E-Paper
Advertisement

Mukesh Ambani : అంబానీకి మరో బెదిరింపు.. ఈసారి ఏకంగా రూ.200 కోట్లు డిమాండ్

Mukesh Ambani : అంబానీకి మరో బెదిరింపు.. ఈసారి ఏకంగా రూ.200 కోట్లు డిమాండ్
Advertisement

Mukesh Ambani : రిలయన్స్ అధినేత ముఖేష్‌ అంబానీకి మరో బెదిరింపు ఈమెయిల్ వచ్చింది. ఈసారి నిందితులు ఏకంగా 200 కోట్ల రూపాయలు డిమాండ్ చేశారు. అడిగినంత డబ్బు ఇవ్వకపోతే ముఖేష్ అంబానీని చంపేస్తామని వార్నింగ్ ఇచ్చారు. శనివారం 20 కోట్లు డిమాండ్‌ చేస్తూ మెయిల్ పంపిన నిందితులు.. దానికి స్పందించకపోవడంతో 200 కోట్లు డిమాండ్‌ చేస్తూ అదే అకౌంట్‌ నుంచి మరో ఈమెయిల్ పంపారు. ముఖేష్‌ అంబానీని కాల్చి చంపుతామని మెయిల్‌లో బెదిరించిన నిందితులు.. తమ దగ్గర దేశంలోనే బెస్ట్ షూటర్లు ఉన్నారని పేర్కొన్నారు. అంబానీ సెక్యూరిటీ ఇన్‌ఛార్జ్‌ ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసిన పోలీసులు.. మెయిల్ ఎక్కడి నుంచి వచ్చింది? ఎవరు పెట్టారు? అనే వివరాల కోసం దర్యాప్తు చేస్తున్నారు.

రిలయన్స్ ఫౌండేషన్ ఆధ్వర్యంలో నడుస్తున్న ఆస్పత్రికి బెదిరింపు ఫోన్ కాల్ వచ్చిన కొద్దిరోజుల్లోనే.. ముఖేష్ అంబానీని చంపేస్తామని హెచ్చరిస్తూ రెండు రోజుల్లో రెండు మెయిల్ రావడం కలకలం రేపుతోంది. ఈ రెండు ఘటనలతో ముంబై పోలీసులు అప్రమత్తం అయ్యారు. ఆయన నివాసానికి అదనపు భద్రతను కల్పించారు.

Advertisement

ఇప్పుడే కాదు.. గతంలోనూ ముఖేష్ అంబానీకి బెదిరింపులు వచ్చాయి. 2021లో ఆయన నివాసం అంటాలియాకు అత్యంత సమీపంలో కారును పార్క్ చేసిన ఉదంతం అనేక మలుపులు తిరిగింది. ఆ కారులో 20 జిలెటిన్ స్టిక్స్ లభించాయి. ఇది కేవలం గ్లింప్సెస్ మాత్రమే అనే బెదిరింపు లేఖనూ పోలీసులు ఆ కారు నుంచి స్వాధీనం చేసుకున్నారు. ఇప్పుడు తాజాగా ఆయనకు మరో రెండు బెదిరింపు మెయిల్స్ రావడం ఆందోళన కలిగిస్తోంది.

Tags

Related News

డేంజర్ బెల్స్.. నేపాల్ వరదల ఎఫెక్ట్‌కు బీహార్ అతలాకుతలం!

జమ్మూ కాశ్మీర్‌లో భారీ ఎన్‌కౌంటర్.. లష్కరే తోయిబా టాప్ కమాండర్ యాసిర్ ఖతం!

లారీని ఢీకొట్టిన కారు.. 8 మంది ఇంజినీరింగ్ స్టూడెంట్స్ మృతి, త్రిస్సూర్‌లో ఘోర రోడ్డు ప్రమాదం

కేంద్ర ప్రభుత్వ ఉద్యోగం.. 1748 జూనియర్ ఇంజినీర్ ఖాళీలు.. రూ.1.12 లక్ష వరకు సాలరీ

మంటల్లో టూరిస్టు బస్సు.. ప్రయాణికులు-డ్రైవర్ సేఫ్, ముంబైలో ఘటన

సోనియా గాంధీ ఆత్మకథ పుస్తకం విడుదలకు డేట్ ఫిక్స్..!

సీఎం యోగి కాన్వాయ్ సమీపంలో పేలుడు, ఉలిక్కిపడిన అధికారులు, మధుర వెళ్లే దారిలో ఘటన

బ్యాంక్ ఆఫ్ ఇండియాలో ఆఫీసర్ జాబ్స్.. కనీస వేతనం రూ.50,000.. పూర్తి వివరాలివిగో

Big Stories

Advertisement
×