E-Paper
Advertisement

Cyber Towers : సైబర్ టవర్ @25 ఏళ్లు.. హైదరాబాద్‌లో చంద్రబాబు కృతజ్ఞత సభ

Cyber Towers : సైబర్ టవర్ @25 ఏళ్లు.. హైదరాబాద్‌లో చంద్రబాబు కృతజ్ఞత సభ
Advertisement

Cyber Towers : హైదరాబాద్ లో ఉన్న హైటెక్ సిటీని అభివృద్ధి చేసింది చంద్రబాబే అన్న విషయం తెలిసిందే. హైటెక్‌ సిటీలో సైబర్‌ టవర్‌ నిర్మించి 25 ఏళ్లు పూర్తయిన సందర్భంగా.. మాజీ సీఎం టీడీపీ అధినేత చంద్రబాబుకు కృతజ్ఞతగా.. భారీ ఎత్తున గ్రాటిట్యూడ్‌ కన్సర్ట్ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నారు ఐటీ ఉద్యోగులు. గచ్చిబౌలి బాలయోగి స్టేడియంలో ఆదివారం సాయత్రం 4 గంటల నుంచి 9 గంటల వరకూ సభ జరగనుండగా.. పోలీసులు షరతులతో కూడిన అనుమతినిచ్చారు. లక్ష మందితో జరిగే ఈ సభకు పెద్ద ఎత్తున ఏర్పాట్లు చేస్తున్నారు. ఈ కార్యక్రమానికి దేశ, విదేశాల నుంచి చంద్రబాబు అభిమానులు తరలిరానున్నట్లు తెలుస్తోంది.

స్కిల్‌ స్కాం కేసులో చంద్రబాబు జైలులో ఉండటంతో ఈ సభకు ప్రాధాన్యత ఏర్పడింది. రాజమండ్రి జైలులో 50 రోజులకు పైగా చంద్రబాబు జైలు జీవితాన్ని అనుభవిస్తున్నారు. ఒక్క స్కిల్‌ స్కాం కేసే కాకుండా పలు రకాల కేసులను చంద్రబాబు ఎదుర్కొంటున్నారు. వీటికి సంబంధించిన బెయిల్ పిటిషన్లు, విచారణ పర్వం కొనసాగుతోంది. ఈ నేపథ్యంలోనే ఆయన అవినీతిపరుడు కాదని.. అభివృద్ధికి బాటలు వేసిన నేత అని తెలిపే క్రమంలో భారీ ఎత్తున కృతజ్ఞత సభను నిర్వహిస్తున్నట్టు సమాచారం.

Advertisement

ఇక చంద్రబాబు అరెస్ట్‌ను ఖండిస్తూ నిరసనలు కొనసాగుతున్నాయి. త్వరలో ఏపీలో ఎన్నికల నేపథ్యంలో జగన్‌ను ఎదుర్కొనే దిశగా ప్రచారం సాగిస్తున్నారు టీడీపీ శ్రేణులు. వైసీపీ కుట్ర రాజకీయాల్లో భాగంగానే చంద్రబాబును జైలుకు పంపారన్న అంశాన్ని ప్రజల్లోకి తీసుకెళ్లే ప్రయత్నం చేస్తున్నారు.

Related News

హైదరాబాద్‌లో భారీగా పెరగనున్న ఆటో చార్జీలు.. కొత్త ఛార్జీలు ఇవే

ఇక దండయాత్రే కాస్కోండి.. నకిరేకల్‌లో సీఎం రేవంత్ రెడ్డి మాస్ స్పీచ్!

ఓలా, ఊబర్, ర్యాపిడో బైక్‌లు సీజ్.. రవాణా శాఖకు ఆటో జేఏసీ డెడ్‌లైన్!

బీజేపీ అంటే చెత్త కుప్ప కాదు..కొండా సురేఖ ఎంట్రీపై మురళీధర్ రావు వైరల్ కామెంట్స్ !

గాంధీ భవన్‌లో బీసీ హక్కుల గర్జన.. కేంద్రంపై కాంగ్రెస్ పార్టీ నెక్ట్స్ ప్లాన్ ఇదే?

SIR దరఖాస్తుదారులకు బిగ్ షాక్.. 50 శాతం మందికి నోటీసులు జారీ!

మేడ్చల్లో తీవ్ర విషాదం.. ఉరివేసుని 11 ఏళ్ల మైనర్ బాలిక ఆత్మహత్య!

ప్రమాదానికి గురైన కేటీఆర్ కారు.. వాహనం సైడు భాగం డ్యామేజ్, అసలు ఎలా జరిగింది?

Big Stories

Advertisement
×