BigTV English

Kagiso Rabada : డ్రగ్స్ వాడి రబడా బౌలింగ్ చేశాడా.. అందుకే ఆస్ట్రేలియాను వణికించాడా… WTC పై అనుమానాలు

Kagiso Rabada : డ్రగ్స్ వాడి రబడా బౌలింగ్ చేశాడా.. అందుకే ఆస్ట్రేలియాను వణికించాడా… WTC పై అనుమానాలు

Kagiso Rabada : లార్డ్స్ వేదిక గా ఆస్ట్రేలియా, సౌతాఫ్రికా మధ్య వరల్డ్ టెస్ట్ ఛాంపియన్ ఫైనల్ లో తొలిరోజు బౌలర్లు పూర్తి ఆధిపత్యం చెలాయించారు. ముఖ్యంగా సౌతాఫ్రికా బౌలర్ రబాడ 51/5, యాన్సెన్ 49/3 ధాటికి తొలుత ఆస్ట్రేలియా జట్టు తొలి ఇన్నింగ్స్ లో 212 పరుగులకే ఆలౌట్ అయింది. వెబ్ స్టర్ 72, స్టీవ్ స్మిత్ 66 పరుగులు మినహా మిగతా బ్యాటర్లు అంతా విఫలం చెందారు. ఇదిలా ఉంటే.. సోషల్ మీడియాలో ఓ వార్త తెగ వైరల్ అవుతోంది. ఇటీవల జరిగిన ఐపీఎల్ మ్యాచ్ సమయంలో రబడా డ్రగ్స్ వాడినట్లు వార్తలు వినిపించాయి. అందుకే రబాడా ఐపీఎల్ నుంచి వైదొలిగినట్టు సమాచారం. అయితే ఇప్పుడు డబ్ల్యూటీసీలో కూడా.. రబాడా డ్రగ్స్  వాడినట్లు కొంతమంది తప్పుడు ప్రచారం చేస్తున్నారు. ఇక డ్రగ్స్ వాడడం వల్లనే నిన్నటి మ్యాచ్లో ఐదు వికెట్లు పడ్డట్టు ట్రోలింగ్స్ చేయడం విశేషం.


Also Read : Ms Dhoni : ICC ఈవెంట్ కు డుమ్మా… ఊళ్లో వ్యవసాయం చేసుకుంటున్న ధోని.. ఏం గుండే రా అది

మరోవైపు ఇంగ్లండ్ లోని లార్డ్స్ వేదికగా ఆసీస్ -సౌతాఫ్రికా మధ్య జరుగుతున్న వరల్డ్ టెస్ట్ ఛాంపియన్ ఫైనల్ లో ఓ చెత్త రికార్డు నమోదు అయింది. ఇరు జట్లలోని ఓపెనర్లు ఖవాజా, మార్క్రమ్ డకౌట్ అయ్యారు. బ్రిటన్ లో 1880 నుంచి ఇప్పటివరకు 561 టెస్ట్ లు జరగ్గా.. ఇద్దరూ ఓపెనర్లు సున్నా కే వెనుతిరగడం ఇదే తొలిసారి కావడం విశేషం. ఓవరాల్ గా ఇలా జరగడం పదోసారి. ఇక ఆస్ట్రేలియా ను సౌతాఫ్రికా తక్కువ స్కోర్ కే ఆలౌట్ చేసినప్పటికీ.. తొలిరోజు దక్షిణాఫ్రికా నిరాశగానే ముగించేసింది. బ్యాట్ తో ఆ జట్టు కంగారు కంటే ఎక్కువగానే తడబడింది. ఓపెనర్లిద్దరినీ స్టార్క్ దెబ్బతీశాడు. తొలి ఓవర్ లోనే ఓ అద్భుతమైన ఇన్ స్వింగ్ బంతితో మార్ క్రమ్ క్లీన్ బౌల్డ్ అయ్యాడు. కొద్ది సేపటి తరువాత మరో ఓపెనర్ రికిల్టన్ 16 పరుగులు చేసి వెనుదిరిగాడు.


వాస్తవానికి 145 ఏళ్లలో టెస్ట్ క్రికెట్ లో ఇరు జట్ల ఓపెనర్లు డకౌట్ కావడం ఇదే తొలిసారి. ఈ మ్యాచ్ లో తొలుత బ్యాటింగ్ చేసిన ఆస్ట్రేలియాను కగిసో రబాడ నిప్పులు చెరిగే తన బంతులతో హడలెత్తించాడు. 5 వికెట్లతో అద్భుతమైన బౌలింగ్ చేసాడు. రబాడ మరో రికార్డును కొల్లగొట్టాడు. వరల్డ్ టెస్ట్ ఛాంపియన్ షిప్ ఫైనల్ లో 5 వికెట్లు తీసిన ప్రదర్శన చేసిన రెండో బౌలర్ గా నిలిచాడు. ఇంతకు ముందు న్యూజిలాండ్ బౌలర్ కల్ జెమీసన్ 2021లో భారత్ మీద ఈ ఫీట్ ను సాధించాడు. ఐసీసీ టోర్నమెంట్ ఫైనల్స్ లో 5 వికెట్ల ప్రదర్శన చేసిన రెండో బౌలర్ గా రబాడ నిలిచాడు. ఇంతకు ముందు 1998లో జరిగిన ఐసీసీ నాకౌట్ ట్రోఫీ ఫైనల్ లో జాక్వస్ కలిస్ 30/5 ప్రదర్శన చేశాడు. ఐసీసీ నాకౌట్ మ్యాచ్ ల్లో కూడా కగిసో ప్రదర్శన అద్భుతంగా ఉందనే చెప్పవచ్చు. ఇప్పటివరకు ఆడిన 5 మ్యాచ్ ల్లో 11 వికెట్లు గిరాటేశాడు. ఈ జాబితాలో 14 వికెట్లతో కలిస్, 12 వికెట్లతో పొలాక్, అలెన్ డోనాల్డ్ ఉమ్మడిగా రబాడ కంటే బౌలింగ్ రికార్డు ఘనంగా ఉంది. అయినప్పటికీ రబాడ డ్రగ్స్ వాడాడని సోషల్ మీడియాలో రూమర్స్ పుట్టించడం గమనార్హం.

Related News

IND Vs SL : ఇండియా వర్సెస్ శ్రీలంక మ్యాచ్ లో సూపర్ ఓవర్… ఎవరు గెలిచారంటే

Asia Cup 2025 : ఆసియా కప్ ఫైనల్స్ కు ముందు షాక్…సూర్య, రవూఫ్‌కు 30% ఫైన్

IND Vs SL : 300కు పైగా పరుగులు.. అభిషేక్ శర్మ సరికొత్త రికార్డు.. శ్రీలంక టార్గెట్ ఎంత అంటే ?

Abhishek- Gambhir: అభిషేక్ శ‌ర్మ‌ను బండ‌బూతులు తిట్టిన గంభీర్‌..ఈ దెబ్బ‌కు ఉరేసుకోవాల్సిందే !

IND Vs SL : టాస్ గెలిచిన శ్రీలంక‌.. ఫ‌స్ట్ బ్యాటింగ్ ఎవ‌రిదంటే..?

IND Vs PAK : ఇండియా వర్సెస్ పాక్ ఫైనల్..PVR సంచలన నిర్ణయం.. ఏకంగా 100 థియేటర్స్ లో

Asia Cup 2025 : ఒకే గొడుగు కిందికి పాకిస్తాన్, బంగ్లా ప్లేయర్స్… ఇద్దరు ఇండియాకు శత్రువులే.. క్రేజీ వీడియో వైరల్

Shoaib Akhtar : ఇండియాకు ఇగో ఎక్కువ‌.. ఆదివారం మొత్తం దించేస్తాం..ఇక కాస్కోండి !

Big Stories

×