Yuvraj Singh Punishment To Abhishek Sharma : టీమిండియా డేంజర్ ఆటగాడు అభిషేక్ శర్మకు ( Abhishek Sharma ) తాజాగా పనిష్మెంట్ ఇచ్చాడు యువరాజు సింగ్ (Yuvraj Singh). అభిషేక్ శర్మ పుట్టిన రోజు జరిగిన నేపథ్యంలో.. అతనికి డిఫరెంట్ గా విషెస్ చెప్పే పనిలో భాగంగా గుంజీలు తీయించాడు. జిమ్ లోకి వచ్చిన అభిషేక్ శర్మను అక్కడే నిలబెట్టి.. చిన్నపిల్లడి లాగా 20 గుంజీలు తీయించి.. ఆ తర్వాత పుట్టిన రోజు శుభాకాంక్షలు తెలిపారు యువరాజ్ సింగ్. ఈ సంఘటనకు సంబంధించిన వీడియో ఇప్పుడు నెట్టింట వైరల్ గా మారింది. ఈ వీడియోను చూసిన నెటిజెన్స్ రకరకాలుగా కామెంట్స్ చేస్తున్నారు.
టీమిండియా కుర్ర క్రికెటర్ అభిషేక్ శర్మ సెప్టెంబర్ 4వ తేదీన పుట్టినరోజు వేడుకలను చాలా గ్రాండ్ గా జరుపుకున్నారు. నిన్నటితో 26 సంవత్సరాలు పూర్తి చేసుకున్న అభిషేక్ శర్మ… తన గురువు యువరాజ్ సింగ్ దగ్గరకు వెళ్లారు. అయితే అప్పటికే అభిషేక్ శర్మ సరిగ్గా బ్యాటింగ్ చేయలేదన్న కోపంతో యువరాజు సింగ్ ఉన్నాడు. ఈ సందర్భంగా జిమ్ కు వచ్చిన అభిషేక్ శర్మతో దాదాపు 20 గుంజీలు తీయించాడు యువరాజ్ సింగ్. 20 గుంజీలు తీసిన తర్వాత పుట్టిన రోజు శుభాకాంక్షలు తెలిపారు. బ్యాటింగ్ సరిగ్గా చేయాలని.. వచ్చే ఏడాది వరకు మరింత దూకుడుగా ముందుకు వెళ్లాలని ఈ సందర్భంగా సూచనలు చేశారట యువరాజ్ సింగ్. అయితే ఈ సంఘటనకు సంబంధించిన వీడియో బయటకు వచ్చింది. దీంతో రకరకాల కామెంట్స్ వినిపిస్తున్నాయి.
అభిషేక్ శర్మ పై గతంలో పాకిస్తాన్ మాజీ ఫాస్ట్ బౌలర్ మహమ్మద్ అమీర్ ( Mohammed Amir) వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. అభిషేక్ శర్మ ( Abhishek sharma) కళ్ళు మూసుకొని ఆడుతున్నాడని… వాడు పెద్ద స్లాగర్ అంటూ బాంబు పేల్చారు. బ్యాటింగ్ దిగిన తర్వాత కళ్ళు మూసుకొని, ఏదో ఒక షాట్ ఆడతాడు… అది తాకితే సిక్స్ లేకపోతే ఔట్ అన్నట్లుగా పరువు తీశారు. అయితే ఈ మాటలు విన్న యువరాజ్ సింగ్… అభిషేక్ శర్మను స్లాగర్ గానే ట్రీట్ చేశాడని పాకిస్తాన్ సోషల్ మీడియాలో పోస్టులు వైరల్ అవుతున్నాయి.
అందుకే అతడికి పనిష్మెంట్ ఇచ్చాడని ఈ ప్రచారం చేస్తున్నారు. అయితే.. ఈ పోస్టులు చూసిన ఇండియన్ క్రికెట్ అభిమానులు మాత్రం కౌంటర్ ఇస్తున్నారు. యువరాజ్ సింగ్ ఎప్పుడు సరదాగా ఉంటాడని.. అందుకే…ఫన్నీగా అభిషేక్ శర్మతో 20 గుంజీలు తీయించాడని కౌంటర్లు ఇస్తున్నారు. అంతే తప్ప బ్యాటింగ్ సరిగ్గా చేయడం లేదని… పాకిస్తాన్ వారు వాగాడని ఈ పనిష్మెంట్ ఇవ్వలేదని చెబుతున్నారు. అసలు విషయాలు తెలియకుండా మాట్లాడడం బుద్ధి తక్కువ తనం అంటూ ఫైర్ అవుతున్నారు.
Yuvraj Singh Shares Heartfelt Birthday Wishes For Abhishek Sharma #YuvrajSingh #AbhishekSharma #Cricket #BirthdayWishes @YUVSTRONG12 @IamAbhiSharma4 pic.twitter.com/pl3m794bn8
— NewsMobile (@NewsMobileIndia) September 4, 2026