:

అంగ ప్రదక్షిణకు వెళ్లే స్త్రీలకు సెపరేట్ లైన్లో సెపరేట్ వెయిటింగ్ హాల్లో కి ప్రవేశం ఉంటుంది. అలాగే పురుషులకు సెపరేట్ వెయిటింగ్ హాల్లో కి ప్రవేశం ఉంటుంది. రాత్రి 2:45 నిమిషాల సమయంలో మొదట స్త్రీలను అంగ ప్రదక్షిణ కోసం పంపిస్తారు. తరువాత పురుషులను పంపిస్తారు.

స్త్రీల అంగ ప్రదక్షిణ:

Advertisement

అంగప్రదక్షిణ లైన్ ప్రవేశానికి ముందే సుప్రభాత సేవ మొదలవుతుంది. సుప్రభాతం జరుగుతున్న సమయంలోనే స్త్రీలకు అంగప్రదక్షిణ చేయించి తిరిగి వారిని వెండి వాకిలి ముందు ఉన్న ధ్వజస్తంభం దగ్గర కూర్చోబెటతారు. స్త్రీలందరూ ప్రదక్షిణ పూర్తి చేసి వెండి వాకిలి బైటకు రాగానే పురుషులను అంగప్రదక్షిణకు అనుమతిస్తారు. పురుషుల ప్రదక్షిణ పూర్తి కాగానే వారిని వెండి వాకిలి బైట కళ్యాణ మండపం వద్ద కూర్చుబెటతారు. ఈలోపు శ్రీవారి సుప్రభాత సేవ పూర్తవుతుంది దర్శనం చేసుకొన్న భక్తులు బైటకు రాగానే మొదట స్త్రీలు వారి తర్వాత పురుషులను స్వామి దర్శనానికి అనుమతిస్తారు.

స్త్రీ, పురుషుల వస్త్రధారణ:

అంగప్రదక్షిణ కోసం వెళ్ళే భక్తులు తప్పనిసరిగా సాంప్రదాయ వస్త్రధారణలోనే వెళ్ళవలసి ఉంటుంది. పురుషులు పంచె పైన కండువా వెసుకోవచ్చు షార్ట్, ట్రాక్ ప్యాంట్, టి షర్ట్, చోక్కా అనుమతించరు. పురుషులకు అంగప్రదక్షిణ పంచతో ఇబ్బంది అనుకుంటే ప్యాంట్  వేసుకుని పైన పంచె ధరిస్తే ఇబ్బంది ఉండదు. స్త్రీలు కూడా తప్పనిసరిగా సాంప్రదాయ వస్త్రాలు ధరించాలి.

ప్రదక్షిణ ఎలా ఉంటుంది? ఎన్నీ ప్రదక్షిణలు చేయాలి:

ప్రదక్షిణ స్వామి వారి బంగారు వాకిలి (బావీ) ముందు నుంచి సాష్టాంగ నమస్కారం చేసినట్లు పడుకుని( పొర్లు దండాలు) అలాగే ప్రదక్షిణలు చేస్తూ శ్రీవారి ప్రాకారం చూట్టూ శ్రీవారి హుండీ (ధనలక్ష్మి విగ్రహం వరకు) ప్రదక్షిణ పూర్తి చేయాలి. ప్రదక్షిణలు చేయడం (దొర్లడం) లో ఇబ్బంది కలగకుండా (స్త్రీలు) శ్రీవారి సేవకులు పర్యవేక్షణలో పాల్గోంటారు కాబట్టి ఎవరు ఇబ్బంది పడనవసరం లేదు.

అంగ ప్రదక్షిణ టిక్కెట్ ఖరీదు ఎంత?:

అంగప్రదక్షిణ టిక్కెట్ కోసం ఒక్క పైసా ఖర్చు చేయనవసరం లేదు. అంగప్రదక్షిణతో పాటు శ్రీవారి దర్శనం, 1 ఉచిత లడ్డూ ప్రసాదం, భక్తులందరికీ అందిస్తారు. ఆన్లైన్ ద్వారా ఈ అంగప్రదక్షిణ టిక్కెట్ ఉచితంగా పొందవచ్చు. కేవలం మీ మోబైల్ నెంబర్ తొ టికెట్ బుక్ చేసుకోవచ్చు.

ఇక స్వామి వారి పుష్కరిణి స్వామి దర్శనం పూర్తయ్యాక బైటకు వచ్చే ద్వారం ముందు ఉన్న పుష్కరిణి గేటు రాత్రి 12 గంటల సమయంలో అంగప్రదక్షిణ భక్తులు స్నానం చేయడానికి తెరిచి ఉంచుతారు.

ముఖ్య గమనిక: పైన తెలిపిన వివరాలు కొందరు నిపుణులు, వివిధ శాస్త్రాల్లో పేర్కొన్న అంశాల ఆధారంగా అందించినవి మాత్రమే. వీటిలో అన్నిటికీ ఆధునిక శాస్త్రీయ ఆధారాలు లేకపోవచ్చుననే విషయాన్ని పాఠకులు గమనించాలి. దీన్ని ఎంతవరకు విశ్వసించాలనేది పూర్తిగా మీ వ్యక్తిగత విషయం.

ALSO READ: తిరుమలలో వెయ్యేళ్ల నాటి ఘటాటోపం ఇప్పటికీ చూడొచ్చు – ఎక్కడ కనిపిస్తుందో తెలుసా

 

Related News

తిరుమల శ్రీవారి తొలి దర్శనం.. వారికే ఎందుకు? దాని వెనుక కథేంటి?

పూరీ జగన్నాథుడి మహాప్రసాదం తయారీలో..ఆశ్చర్యకరమైన నిజాలు!

శుక్రవారం ఈ 5 పవిత్ర స్థలాల్లో దీపం పెడితే.. అష్టైశ్వర్యాలు మీ సొంతం

రుద్రాక్ష ధరిస్తున్నారా? ఈ తప్పులు చేస్తే.. నష్టాలు తప్పవు!

బ్రహ్మ ముహూర్తంలో కలలు వస్తున్నాయా? మీ జీవితం మారబోతుందనడానికి ఇదో సంకేతం!

జాతకంలో గ్రహ దోషాలు పోవాలా? ఈ వస్తువులు దానం చేస్తే తిరుగుండదు!

ఏ వేప చెట్టు పడితే అది వాడరు! పూరీ జగన్నాథుడి రథాల కోసం చెట్లను ఎలా.. వెతుకుతారో తెలుసా?

సైన్స్‌కు సవాల్ విసురుతున్న పూరీ జగన్నాథ ఆలయ రహస్యాలు.. తెలిస్తే షాక్ అవుతారు!

Big Stories

Advertisement
×