E-Paper
Advertisement

WPL 2026: 15 నిమిషాల పాటు చివ‌రి ఓవ‌ర్‌..ఉత్కంఠ మ్యాచ్ లో ఢిల్లీపై గుజ‌రాత్ విజ‌యం

WPL 2026: 15 నిమిషాల పాటు చివ‌రి ఓవ‌ర్‌..ఉత్కంఠ మ్యాచ్ లో ఢిల్లీపై గుజ‌రాత్ విజ‌యం
Advertisement

WPL 2026:  ఉమెన్స్ ప్రీమియర్ లీగ్ 2026 టోర్నమెంట్ ( Women’s Premier League 2026 ) చాలా రసవత్తరంగా కొనసాగుతున్న సంగతి తెలిసిందే. ఇప్పటి వరకు ఈ టోర్నమెంటులో 16 మ్యాచ్ లు జరిగాయి. ఇక మంగళవారం రోజున ఢిల్లీ క్యాపిటల్స్ వర్సెస్ గుజరాత్ జెయింట్స్‌ జట్ల ( Delhi Capitals Women vs Gujarat Giants Women, 17th Match ) మధ్య బిగ్ ఫైట్ జరిగింది. ఈ 17వ మ్యాచ్ వడోదర లోని BCA స్టేడియంలో ( BCA Stadium, Kotambi, Vadodara ) నిర్వహించారు. అయితే ఈ మ్యాచ్ లో అద్భుతంగా రాణించిన గుజరాత్ జెయింట్స్‌ చివరి క్షణంలో విజయం సాధించింది. ఢిల్లీపై మూడు పరుగుల తేడాతో విక్టరీ కొట్టింది గుజరాత్. ఇక‌ గుజరాత్ నిర్దేశించిన 175 పరుగుల లక్ష్యాన్ని చేదించే క్రమంలో ఢిల్లీ అట్టర్ ఫ్లాఫ్ అయింది. దీంతో ఢిల్లీపై విజయం సాధించి, పాయింట్ల పట్టికలో రెండవ స్థానానికి దూసుకువెళ్లింది గుజరాత్ జెయింట్స్‌.

 Also Read: Tanveer Ahmed-Abhishek: త‌న్వీర్ అహ్మాద్ కు అభిషేక్ స్ట్రాంగ్ కౌంట‌ర్‌..నిన్ను పాకిస్తాన్ లో న‌గ్నంగా తిరిగేలా చేస్తానంటూ !

ఢిల్లీ పై గుజరాత్ జెయింట్స్‌ గ్రాండ్ విక్టరీ

Advertisement

ఉమెన్స్ ప్రీమియర్ లీగ్ 2026 టోర్నమెంట్ లో భాగంగా మంగళవారం వడోదర వేదికగా జరిగిన మ్యాచ్ లో ఢిల్లీ పై గుజరాత్ జెయింట్స్‌ గ్రాండ్ విక్టరీ కొట్టింది. ఈ మ్యాచ్లో గుజరాత్ మొదటి బ్యాటింగ్ చేసి నిర్ణీత 20 ఓవర్లు ఆడింది. ఈ నేపథ్యంలోనే తొమ్మిది వికెట్లు నష్టపోయిన గుజరాత్ 174 పరుగులు సాధించింది. ఈ లక్ష్యాన్ని చేదించే క్రమంలో చివరి వరకు పోరాడింది ఢిల్లీ క్యాపిటల్స్ మహిళల జట్టు. ఈ సందర్భంగా 20 ఓవర్లు ఆడిన ఢిల్లీ మహిళల జట్టు, 171 పరుగులు చేయగలిగింది. ఓవర్లు ఫినిష్ కావడంతో మూడు పరుగుల తేడాతో గుజరాత్ విజయం సాధించింది.

15 నిమిషాల పాటు సాగిన 20వ ఓవర్

గుజరాత్ వర్సెస్ ఢిల్లీ క్యాపిటల్స్ మధ్య జరిగిన మ్యాచ్ లో కీలక పరిణామం చోటు చేసుకుంది. ఢిల్లీ బ్యాటింగ్ చేస్తున్న నేపథ్యంలో 20వ ఓవర్ లో 6 బంతులలో తొమ్మిది పరుగులు చేయాల్సిన పరిస్థితి నెలకొంది. ఈ సందర్భంగా సోఫీ డివైన్ ( Sophie Devine ) బౌలింగ్ చేయడం జరిగింది. ఈ ఓవర్ లో ఆమె ఢిల్లీ క్యాపిటల్స్ జట్టును కట్టడి చేసింది. చివరి ఓవర్ లో రెండు వికెట్లు కూడా పడగొట్టింది. అయితే ఈ సందర్భంగా రివ్యూ తీసుకోవడం, ఇతర కారణాల వల్ల 20 ఓవర్ వేయడానికి దాదాపు 15 నిమిషాలు పట్టింది. ఇలా జరగడం ఇదే తొలిసారి అని అంటున్నారు. కాగా ఉమెన్స్ ప్రీమియర్ లీగ్ 2026 టోర్నమెంట్ పాయింట్ల పట్టికలో రాయల్ చాలెంజర్స్ బెంగళూరు జట్టు 10 పాయింట్లు మొదటి స్థానంలో ఉంది. రెండో స్థానంలో గుజరాత్ ఉండగా ముంబై ఇండియన్స్ మూడో స్థానంలో నిలిచింది. అటు ఢిల్లీ ఆ తర్వాత యూపీ నాలుగు ఐదు స్థానాల్లో ఉన్నాయి.

Advertisement

 Also Read: Former India captain: కొలంబోలో కొడితే, మ‌ద్రాసులో ప‌డ‌తారు..ఇప్ప‌టికైనా టీ20 ప్ర‌పంచ క‌ప్ నుంచి త‌ప్పుకోండి..పాకిస్తాన్ కు వార్నింగ్‌ 

 

Related News

టీమిండియా చాలా వీక్ గా ఉంది..పాకిస్తాన్ మ‌హిళ‌ల చేతిలో కూడా ఓడిపోవ‌డం ఖాయం!

రోహిత్ శ‌ర్మ‌ కూడా స్లాగ‌రే..గుడ్డిగా బ్యాట్ ఊపితే, వ‌ర‌ల్డ్ క‌ప్ గెల‌వ‌లేరు

గంభీర్ ను వెధ‌వ‌ను చేసేందుకు రోహిత్ శ‌ర్మ PR స్టంట్..రిటైర్మెంట్, బొక్కా లేదు

దక్షిణాఫ్రికాలో వ‌ర‌ల్డ్ క‌ప్ గెల‌వాలంటే, రోహిత్ శ‌ర్మ ఉండాల్సిందే

పాకిస్తాన్ జ‌ట్టులో కుదుపు…ఫాతిమా స‌నా కెప్టెన్సీ గ‌ల్లంతు

ధోని లేక ఒక్కొక్క‌డి సుఖాలు ఎక్కువ‌య్యాయి..లేకుంటే గంభీర్‌, అగార్క‌ర్ తోక‌లు క‌ట్ చేసేవాడు

పాకిస్తాన్ త‌యారు చేసిన బంతుల వ‌ల్లే, ఫిఫా వరల్డ్ కప్ స‌క్సెస్!

పిక్ పాకెట్ కేసులో పాక్ క్రికెట‌ర్ హసన్ అలీ..తోలు తీసిన ఇండియ‌న్‌ పోలీసులు !

Big Stories

Advertisement
×