BigTV English

Ms Dhoni : ICC ఈవెంట్ కు డుమ్మా… ఊళ్లో వ్యవసాయం చేసుకుంటున్న ధోని.. ఏం గుండే రా అది

Ms Dhoni : ICC ఈవెంట్ కు డుమ్మా… ఊళ్లో వ్యవసాయం చేసుకుంటున్న ధోని.. ఏం గుండే రా అది

Ms Dhoni : టీీమిండియా మాజీ కెప్టెన్ మహేంద్ర సింగ్ ధోనీ గురించి ప్రత్యేకంగా  చెప్పాల్సిన అవసరం లేేదు.  టీమిండియాకి వరల్డ్ కప్, టీ-20 కప్ లు, ఛాంపియన్ ట్రోఫీ అందించిన కెప్టెన్ గా రికార్డులకెక్కాడు. ఇక ఆ తరువాత మెల్ల మెల్లగా అన్ని ఫార్మాట్లకి రిటైర్మెంట్ ప్రకటించేశాడు ఎం.ఎస్.ధోనీ.  ప్రస్తుతం చెన్నై సూపర్ కింగ్స్ తరపున ఐపీఎల్ ఆడుతున్నాడు. ఇక ఇదిలా ఉంటే.. ఐసీసీ హాల్ ఆఫ్ ఫేమ్ లో భారత క్రికెట్ దిగ్గజం ఎం.ఎస్.ధోనీకి చోటు లభించింది. ఈ ఘనత సాధించిన కొద్ది మంది ఇండియా క్రికెటర్లలో ఒకరిగా నిలిచాడు ధోనీ. భారత క్రికెట్ కి చేసిన సేవలకు లెజెండరీ ప్లేయర్ ధోనీ కి ఈ గుర్తింపు లభించింది. ప్రతిష్టాత్మక ఐసీసీ హాల్ ఆఫ్ ఫేమ్ లో టీమిండియా మాజీ కెప్టెన్ ధోనీకి చోటు దక్కింది. లండన్ లోని ప్రఖ్యాత అబ్బే రోడ్ స్టూడియోలో జరిగిన ఓ కార్యక్రమంలో ఐసీసీ హాల్ ఆఫ్ ఫేమ్ లో చోటు దక్కించుకున్న ఏడుగురు దిగ్గజ ఆటగాళ్లలో భారత మాజీ కెప్టెన్ ఉన్నాడు.


Also Read : Rohit Sharma : ఆస్ట్రేలియా జెర్సీలో రోహిత్ శర్మ.. క్రేజీ ఫోటో వైరల్.. 90 కిలోలు పెరిగిపోయాడు ఏంటి

వాస్తవానికి ధోనీకి ఐసీసీ హాల్ ఆఫ్ ఫేమ్ లో ధోనీకి చోటు లభించినప్పటికీ అతను అవార్డు తీసుకునేందుకు మాత్రం వెళ్లలేదు. ఊర్లో వ్యవసాయం చేసుకుంటున్నాడు. మహేంద్ర సింగ్ ధోని కి కూడా హాల్ ఆఫ్ ఫేమ్ అవార్డు వచ్చింది.  అందులో పేర్లు వచ్చిన అందరు వెళ్లారు.  కానీ ధోని మాత్రం వెళ్లకపోవడం గమనార్హం.  ధోనీ తో పాటు దక్షిణాఫ్రికాకు చెందిన హషీమ్ ఆమ్లా, ఆస్ట్రేలియా మాజీ ఓపెనర్ మాథ్యూ హెడెన్, దక్షిణాఫ్రికా మాజీ కెప్టెన్ గ్రేమ్ స్మిత్, న్యూజిలాండ్ దిగ్గజం డేనియల్ వెటోరీ ఈ గౌరవాన్ని దక్కించుకున్నారు. పాకిస్తాన్ కి చెందిన సనా మిర్, ఇంగ్లండ్ మాజీ వికెట్ కీపర్ సారా టేలర్ లు కలిసి మొత్తం హాల్ ఆఫ్ ఫేమ్స్ ను 122కి చేర్చారు.   2009లో హాల్ ఆఫ్ ఫేమ్ కార్యక్రమాన్ని ప్రారంభించారు.


ఇక ధోనీ 17వేలకు పైగాఅంతర్జాతీయ పరుగులు చేసిన మూడు ఐసీసీ వైట్ బాల్ టోర్నమెంట్లను గెలిచిన ఏకైక కెప్టెన్ గా నిలిచాడు. ఐసీసీ హాల్ ఆఫ్ ఫేమ్ లో చోటు దక్కించుకున్న 11వ భారత క్రికెటర్ గా ధోనీ నిలిచాడు. అతని కంటే ముందు సునీల్ గవాస్కర్, బిషన్ సింగ్ బేడీ, కపిల్ దేవ్, అనిల్ కుంబ్లే, రాహుల్ ద్రవిడ్, సచిన్ టెండూల్కర్, విను మన్కడ్, దియాన్ ఎడుల్జీ, వీరేంద్ర సెహ్వాగ్, నీతూ డేవిడ్ ఈ గౌరవాన్ని అందుకున్నారు. ఇక ధోనీ 90 టెస్టుల్లో 256 క్యాచ్ లు, 38 స్టంపింగ్ లతో పాటు 4,786 పరుగులు చేశాడు. ప్రస్తుతం ధోనీ కెప్టెన్సీలో చెన్నై సూపర్ కింగ్స్ జట్టు ఐపీఎల్ 2025 సీజన్ లో పేలవ ప్రదర్శన కనబరిచింది. ఇప్పటివరకు ఇంత పేలవ ప్రదర్శన కనబరచడం చెన్నై కి ఇది తొలి సీజన్ కావడం విశేషం.

Tags

Related News

IND Vs PAK : అభిషేక్ శర్మ ఫాలోయింగ్ చూడండి.. పాకిస్తాన్ లేడీ కూడా లవ్ యూ చెప్పింది!

IND Vs PAK : అంపైర్లు అమ్ముడుపోయారు.. అది నాటౌట్… షోయబ్ అక్తర్ సంచలన వ్యాఖ్యలు

IND Vs PAK : గేమ్ ఓడిపోయాం కానీ యుద్ధం గెలిచాం : రవూఫ్ భార్య

IND Vs PAK : దుబాయ్ స్టేడియంలో పాకిస్థాన్ ఫ్యాన్ పై దాడి… రంగంలోకి పోలీసులు!

Fakhar Zaman catch : టీమిండియా తొండాట‌…ఐసీసీకి పాకిస్థాన్ ఫిర్యాదు

Abhishek Sharma: అభిషేక్ శ‌ర్మకు గ్రౌండ్ లోనే ప్ర‌పోజ్‌..ఫ్లయింగ్ కిస్సులు ఇచ్చి మ‌రీ !

IND VS PAK: మ‌రోసారి టీమిండియా వ‌ర్సెస్ పాక్ మ్యాచ్‌..చ‌చ్చిన పామును మ‌ళ్లీ చంప‌డ‌మే

AK-47 Celebration: ధోని చేస్తే క‌రెక్ట్‌.. మేం చేస్తే త‌ప్పా…!

Big Stories

×