E-Paper
Advertisement

Bigg Boss 9 Telugu : రీతూ తల్లి రియాక్షన్ తో బిక్క మొహం వేసిన డెమోన్… బంధానికి బ్రేక్ ?

Bigg Boss 9 Telugu : రీతూ తల్లి రియాక్షన్ తో బిక్క మొహం వేసిన డెమోన్… బంధానికి బ్రేక్ ?

Bigg Boss 9 Telugu : బిగ్ బాస్ ప్రతి సీజన్ లో ఓ లవ్ ట్రాక్ హైలెట్ అవుతూ ఉంటుంది. ఈసారి సీజన్ 9లో రీతూ చౌదరి – డెమోన్ జంట ఆ లవ్ ట్రాక్ నడిపిస్తూ టాక్ ఆఫ్ ది టౌన్ అవుతున్నారు. ఫ్రెండ్షిప్ అంటూనే ఒకరిపై ఒకరు అలగడం, చిన్న చిన్న విషయాలకే తగవులాడుకోవడం వంటివి చేస్తూ లవర్స్ కు ఏమాత్రం తక్కువ కాదు అన్నట్టుగా బిహేవ్ చేస్తూ ఉంటారు. మొదట్లో వీళ్ళ బాండింగ్ పై ఎన్నో విమర్శలు వచ్చినా, ఇప్పుడు మాత్రం ఓ వర్గం క్యూట్ కపుల్ అంటూ అభిమానులు అయిపోయారు. మరి ఇలాంటి విషయాలపై ఇంట్లో వాళ్ళు అంత కూల్ గా రియాక్ట్ కారు కదా ? రీతూ తల్లి కూడా అదే చేసింది. దీంతో డెమోన్ డీలా పడిపోయాడు.

డెమోన్ ముఖం చూడని రీతూ తల్లి 

ఫ్యామిలీ వీక్ లో హౌస్ లోకి వచ్చిన రీతూ తల్లి డెమోన్ కు షాక్ ఇచ్చింది. వస్తూనే నేను చెప్పింది ఏంటి? నువ్వు చేస్తుంది ఏంటి? అంటూ అట్లకాడ అందుకుంది. ‘నన్ను కొడతావా మమ్మీ’ అని రీతూ గుక్కపెట్టి ఏడవడంతో ఆ పనిని మానుకుంది ఆవిడ. అంతేకాదు బెడ్రూమ్ లోకి తీసుకెళ్లి గేమ్ పై మాత్రమే ఫోకస్ పెట్టు అంటూ ఇన్ డైరెక్ట్ గా డెమోన్ కు దూరంగా ఉండమని హెచ్చరించింది. పైగా తనూజా బాగా సపోర్ట్ చేసింది అంటూ ఆమెను, అలాగే ఇమ్మూని బెడ్రూమ్ లోకి పిలిచి మరీ మాట్లాడింది. కానీ పాపం డెమోన్ ముఖం కూడా చూడలేదు. వెళ్ళేటప్పుడు మాత్రం ‘మీ అమ్మతో మాట్లాడాను. ఆవిడ రీతూను బాగా చూసుకుంది’ అని డెమోన్ తో చెప్పి వెళ్ళిపోయింది.

రీతూ వివరణ 

రీతూ, ఆమె తల్లి బెడ్రూమ్ లో మాట్లాడుకుంటుంటే డెమోన్ తెగ టెన్షన్ పడిపోయాడు. అతను డీలా పడడం చూసిన సంజన నీ గురించి కాదులే వాళ్ళు మాట్లాడేది అంటూ సర్ది చెప్పడానికి ట్రై చేసింది. ఇక తల్లి వెళ్ళాక రీతూ “కొందరికి కొన్ని నచ్చుతాయి, మరికొందరికి నచ్చవు. అందరిదీ ఒకే మైండ్ సెట్ ఉండదు కదా” అంటూ డెమోన్ ను కూల్ చేసే ప్రయత్నం చేసింది. దీంతో డెమోన్ “అదంతా చూశాక ఈ అమ్మాయికి దూరంగా ఉండాలని అర్థం అయ్యింది” అని కామెంట్ చేశాడు. రీతూ సమాధానం చెప్పలేకపోయింది. డెమోన్ తల్లి మాత్రం రీతూని బాగా రిసీవ్ చేసుకుంది. మరి ఇప్పటికైనా వీళ్ళిద్దరూ ఈ ట్రాక్ కు ఫుల్ స్టాప్ పెడతారా? అనేది చూడాలి. లేదంటే రీతూ పరిస్థితి ఇంటికి వెళ్ళాక ఎలా ఉంటుందో ఇప్పటికే శాంపిల్ చూపించింది

Read Also : ఆ అమ్మాయికి దూరంగా ఉండు… బాండింగ్స్ పై భరణికి కూతురు వార్నింగ్

Related News

త్వరలోనే పెళ్లి పీటలు ఎక్కబోతున్న బిగ్ బాస్ బ్యూటీ.. వరుడు ఎవరంటే..?

Siri Hanumanth : యాంకర్ సిరి హనుమంత్ నెలకు ఎంత సంపాదిస్తుందో తెలుసా..?

బిగ్ బాస్ ‘అగ్ని పరీక్ష 2’ డేట్ వచ్చేసింది.. షో పూర్తి వివరాలు ఇవే..

Bigg Boss : నటికి శాపంగా మారిన బిగ్ బాస్.. ఇప్పుడేం చేస్తుందంటే..?

ట్రోలర్స్ ఇనయా దిమ్మతిరిగే కౌంటర్.. కాన్ఫిడెంట్ కు మెచ్చుకోవాల్సిందే..!

Bigg Boss Soniya: గిన్నీస్ బుక్ లో సోనియా కూతురికి చోటు.. ఏం చేసిందో తెలుసా..?

Demon Pawan : వివాదంలో బిగ్ బాస్ కంటెస్టెంట్ డిమాన్.. ఆగని ట్రోల్స్..!

బిగ్ బాస్ నటితో సిరాజ్ డేటింగ్.. సంచలనం సృష్టిస్తున్న వీడియో!

Big Stories

×