WPL 2026: మహిళల ప్రీమియర్ లీగ్ 2026 టోర్నమెంట్ ( Women’s Premier League 2026) చివరి దశకు వచ్చిన సంగతి తెలిసిందే. ఇవాళ గ్రూప్ స్టేజిలో ఢిల్లీ క్యాపిటల్స్ ( Delhi Capitals Women ) వర్సెస్ యూపీ వారియర్జ్ ( UP Warriorz Women ) జట్ల మధ్య చిట్ట చివరి మ్యాచ్ జరిగింది. అయితే ఈ మ్యాచ్ లో యూపీ జట్టు పైన ఏకంగా ఐదు వికెట్ల తేడాతో గ్రాండ్ విక్టరీ కొట్టింది ఢిల్లీ క్యాపిటల్స్. యూపీ విధించిన 123 పరుగుల లక్ష్యాన్ని చేదించే క్రమంలో 18.4 ఓవర్లలో చేదించింది ఢిల్లీ క్యాపిటల్స్ మహిళల జట్టు. దీంతో ఈ మ్యాచ్ లో ఐదు వికెట్ల తేడాతో విజయం సాధించి ప్లే ఆఫ్ కు దూసుకు వెళ్ళింది ఢిల్లీ క్యాపిటల్స్ మహిళల జట్టు. ప్లే ఆఫ్ కు ఢిల్లీ క్యాపిటల్స్ దూసుకు వెళ్లడంతో ముంబై ఇండియన్స్ ( Mumbai Indians) తో పాటు యూపీ ఇంటి దారి పట్టాయి.
ఉమెన్స్ ప్రీమియర్ లీగ్ 2026 టోర్నమెంట్ ( Women’s Premier League 2026) గ్రూప్ స్టేజిలో ఇవాళ చిట్ట చివరి మ్యాచ్ జరిగింది. ఈ మ్యాచ్ లో ఢిల్లీ క్యాపిటల్స్ వర్సెస్ యూపీ వారియర్జ్ ( Delhi Capitals Women vs UP Warriorz Women, 20th Match ) మధ్య ఫైట్ జరిగింది. ఇందులో మొదటి బ్యాటింగ్ చేసిన యూపీ వారియర్జ్ నిర్ణీత 20 ఓవర్లు ఆడేసింది. ఈ సందర్భంగా ఎనిమిది వికెట్లు నష్టపోయిన యూపీ వారియర్జ్, కేవలం 122 పరుగులు మాత్రమే సాధించింది. బ్యాటర్లందరూ దారుణంగా విఫలమైన నేపథ్యంలో తక్కువ స్కోర్ చేసింది యూపీ వారియర్జ్. అయితే బౌలర్లు మాత్రం అద్భుతంగా రాణించారు.
ఈ చిన్న లక్ష్యాన్ని కాపాడుకునేందుకు యూపీ చాలా కష్టపడాల్సి వచ్చింది. ఒకానొక సమయంలో యూపీ గెలుస్తుందని కూడా అందరూ అంచనా వేసుకున్నారు. అయితే ఢిల్లీ క్యాపిటల్స్ కెప్టెన్ జెమిమా రోడ్రిగ్స్ ( Jemimah Rodrigues) చివరి వరకు ఆడి 34 పరుగులతో రెచ్చిపోయారు. దీంతో 18.4 ఓవర్లలో ఐదు వికెట్ల నష్టానికి ఢిల్లీ క్యాపిటల్స్ మహిళల జట్టు విజయం సాధించింది. ఈ విజయంతో ప్లే ఆఫ్ కు దూసుకు వెళ్ళింది. ఢిల్లీ క్యాపిటల్స్. ఢిల్లీ ప్లే ఆఫ్ కు వెళ్లడంతో ముంబై ఇండియన్స్ అలాగే యూపీ రెండు జట్లు కూడా ఎలిమినేట్ అయి ఇంటికి వెళ్ళాయి.
ఉమెన్స్ ప్రీమియర్ లీగ్ 2026 టోర్నమెంట్ ( Women’s Premier League 2026) నేపథ్యంలో ఎలిమినేటర్ మ్యాచ్ ఫిబ్రవరి మూడో తేదీన అంటే ఎల్లుండి జరగనుంది. ఈ మ్యాచ్ ఢిల్లీ క్యాపిటల్స్ వర్సెస్ గుజరాత్ జెయింట్స్ మధ్య జరగనుంది. ఇందులో గెలిచిన జట్టు ఫైనల్ ఆడుతుందన్నమాట. ఫిబ్రవరి 5వ తేదీన రాయల్ ఛాలెంజర్స్ ( RCB Team ) వర్సెస్ ఎలిమినేటర్ లో ( Eliminator) గెలిచిన జట్టు ఫైనల్ ఆడుతుంది.
𝗗𝗲𝗹𝗵𝗶 𝗖𝗮𝗽𝗶𝘁𝗮𝗹𝘀 𝗶𝗻𝘁𝗼 𝘁𝗵𝗲 𝗽𝗹𝗮𝘆𝗼𝗳𝗳𝘀! 👏🏼
Jemimah Rodrigues steers Delhi Capitals into the playoffs with a five-wicket win over UP Warriorz. ❤️🐯#WPL2026 #UPWvDC #Sportskeeda pic.twitter.com/IliEbKnV5I
— Sportskeeda (@Sportskeeda) February 1, 2026