BigTV English

Achampet : కాంగ్రెస్ విజయోత్సవ ర్యాలీ.. మాజీ ఎమ్మెల్యే గువ్వల బాలరాజు అరెస్ట్..

Achampet : కాంగ్రెస్ విజయోత్సవ ర్యాలీ.. మాజీ ఎమ్మెల్యే గువ్వల బాలరాజు అరెస్ట్..

Achampet : బీఆర్ఎస్ మాజీ ఎమ్మెల్యే గువ్వల బాలరాజును పోలీసులు ముందస్తుగా అరెస్ట్ చేశారు. ఎన్నికల్లో ఓటమి అనంతరం మొదటిసారిగా అచ్చంపేట నియోజకవర్గ పర్యటనకు మాజీ ఎమ్మెల్యే బాలరాజు వస్తున్నారు. అయితే ఈరోజే అచ్చంపేటలో ప్రస్తుత ఎమ్మెల్యే చిక్కుడు వంశీకృష్ణ విజయోత్సవ ర్యాలీ చేపట్టారు. ఈ క్రమంలో గువ్వల బాలరాజు, వంశీకృష్ణ వర్గాలు.. ఎదురుపడి ఘర్షణలు తలెత్తే అవకాశం ఉండడంతో ముందస్తుగా అరెస్టు చేసినట్లు పోలీసులు వెల్లడించారు.


కాగా వెల్దండ వద్ద మాజీ ఎమ్మెల్యే బాలరాజును అడ్డుకున్న పోలీసులు.. అరెస్ట్ చేసి స్టేషన్ కి తరలించారు. ఈ విషయం తెలుసుకున్న బీఆర్ఎస్ నేతలు, కార్యకర్తలు అక్కడికి చేరుకొని.. బాలరాజును విడిచి పెట్టాలంటూ స్టేషన్ ఎదుట బైఠాయించి నిరసన తెలిపారు. చివరికి పోలీసులు గువ్వల బాలరాజును హైదరాబాద్‌లోని నివాసానికి తరలించారు.


Related News

Mother’s Love: అమ్మకు ప్రేమతో.. హ్యాపీ మదర్స్ డే..!

Cm Revanth Reddy: నేడు పాల‌మూరుకు సీఎం.. రూ.110 కోట్ల‌తో ఎలివేటెడ్ కారిడార్ రోడ్డుకు శంకుస్థాప‌న‌!

Pawan Kalyan: ఇష్టం వ‌చ్చిన‌ట్టు మాట్లాడితే తొక్కిప‌ట్టి నార‌ తీస్తాం.. రోజా, కోడాలికి ప‌వ‌న్ స్ట్రాంగ్ వార్నింగ్!

Chadrababu Naidu vs YS Jagan: తిరుమల డిక్లరేషన్ రగడ.. గెలిచిందెవరు?

Chiranjeevi: చిరు చేసిన పనికి గుండె ఆగిపోయినంత పనైంది- తెలుగు హీరోయిన్..!

Krithi Shetty: లైంగిక వేధింపులపై ఉప్పెన బ్యూటీ ఊహించని కామెంట్స్.. అది కావాలంటూ..!

Big Stories

×