E-Paper
Advertisement

Yograj Singh: 6 నెల‌ల్లో అర్జున్ ను నెంబ‌ర్ వ‌న్ బ్యాట‌ర్ చేయ‌క‌పోతే.. నా మీసాలు, గ‌డ్డం తీసేస్తా

Yograj Singh: 6 నెల‌ల్లో అర్జున్ ను నెంబ‌ర్ వ‌న్ బ్యాట‌ర్ చేయ‌క‌పోతే.. నా మీసాలు, గ‌డ్డం తీసేస్తా
Advertisement

Yograj Singh:  ఇండియన్ ప్రీమియర్ లీగ్ 2026 టోర్నమెంట్ ( Indian Premier League 2026 Tournament) నేపథ్యంలో సచిన్ ( Sachin) కుమారుడు అర్జున్ టెండూల్కర్ పైన వివాదాస్పద పోస్టులు వైరల్ అవుతున్నాయి. క్రికెట్ గాడు కొడుకు అయినప్పటికీ అర్జున్ టెండూల్కర్ కు ( Arjun Tendulkar) ఏ జట్టులో కూడా ఛాన్స్ రావడం లేదని ఫ్యాన్స్ కూడా ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ముంబై ఇండియన్స్ లో ఉన్నప్పుడు తుది జ‌ట్టులో అవ‌కాశం రాలేదని.. ఇక ఇప్పుడు లక్నో సూపర్ జెయింట్స్ జట్టులో కూడా అదే పరిస్థితి నెలకొందని అంటున్నారు. అయితే ఈ క్రమంలో సచిన్ కుమారుడు అర్జున్ టెండూల్కర్ గురించి సంచలన వ్యాఖ్యలు చేశారు యోగ్‌రాజ్ సింగ్ ( Yograj Singh ). తనకు ఆరు నెలల సమయం ఇస్తే, అర్జున్ టెండూల్కర్ ను నెంబర్ వన్ బ్యాటర్ ను చేస్తానని.. ఒకవేళ అలా చేయకపోతే తన మీసంతో పాటు గడ్డం కూడా తీసేస్తానంటూ సవాల్ విసిరారు యోగ్‌రాజ్ సింగ్. అర్జున్ టెండూల్కర్ ను పెద్ద బ్యాటర్ చేయడమే తన లక్ష్యమంటూ వ్యాఖ్యానించారు. దీంతో యోగ్‌రాజ్ సింగ్ చేసిన వ్యాఖ్య‌లు వైర‌ల్ గా మారింది.

Also Read: Vaibhav Sooryavanshi: బుమ్రా, హేజిల్‌వుడ్‌, భువ‌నేశ్వ‌ర్ ఎవడైతే నాకేంటి ? కొడితే అవ‌త‌ల ప‌డాల్సిందే

అర్జున్ ను నెంబ‌ర్ వ‌న్ బ్యాట‌ర్ చేయ‌క‌పోతే.. నా మీసాలు, గ‌డ్డం తీసేస్తా

Advertisement

ఇండియన్ ప్రీమియర్ లీగ్ 2026 టోర్నమెంట్ నేపథ్యంలో అర్జున్ టెండూల్కర్ కు లక్నో సూపర్ జెయింట్స్ తుది జట్టులో అవకాశం రావడం లేదు. అంతేకాదు వాటర్ బాయి గా అర్జున్ టెండూల్కర్ ను ఉపయోగిస్తోంది లక్నో సూపర్ జెయింట్స్. దీంతో అర్జున్ టెండూల్కర్ కు అవకాశం ఇవ్వాలని చాలా మంది సోషల్ మీడియా వేదికగా పోస్టులు పెడుతున్నారు. సచిన్ కోసమైనా అర్జున్ కు అవకాశం ఇస్తే బాగుంటుంది అని కోరుతున్నారు.

అయితే ఇలాంటి క్రమంలో యువరాజు సింగ్ తండ్రి యోగ్‌రాజ్ సింగ్ ( Yograj Singh ) సంచలన వ్యాఖ్యలు చేశారు. ఒకే ఒక్క ఆరు నెలల సమయం తనకు ఇవ్వాలని.. ఆ టైంలో అర్జున్ టెండూల్కర్ ను నెంబర్ వన్ బ్యాటర్ ను చేసి తీరుతానని ప్రకటించారు. అలా చేయకపోతే తన మీసాలతో పాటు గడ్డం తీసేసి తిరుగుతానని సవాల్ విసిరారు. అర్జున్ టెండూల్కర్ బౌలింగ్ బాగానే.. దాంతో పాటు బ్యాటింగ్ కూడా ఇరగదీస్తే తుది జట్టులో అవకాశం వస్తుందని సూచనలు చేశారు. భవిష్యత్తులో ఆల్రౌండర్లకు మాత్రమే అవకాశం ఉంటుందని యోగ్‌రాజ్ సింగ్ వివరించారు. సచిన్ టెండూల్కర్ లాంటి కుమారుడు అర్జున్ టెండూల్కర్ కు భవిష్యత్తులో మంచి అవకాశాలు రావాలంటే తాను చెప్పినట్లు 6 నెలల పాటు క్రమశిక్షణతో వ్యవహరించాలని కోరారు. ఆ దిశగా సచిన్ టెండూల్కర్ ముందుకు వచ్చి అర్జున్ టెండూల్కర్ ను అప్పగించాలని స్పష్టం చేశారు యువరాజు సింగ్ తండ్రి యోగ్‌రాజ్ సింగ్ ( Yograj Singh ).

Advertisement

 

 

 

Also Read: Chahal Smoking: వివాదంలో యుజ్వేంద్ర చాహల్..సిగ‌రేట్ తాగి, న‌డిరోడ్డుపైనే..ఏం బ‌తుకురా నీది

 

Related News

ఫిఫా వ‌ర‌ల్డ్ క‌ప్ లో వాడిన‌ బంతుల్లో చిప్స్…షాకింగ్ వీడియో వైర‌ల్ !

టైటిల్ గెల‌వ‌గానే త‌ల‌కెక్కిన పొగ‌రు..ట్రంప్ ను తోసేసి, స్పెయిన్ ఓవ‌రాక్ష‌న్‌

గోల్ కీపర్ మార్టినెజ్ ఒక్క‌డు లేక‌పోతే…10-0 తేడాతో అర్జెంటీనా ఓడిపోయేది

సెంచ‌రీ చేసినా రోహిత్ శ‌ర్మ‌పై ఆగ‌ని ట్రోలింగ్…స్లో బ్యాటింగ్ అంటూ వాయించేస్తున్నారుగా

ఫిఫా వ‌ర‌ల్డ్ క‌ప్ 2026 విజేతగా స్పెయిన్‌..ఏకంగా 16 ఏళ్ల త‌ర్వాత స‌రికొత్త చ‌రిత్ర‌

రోహిత్ శ‌ర్మ లార్డ్స్ సెంచ‌రీ వెనుక సీక్రెట్ ఇదే, అత‌ని వ‌ల్లే ల‌క్ క‌లిసివ‌చ్చిందా?

గంభీర్ వెనక కోహ్లీ కుప్పిగంతులు..అస‌భ్యక‌రంగా చేతులు చూపిస్తూ డ్యాన్స్

లార్ట్స్ మైదానంలో ఈ గంట కొట్ట‌డానికి కార‌ణం ఏంటి? దీని వెనుక ఉన్న‌ర‌హ‌స్యం

Big Stories

Advertisement
×