E-Paper
Advertisement

ZIM vs SL: జింబాబ్వే చేతిలో చిత్తుగా ఓడిన శ్రీలంక‌..95 ప‌రుగుల‌కే ఆలౌట్‌

ZIM vs SL: జింబాబ్వే చేతిలో చిత్తుగా ఓడిన శ్రీలంక‌..95 ప‌రుగుల‌కే ఆలౌట్‌
Advertisement

ZIM vs SL:  పాకిస్తాన్ ( Pakistan )వేదికగా జరుగుతున్న టి20 ట్రై సిరీస్ 2025 టోర్నమెంట్ లో ( Pakistan T20I Tri-Series 2025) జింబాబ్వే ( Zimbabwe) ఎవరు ఊహించని విజయాన్ని నమోదు చేసుకుంది. భయంకరమైన శ్రీలంక జట్టును చిత్తుచిత్తుగా ఓడించింది జింబాబ్వే. టి20 ట్రై సిరీస్ 2025 టోర్నమెంటులో భాగంగా ఇవాళ శ్రీలంక వర్సెస్ జింబాబ్వే ( Sri Lanka vs Zimbabwe) మధ్య రెండవ మ్యాచ్ జరిగింది. రావాల్పిండి అంతర్జాతీయ క్రికెట్ స్టేడియం వేదికగా జరిగిన ఈ మ్యాచ్ లో శ్రీలంక జట్టును ( Sri Lanka ) చిత్తు చేసింది పసికూన జింబాబ్వే. ఈ మ్యాచ్ లో శ్రీలంకపై ఏకంగా 67 పరుగులతో విజయం సాధించి, సరికొత్త చరిత్ర సృష్టించింది జింబాబ్వే. ఈ మ్యాచ్ లో జింబాబ్వే విజయం సాధించిన నేపథ్యంలో ప్రపంచవ్యాప్తంగా ప్రశంసల వర్షం కురుస్తోంది. పసికూన జట్టు జింబాబ్వేను ఎవరు కూడా తక్కువ అంచనా వేయకూడదని కామెంట్స్ చేస్తున్నారు. టి20 క్రికెట్ లో ఎప్పుడు ఏం జరుగుతుందో తెలియదని.. దానికి నిర్దేశమే జింబాబ్వే విజయం అంటున్నారు.

Also Read: Hardik Pandya engaged: సీక్రెట్ గా బాలీవుడ్ న‌టితో హార్దిక్ పాండ్యా ఎంగేజ్‌మెంట్..కోట్లు విలువ చేసే రింగ్ తొడిగి మ‌రీ ! 

జింబాబ్వే చేతిలో చిత్తుగా ఓడిన శ్రీలంక‌

Advertisement

పాకిస్తాన్ వేదిక‌గా జ‌రుగుతోన్న టీ20 ట్రై సిరీస్ లో భాగంగా మొదట బ్యాటింగ్ చేసిన జింబాబ్వే, నిర్ణీత‌ 20 ఓవర్స్ లో 8 వికెట్లు నష్టపోయి 162 పరుగుల లక్ష్యాన్ని శ్రీలంక ముందు ఉంచింది. ఈ మ్యాచ్ లో భాగంగా జింబాబ్వే ఓపెనర్ బ్రియాన్ బెన్నెట్ 49 పరుగులు సాధించగా కెప్టెన్ రజా 47 పరుగులతో రెచ్చిపోయాడు. వీళ్లిద్దరు మినహా ఏ ఒక్క ప్లేయర్ సరిగ్గా ఆడలేదు. అయినప్పటికీ 162 పరుగులు సాధించింది. ఇక ఈ 163 పరుగుల లక్ష్యాన్ని చేదించే క్రమంలో శ్రీలంక జట్టు అత్యంత దారుణంగా విఫలమైంది. నిర్ణీత 20 ఓవర్స్ లో 95 పరుగులకు ఆలౌట్ అయింది శ్రీలంక. శ్రీలంక కెప్టెన్ దాసున్ షనకా ( Dasun Shanaka) ఒక్కడే 25 బంతుల్లో 34 పరుగులు చేశారు. మిగిలిన ఏ ఒక్క బ్యాటర్ కూడా సింగిల్ డిజిట్ దాటలేదు. అందరూ అత్యంత దారుణంగా విఫలమయ్యారు. దీంతో 95 పరుగులకే శ్రీలంక కుప్పకూలి, జింబాబ్వే చేతిలో 67 పరుగుల తేడాతో ఓడిపోయింది.

పాయింట్లు పట్టికలో పాకిస్తాన్ ను బీట్ చేసిన జింబాబ్వే

జింబాబ్వే పై 67 పరుగుల తేడాతో విజయం సాధించిన జింబాబ్వే పాయింట్ల పట్టికలో మొదటి స్థానానికి దూసుకు వెళ్ళింది. ఈ టోర్నమెంట్ లో ఒక ఓటమితో పాటు మరో విజయాన్ని సాధించిన ఆ జింబాబ్వే మొదటి స్థానంలో నిలిచింది. అటు పాకిస్తాన్ ఆడిన ఒకే ఒక్క మ్యాచ్ లో విజయం సాధించి రెండవ స్థానంలో ఉంది. శ్రీలంక మూడో స్థానంలో నిలిచింది. ఇందులో టాప్ లో ఉన్న రెండు జ‌ట్ల‌ మధ్య ఫైనల్ మ్యాచ్ జరుగుతుంది. నవంబర్ 29వ తేదీన ఫైనల్ మ్యాచ్ ఉండనుంది.

Advertisement

Also Read: Asia Cup Rising Stars 2025: టీమిండియా వ‌ర్సెస్ బంగ్లా మ‌ధ్య సెమీస్‌..పాకిస్తాన్ మ్యాచ్ కూడా, టైమింగ్స్‌, ఉచితంగా ఎలా చూడాలంటే

Related News

లార్డ్స్ వన్డేలో బాల్ టాంపరింగ్…శ్రేయస్ అయ్యర్ పై బ్యాన్?

లార్డ్స్ నుంచి అలిగి ఇంటికి వెళ్లిపోయిన గంభీర్..?

ఫిఫా వ‌ర‌ల్డ్ క‌ప్ లో వాడిన‌ బంతుల్లో చిప్స్…షాకింగ్ వీడియో వైర‌ల్ !

టైటిల్ గెల‌వ‌గానే త‌ల‌కెక్కిన పొగ‌రు..ట్రంప్ ను తోసేసి, స్పెయిన్ ఓవ‌రాక్ష‌న్‌

గోల్ కీపర్ మార్టినెజ్ ఒక్క‌డు లేక‌పోతే…10-0 తేడాతో అర్జెంటీనా ఓడిపోయేది

సెంచ‌రీ చేసినా రోహిత్ శ‌ర్మ‌పై ఆగ‌ని ట్రోలింగ్…స్లో బ్యాటింగ్ అంటూ వాయించేస్తున్నారుగా

ఫిఫా వ‌ర‌ల్డ్ క‌ప్ 2026 విజేతగా స్పెయిన్‌..ఏకంగా 16 ఏళ్ల త‌ర్వాత స‌రికొత్త చ‌రిత్ర‌

రోహిత్ శ‌ర్మ లార్డ్స్ సెంచ‌రీ వెనుక సీక్రెట్ ఇదే, అత‌ని వ‌ల్లే ల‌క్ క‌లిసివ‌చ్చిందా?

Big Stories

Advertisement
×