Illu Illalu Pillalu Today Episode September 5th: నర్మదా అలాగే ధీరజ్ వేదవతి అందరూ గదిలోకి వెళ్లి తలుపు వేసుకోవడం చూసిన శ్రీవల్లి వీళ్లిద్దరూ ఏదో నా గురించి మాట్లాడేలా కనిపిస్తున్నారు అని అనుకుంటుంది శ్రీ వల్లి.. కిటికీలోంచి తొంగి చూస్తూ శ్రీవల్లి ఏమైందో అని తెలుసుకునే ప్రయత్నం చేయాలి అని అనుకుంటుంది. నర్మదా శ్రీవల్లిని ఇదంతా చేసిందని ఎంత చెప్తున్నా సరే అసలు వినకుండా వేదవతి అది చేసింది అంటే నేను నమ్మని అని అంటుంది. అయితే నర్మదా శ్రీవల్లిని ఇదంతా చేసింది అని ఎంత చెప్తున్నా సరే అటు ధీరజ్ కూడా నమ్మకపోవడంతో ఆ వల్లి మిమ్మల్ని అంతగా నమ్మించింది. కానీ అదే చేసింది నేను సాక్షాలతో నిరూపిస్తాను. అప్పుడు ఆ బల్లి అంతూ చూస్తానని నర్మదా అంటుంది.. శ్రీవల్లి మాత్రం నా సంగతి నువ్వు బయట పెట్టడం నీ తరం కాదు అని ధీమాగా ఉంటుంది.
వేదవతి తన తమ్ముడి కోసం బాధపడిపోతూ ఉంటుంది. అయితే తిరుపతి తన సంబంధం చెడిపోవడానికి కారణమైన ధీరజ్ ప్రేమలను చాలా పొగిడేస్తూ ఉంటాడు. మా సంబంధం చెడగొట్టిన మీరిద్దరూ కలిసిపోతే బాగుంటుంది అని తిరుపతి చెప్పగానే.. ధీరజ్ ప్రేమ ఇద్దరూ కూడా దీంతో కలవడం ఏంటి అంటూ మరోసారి గొడవ పడతారు. ఇక వేదవతి నర్మదా అక్కడికి వచ్చి తమ్ముడు కోసం వేదవతి కన్నీళ్లు పెట్టుకుంటుంది. నన్ను దొంగ అని అన్నారు నాకు చాలా బాధగా ఉంది అని వేదవతి తో తిరుపతి అని బాధపడతాడు.
అమూల్య చదువుకుంటూ ఉండగా విశ్వం వీడియో కాల్ చేస్తాడు. ఏంటి వీడియో కాల్ చేస్తావ్ ఏంటి ? ఏమైంది.. నన్ను చదువుకొనివా ఎందుకు నువ్వు ఇలా చేస్తున్నావ్ మా ఇంట్లో వాళ్ళు చూస్తే నన్ను చంపేస్తారు అని అమ్ములు చాలా కంగారు పడిపోతూ ఉంటుంది.. ఎందుకంత కంగారు పడుతున్నావ్ నేను ఊరికే నీతో మాట్లాడాలని కాల్ చేశాను కానీ నువ్వు ఎందుకు ఇలా చేస్తున్నావు అని అంటారు. అయితే విశ్వం మాత్రం రంభ థియేటర్లో సినిమా వచ్చింది టికెట్ బుక్ చేయనా మనిద్దరం వెళ్దాము అని అడుగుతాడు ఆ మాట వినగానే అమూల్య చాలా సీరియస్ అవుతుంది. నీకు ఎలా కనిపిస్తున్నాంది నేను సినిమాలకు షికారులకి పని పాట లేకుండా తిరిగే దానిలా కనిపిస్తున్నానా అని అమూల్య అంటుంది. అమూల్య మాత్రం ఎలాగైనా సరే సినిమాకి వెళ్లడానికి ఒప్పుకోవాలి అని విశ్వం విశ్వ ప్రయత్నాలు చేస్తాడు..
విశ్వం అమూల్యకి ఎలాగైనా సరే సినిమాకు ఒప్పించాలి అని అనుకుంటాడు. తను చేసిన డాన్స్ పెర్ఫార్మెన్స్ మాత్రం అమూల్యని కడుపుబ్బ నవ్వించేలా చేస్తుంది.. అసలు ఊహించలేదు నీ డాన్స్ ని చూస్తుంటే నవ్వు ఆగడం లేదు అని అమూల్య అంటుంది.. అయితే అమూల్య సినిమాకు రాను అని చెప్పడంతో విశ్వం ఒక్కసారిగా షాక్ అవుతాడు కానీ అమూల్య నవ్వడంతో తను కూడా చాలా హ్యాపీగా ఫీల్ అవుతాడు. వీళ్ళిద్దరూ కలిసి త్వరలోనే ప్రేమలో పడేలా ఉన్నారు అని అర్థమవుతుంది. మొత్తానికి అమూల్య విశ్వం ఇద్దరూ కూడా చాలా దగ్గర అయిపోయినట్లు కనిపిస్తుంది.
ప్రేమ ధీరజ్ ని చూసి బాధపడిపోతూ ఉంటుంది. ఆ ఇంట్లో వరలక్ష్మీ వ్రతం జరుగుతుంది కదా.. ఏ ఆడపిల్ల అయినా భర్తతో కలిసి వరలక్ష్మి వ్రతం చేసుకోవాలి అని అనుకుంటుంది. కానీ నాకు అదృష్టం లేదు అని ప్రేమ బాధపడడం చూసిన విశ్వం మన ఇంట్లో కూడా వ్రతం చేస్తున్నాం కదా.. నువ్వు ఎలాగైనా సరే ఆ ఇంట్లోకి వెళ్లాలి అని అనుకుంటే వెళ్లేసి రా అని విశ్వం సలహా ఇస్తాడు.. ప్రేమ ఆ ఇంటికి నేను వెళ్ళలేను రా ఇప్పుడున్న పరిస్థితి నీకు తెలియకుండా లేదు.. అంత గొడవ జరిగి నన్ను అవమానించిన ఆ ఇంటికి నేను మళ్ళీ ఎలా వెళ్తాను అసలేం మాట్లాడుతున్నావ్ నువ్వు? నేను వెళ్ళను అని ప్రేమ అంటుంది ధీరజ్మీద అంత ప్రేమ ఉన్నప్పుడు వాళ్ళ తప్పుల్ని కూడా క్షమించే గుణం మీకు ఉండాలి.. అంటూ ఎంతగా చెప్పినా సరే ప్రేమ మాత్రం నో చెప్పేస్తుంది.. వాడిని దూరంగా ఉంచడమే బెటర్. త్వరలోనే మేమిద్దరం కలిసి పోతామన్న నమ్మకం నాకుంది అని ప్రేమ ధీరజ్ కోసం చూస్తూ బాధపడిపోతూ ఉంటుంది.
వల్లి మాత్రం వరలక్ష్మి వ్రతం చేసుకోకుండా ప్రేమ తన భర్తకు దూరంగా ఉంది అని చాలా సంతోషంగా ఉంటుంది. ప్రేమ ధీరథులని విడగొట్టడం నాకు చాలా సంతోషంగా ఉంది అని ఒకటేమైనా డాన్సులు వేస్తూ ఉంటుంది. నా భర్తని నాకు లేకుండా దూరం చేయాలని చూసిన వీళ్ళిద్దరికీ నేను బుద్ధి చెప్పాల్సిందే. నా భర్తతో కలిసి నేను వరలక్ష్మి వ్రతం చేసుకుంటున్నాను కానీ ప్రేమకు ఆ అదృష్టం లేదు అంటూ వంట గదిలోకి వెళ్లి డాన్స్ చేస్తూ మరి సంబరపడిపోతూ ఉంటుంది శ్రీవల్లి.. అయితే శ్రీవల్లిని చూసినా చందు తిట్టేస్తాడు. దేవుడి కోసం చేసిన ప్రసాదం తింటారా దేవుడు పెట్టకుండా కొంచెం కూడా బుద్ధి లేదు. ఒళ్ళు పెరిగేది అందుకే అంటూ మాట్లాడుతాడు. అయితే చందు మాట విన్నవల్లి మౌనంగా ఉంటుంది. ఆ తర్వాత నా మొగుడే కదా నన్ను అనింది అని మళ్ళీ తినడం మొదలు పెడుతుంది..
ధీరజ్ బయట తోరణాలు కడుతూ ఉండగా ఆటోలో నుంచి ఒక అమ్మాయి పరిగెత్తుకుంటూ వస్తుంది అది ఎవరో అని ప్రేమ చూస్తుంది అయితే ధీరజ్ అంటూ అమ్మాయి పరిగెత్తడం చూసిన ప్రేమ ఆ ముగ్దను వ్రతానికి కూడా పిలిచాడు అని చాలా తిట్టేసుకుంటూ ఉంటుంది.. ముద్ద రాగానే ధీరజ్ని కౌగిలించుకొని ఉండటం చూసి అందరూ ఒక్కసారిగా షాక్ అవుతారు. రామరాజు ఫ్యామిలీ అంతా బయటకు వచ్చి అసలు ఏం జరిగింది.. ఎవరు ఈ అమ్మాయి అని అందరికీ అనుమానం వస్తుంది. ధీరజ్ మాత్రం వదిన వాళ్ళ ఫ్రెండ్ అని చెప్పగానే ఇక నర్మదా కూడా తప్ప లేక ఒప్పుకుంటుంది.. ఇక అందరూ కలిసి వ్రతం చేసుకోలేని లోపలికి వెళ్తారు పంతులుగారు రావడంతో వ్రతాన్ని మొదలుపెడతారు.. అక్కడితో ఎపిసోడ్ పూర్తవుతుంది. రేపటి ఎపిసోడ్ లో ఏం జరుగుతుందో చూడాలి..