E-Paper
Advertisement

Champapet Crime : స్వప్న హత్యకేసులో ట్విస్ట్.. నిందితుడు అతడేనా ?

Champapet Crime : స్వప్న హత్యకేసులో ట్విస్ట్.. నిందితుడు అతడేనా ?
Advertisement

Champapet Crime : చంపాపేట్‌ యువతి స్వప్న హత్య.. హైదరాబాద్‌లో ప్రకంపనలు సృష్టించింది. ఎట్టకేలకు ఈ మర్డర్‌ కేసులో పోలీసులు పురోగతి సాధించారు. ప్రేమించి పెళ్లి చేసుకున్న భర్త ప్రేమ్‌ కుమారే హత్య చేశాడని పోలీసులు భావిస్తున్నారు. ఘటనాస్థలంలో దొరికిన కత్తిపై ప్రేమ్ కుమార్ ఫింగర్ ప్రింట్స్ మ్యాచ్ అయ్యాయని స్పష్టం చేశారు. ప్రేమ్‌కుమార్‌ ఇంటికి వెళ్లేసరికి.. స్వప్న వేరేవారితో సన్నిహితంగా ఉండటం చూసి.. కోపంతో చంపేశాడని అనుమానిస్తున్నారు. అప్పటికే అక్కడ ఉన్న మరో ఇద్దరు యువకులు స్వప్న హత్య జరగగానే పారిపోయారు. దీంతో వారి పాత్రపై పోలీసులు అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు. స్వప్నని పొడిచి ప్రేమ్‌కుమార్‌ భవనంపై నుంచి దూకేసి ఉంటాడని.. అతను కోలుకుంటేనే మరిన్ని విషయాలు బయటకొస్తాయని పోలీసులు చెబుతున్నారు.

మహబూబ్‌నగర్ జిల్లా కొత్తపేటకు చెందిన స్వప్న.. తల్లిదండ్రులతో కలిసి హైదరాబాద్‌లో ఉంటోంది. ఇదే క్రమంలో 8 నెలల క్రితం స్వప్న.. హన్మంత్‌ అనే యువకుడితో కలిసి చంపాపేటలోని రాజిరెడ్డినగర్‌లోని ఓ ఇల్లు అద్దెకు తీసుకుని ఉంటున్నారు. అయితే నెలరోజుల క్రితం.. ప్రేమ్‌కుమార్‌ అనే మరో యువకుడిని ప్రేమించి పెళ్లి చేసుకుంది. మధ్యలో ఈ హన్మంత్‌ ఎవరు?.. ఎందుకు వీరిద్దరు గది అద్దెకు తీసుకుని ఉన్నారన్న దానిపై పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. స్వప్నకి ప్రేమ్ కుమార్‌కు హన్మంతు మధ్యవర్తిత్వం వహించాడని చెప్తున్నారు. ప్రేమ్‌కుమార్‌ కోలుకుంటేనే తప్ప అసలు వాస్తవాలు బయటకొచ్చే అవకాశముంది.

Tags

Related News

పెను విషాదం.. 40 మందితో వెళుతోన్న ప‌డ‌వ బోల్తా

మధ్యప్రదేశ్‌లో విషాదం.. ఎద్దును రక్షించబోయి ముగ్గురు మృతి!

ఘోర బస్సు ప్రమాదం.. క్షణాల వ్యవధిలో తగలబడిన బస్సు.. స్పాట్‌లో!

ఘట్‌కేసర్‌లో ఘోర విషాదం.. రైలు కింద పడి దంపతుల ఆత్మహత్య!

ఈగల్ ఫోర్స్ ‘మరో’ సక్సెస్ ఆపరేషన్.. 180 కిలోల గంజాయి సీజ్!

26 రోజుల ఎదురుచూపు.. ఏజెన్సీ గ్రామాలను కుదిపేస్తున్న తండ్రి ఆవేదన!

టోల్ ప్లాజా వద్ద పేలిన ఎల్పీజీ ట్యాంకర్.. ఆరుగురు మృతి!

పెళ్లి వేడుకల్లో ఊహించని విషాదం.. లారీ రూపంలో వచ్చిన రాక్షసుడు.. ఒకే కుటుంబంలో నలుగురు బలి!

Big Stories

Advertisement
×