E-Paper
Advertisement

Karthika Deepam 2 Serial Today Episode September 5th ‘కార్తీక దీపం 2’ సీరియల్‌:  సూరజ్ ను అనుమానించిన మాలిని         

Karthika Deepam 2 Serial Today Episode September 5th ‘కార్తీక దీపం 2’ సీరియల్‌:  సూరజ్ ను అనుమానించిన మాలిని         
Advertisement

Karthika Deepam 2 serial today Episode: దక్షిణమూర్తితో మాట్లాడిన కార్తీక్‌, దీప ఇద్దరూ సూరజ్‌ దగ్గరకు వెళ్తారు. వాళ్లను చూసిన సూరజ్‌ అనుమానంగా జ్యోత్స్ననే మిమ్మల్ని ఇక్కడకు పంపిందా అని అడుగుతాడు. అందుకు కార్తీక్‌ కోపంగా మమ్మల్ని నమ్మించి మోసం చేశావు. అందరి ముందు మమ్మల్ని దోషులను చేశావు. ఇప్పుడు మళ్లీ జ్యోత్స్న పంపిందా అని అడుగుతున్నావు.. తప్పు చేసినా ఎంత ధైర్యంగా నిలబడుతున్నావు సూరజ్‌ నువ్వు అంటూ కార్తీక్‌ అడిగితే.. నేను చేసిన దాంట్లో తప్పేం ఉంది అంటూ ఎదురు ప్రశ్నిస్తాడు సూరజ్‌.

ఓ ఆడపిల్ల జీవితం నాశనం చేసి అందులో తప్పేం ఉందని మళ్లీ ఎదురు ప్రశ్నిస్తున్నావా..? పైగా మమ్మల్ని నమ్మించడానికి ఎంత దిగజారిపోయావు అనాథనన్నావు.. ఎవ్వరూ లేరని సింపథీ కొట్టేశావు అంటూ కార్తీక్‌ తిడుతుంటే.. అదంతా మా అమ్మ కోసం చేశాను అంటాడు సూరజ్‌. మీ అమ్మ కూడా ఒక ఆడదేగా నువ్వు మోసం చేసింది ఒక ఆడపిల్లనేగా..? ఆడపిల్లను మోసం చేయడం మగతనం అనుకుంటున్నావా..? సూరజ్‌ నువ్వు మనసుతో ఆలోచించు ఎంత మూర్ఖంగా ప్రవర్తించావో తెలుస్తుంది. నువ్వు ప్రతీకారం తీర్చుకుంటే.. మీ అమ్మ వల్ల మా అమ్మ కాళ్లు పోయావి కదా.. అయితే నేను కూడా మీ అమ్మ కాళ్లు పోయేలా చేయాలా..? అంటూ కార్తీక్‌ ప్రశ్నిస్తే..

Advertisement

సూరజ్‌ కూడా అంతే కోపంగా మీ మామయ్య వల్ల మా నాన్న ప్రాణాలే పోయాయి.. మా అత్తను మాకు శత్రువును చేశారు.. ఇది తప్పు అని మీ తాత ఎప్పుడైనా చెప్పారా..? కనీసం కాళ్లు లేని అమ్మైనా నీకు ఉంది.. కానీ నాకు మా నాన్న లేడు.. నేను కడుపులో ఉండగానే.. చనిపోయారు. మా నాన్న ఫొటో ముందు దీపం వెలుగుతూ ఉంటుంది. కానీ మా ఇంట్లో మాత్రం వెలుతురు లేదు అంటూ సూరజ్‌ ఎమోషనల్‌ అవుతాడు.

సూరజ్‌ మాటలకు కార్తీక్‌ కొంచెం కూల్ అవుతూ.. ఒక నాణేనికి నువ్వు ఒకవైపు ఉన్నావు నేను ఒకవైపు ఉన్నాను. మనిద్దరి జీవితాలు దాదాపు ఒకటే జీవితంలో కొన్ని వదిలేయకపోతే ముందుకు వెళ్లలేం నీ మాటలు విన్నాక నాకొకటి అర్థం అయింది. జ్యోత్స్న నిన్ను ఎంత ప్రేమించిందో నువ్వు కూడా జ్యోత్స్నను అంతే ప్రేమించావు. నీ మాటలు బట్టి నాకు అదే అర్థం అవుతుంది. ఎందుకంటే నువ్వు నిజంగా జ్యోత్స్న మీద పగ సాధించాలి అనుకుంటే పెళ్లి చేసుకుని ఇంటికి తీసుకొచ్చి టార్చర్‌ పెట్టేవాడివి.. కానీ అలా  చేయలేకపోయావు అంటే నీకు జ్యోత్స్న మీద ప్రేమ ఉంది.. ఇక మీ ప్రేమే మిమ్మల్ని కలుపుతుంది అంటూ దీపను తీసుకుని వెళ్లిపోతాడు కార్తీక్‌.

Advertisement

బయటకు వెళ్లిన కార్తీక్‌.. దీపతో సూరజ్‌ నిజంగానే జ్యోత్స్నను ప్రేమిస్తున్నాడు. ఇప్పుడు మనం చేయాల్సిందల్లా సూరజ్‌ తండ్రి మరణ విషయంలో శివనారాయణ తాత వాళ్ల ప్రమేయం లేదన్న విషయం సూరజ్‌ నమ్మేలా చేయాలి. అప్పుడే ఈ సమస్యను పరిష్కరించగలం.. కానీ మాలిని ఈ విషయంలో వేసే ఎత్తుగడలను ఎప్పటికప్పుడు మనం గమనిస్తూ.. ముందుకు వెళ్లాలి అని చెప్తాడు.

మరోవైపు కార్తీక్‌, దీపలు సూరజ్ తో మాట్లాడిన విషయాలు అన్ని చాటు నుంచి విని వాళ్లు వెళ్లిపోయాక సూరజ్‌ దగ్గరకు వెళ్తుంది. నువ్వు నిజంగానే జ్యోత్స్నను ప్రేమిస్తున్నావా…? అని అడుగుతుంది. అందుకు సూరజ్‌ అమ్మా నీకెందుకు ఆ అనుమానం వచ్చింది.. కార్తీక్‌ అడిగినప్పుడు నేను మౌనంగా ఉన్నానని అనుమానిస్తున్నావా..? మమ్మీ మనం నాన్న చావుకు ప్రతీకారం తీర్చుకున్నాం. ఇక ఇప్పుడు మనం మనకోసం బతుకుదాం అంటూ చెప్పి వెళ్లిపోతాడు. మాలిని మాత్రం సూరజ్‌ను అనుమానిస్తుంది. వీడు అసలు జ్యోత్స్నను ప్రేమిస్తున్నట్టా..? లేదా అని మనసులో అనుకుంటుంది.

పారిజాతం దగ్గరకు వెళ్లిన దాసు ఎమోషనల్‌ అవుతూ.. జ్యోత్స్న విషయంలో నువ్వు చేసిన పనికి అది శిక్ష అనుభవిస్తుంది. దీపను తల్లికి దూరం చేసి నా బిడ్డను అక్కడకు చేర్చావు. ఆ పాపమే ఇప్పుడు జ్యోత్స్నకు శాపంగా మారింది అంటూ ఏడుస్తాడు. ఇంతలో ఇవాళ్టీ కార్తీకదీపం2 ఏపిసోడ్‌ అయిపోతుంది.

 ALSO READ: మిథున రాశిలోకి శుక్రుడు – ఆ ఐదు రాశులకు గజలక్ష్మీ యోగం – అపర కుబేరులు అవ్వడం ఖాయం

 

Related News

Ninnu kori Serial Today Episode September 2nd ‘నిన్ను కోరి’ సీరియల్‌: ఎంగేజ్ మెంట్ క్యాన్సిల్ చేసేందుకు శృతి తిప్పలు     

Gundeninda GudiGantalu Today episode: ప్రభావతికి మీనా స్ట్రాంగ్ వార్నింగ్.. కామాక్షి దెబ్బకు అవుట్.. మౌనికకు షాక్..

Karthika Deepam 2 Serial Today Episode August 26th ‘కార్తీక దీపం 2’ సీరియల్‌: పెళ్లికి ముందు జ్యోకు సీక్రెట్ గిఫ్ట్ ఇచ్చిన సూరజ్        

Brahmamudi Serial Today Episode August 14th ‘బ్రహ్మముడి’ సీరియల్‌: కంపెనీ లాభాల గురించి చెప్పిన రాజు 

ఎయిర్ ఇండియా విమానానికి తప్పిన ప్రమాదం.. విజయవాడలో సేఫ్ ల్యాండింగ్!

Nindu Noorella Saavasam Serial Today Episode August 10th ‘నిండు నూరేళ్ల సావాసం’ సీరియల్‌: కాబ్రాకు హెల్ప్‌ చేసిన మనోహరి

మెగా ఫ్యాన్స్ దెబ్బకు భయపడుతున్న ‘పెద్ది’ నటుడు!

Big Stories

Advertisement
×