BigTV English

Nani-Sandeep: నాచురల్ స్టార్ తో క్రేజీ డైరెక్టర్ లవ్ స్టోరీ.. వర్కవుట్ అవుతుందా ?

Nani-Sandeep: నాచురల్ స్టార్ తో క్రేజీ డైరెక్టర్ లవ్ స్టోరీ.. వర్కవుట్ అవుతుందా ?

Nani-Sandeep: ప్రస్తుతం టాలీవుడ్ ఇండస్ట్రీలో ఎక్కడ చూసినా సందీప్ రెడ్డి వంగ మూవీ గురించి డిస్కషన్ జరుగుతుంది. అర్జున్ రెడ్డి చిత్రంతో వైలెన్స్ తో కూడుకున్న రొమాన్స్ ఎలా ఉంటుందో చూపించిన సందీప్ రెడ్డి.. యానిమల్ చిత్రంతో ఇప్పటి వరకున్న రికార్డులను దాటేశాడు. ఒకపక్క విమర్శించే వారు విమర్శిస్తున్నా.. ఈ మూవీ ఎలాంటి సంచలమైన విజయాన్ని నమోదు చేసిందో అందరికీ తెలుసు. హీరో క్యారెక్టర్ తో పాటు విలన్ క్యారెక్టర్ కి కూడా గుర్తింపు రావడం విశేషం.


ఇక ఈ ఒక్క చిత్రంతో సందీప్ రెడ్డి స్టార్ డైరెక్టర్ అయిపోయాడు అనడంలో ఎటువంటి డౌట్ లేదు. ఈ నేపథ్యంలో రాబోయే చిత్రాలపై సర్వత్రా ఆసక్తి నెలకొంది. యానిమల్ తో పాటు.. థియేటర్లను హౌస్ ఫుల్ చేస్తున్న సినిమా హాయ్ నాన్న. నాచురల్ స్టార్ నాని – మృణాల్ నటించిన ఈ సినిమా మంచి వసూళ్లతో దూసుకెళ్తోంది. తాజాగా హాయ్ నాన్న కలెక్షన్స్ గురించి.. సందీప్ రెడ్డి చేసిన కామెంట్స్ వైరల్ అవుతున్నాయి. వెరైటీగా మూవీ విడుదలైన తర్వాత కూడా ఇంకా యానిమల్‌ ప్రమోషన్‌ కార్యక్రమాలను కంటిన్యూ చేస్తున్నాడు క్రేజీ డైరెక్టర్ సందీప్ రెడ్డి.

తాజాగా తన చిత్రం అందుకున్న విజయంపై మాట్లాడుతూ మధ్యలో నాని గురించి కూడా ప్రస్తావించాడు సందీప్ రెడ్డి. ఇంతకీ అతను ఏమన్నాడంటే.. “నేను డైరెక్టర్ గా పరిచయం కాకముందే ఒక మంచి లవ్ స్టోరీని రాసుకున్నాను. అయితే ఆ స్టోరీ నానికి సూపర్ గా సెట్ అవుతుంది అని భావించాను. అందుకు నానిని కలవడానికి ప్రయత్నించాను. ఒకసారి అతను హోటల్లో ఉన్నాడు అని తెలుసుకుని ఫ్రెండ్ తో కలిసి అక్కడికి వెళ్లిన నేను.. పర్సనల్ పనుల్లో బిజీగా ఉన్న నాని ఆ టైంలో కథ చెప్తే విసుక్కుంటాడేమో అని భయపడి వెనక్కి వచ్చేసాను. ఇక ఆ తర్వాత నానితో ఎప్పుడూ ఆ కథ చెప్పే సందర్భం రాలేదు.. సమయమూ కుదరలేదు. తర్వాత సడెన్ గా అర్జున్ రెడ్డి మొదలుపెట్టేసాను..” అని అన్నాడు.


మరోవైపు హాయ్ నాన్న ప్రమోషన్స్ లో మాట్లాడిన నాని.. యానిమల్‌ లాంటి స్టోరీ ఆఫర్ వస్తే కచ్చితంగా చేస్తాను అని అన్నారు. అంతేకాదు అంతకుమించి వైల్డ్ పాత్ర అయినా తనకు ఎటువంటి ప్రాబ్లం లేదట.. ఇప్పుడు ఇద్దరి మాటలు కలిపి చూస్తే భవిష్యత్తులో కచ్చితంగా సినిమా వస్తుందని తెలుస్తోంది. నాని అభిమానులు కూడా అదే అనుకుంటున్నారు. ప్రస్తుతం ఈ వార్త సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది.

Related News

Janulyri -Deelip Devagan: దిలీప్ తో బ్రేకప్ చెప్పుకున్న జానులిరి … తప్పు చేశానంటూ?

Singer Lipsika: గుడ్ న్యూస్ చెప్పిన సింగర్ లిప్సిక.. కీరవాణి చేతుల మీదుగా?

Alekhya sisters: ఇదేంట్రా బాబూ.. కుక్కలకు, నక్కలకు జీవితం అంకితం అంటోంది?

Movie Tickets : బుక్ మై షోలో లేని టికెట్స్ డిస్ట్రిక్ట్ యాప్‌లో ఎలా వస్తున్నాయి ?

Save the Tigers 3 : ‘సేవ్ ది టైగర్స్’ మళ్లీ వచ్చేస్తుంది.. ఎమ్మెల్యే గా ఘంటా రవి..

BIG TV Kissik talk Show: ఆ డైరెక్టర్ వల్లే నా కెరీర్ మొత్తం నాశనం.. మండిపడ్డ నటి రాశి

BIG TV Kissik talk Show : పదేళ్లుగా పిల్లలు పుట్టలేదు, చివరికి నా ప్రాణాలు ఫణంగా పెట్టి.. రాశి భావోద్వేగం

Sydney Sweeney: సిడ్నీ స్వీని బాలీవుడ్ ఎంట్రీ.. ఏకంగా రూ.530 కోట్లు ఆఫర్.. కళ్లు తేలేసిన నటి!

Big Stories

×