E-Paper
Advertisement

అలియాబాద్‌లో విషాదం.. చెట్టును ఢీకొన్న బైక్, ఇద్దరు యువకులు మృతి

అలియాబాద్‌లో విషాదం.. చెట్టును ఢీకొన్న బైక్, ఇద్దరు యువకులు మృతి
Advertisement

Aliabad Accident: స్వేచ్ఛ బ్యూరో: విధులు ముగించుకుని ఇంటికి బయలుదేరిన ఆ యువకులకు అదే చివరి ప్రయాణమైంది. కాసేపట్లో ఇంటికి చేరుకుంటారనుకున్న సమయంలో మృత్యువు రోడ్డు ప్రమాదం రూపంలో కబళించింది. కళ్లముందే కలలు చెదిరిపోయాయి.. కుటుంబ సభ్యులకు తీరని శోకాన్ని మిగిల్చింది. అలియాబాద్‌లో జరిగిన ఘోర రోడ్డు ప్రమాదంలో ఇద్దరు యువకులు ప్రాణాలు కోల్పోవడం విషాదాన్ని నింపింది.

చెట్టును ఢీకొట్టిన బైక్..

Advertisement

జీనోమ్‌ వ్యాలీ పోలీస్‌స్టేషన్‌ పరిధిలోని అలియాబాద్‌ ఎక్స్‌ రోడ్డు నుంచి గ్రామంలోకి వెళ్లే మార్గంలో హార్డ్‌వేర్‌ షాపు సమీపంలో ఈ ప్రమాదం చోటుచేసుకుంది. ఆర్‌15 ద్విచక్రవాహనం చెట్టును బలంగా ఢీకొనడంతో బైక్‌పై ప్రయాణిస్తున్న ఇద్దరు యువకులు అక్కడికక్కడే మృతిచెందారు. మృతులను జార్ఖండ్‌ రాష్ట్రానికి చెందిన కాస్మోస్‌ (22), సుమిత్‌ (23)గా పోలీసులు గుర్తించారు. కంపెనీలో విధులు ముగించుకుని ఇంటికి వెళ్తుండగా ఈ ప్రమాదం జరిగినట్లు జీనోమ్‌ వ్యాలీ సీఐ గురువయ్య తెలిపారు. ప్రమాదానికి సంబంధించిన దృశ్యాలు సీసీటీవీ కెమెరాల్లో నమోదయ్యాయి.

కేసు నమోదు..

Advertisement

చేతికొచ్చిన వయసులో ఇద్దరు యువకులు మృత్యువాత పడటంతో వారి కుటుంబాల్లో విషాదం నెలకొంది. రెక్కల కష్టంతో జీవనం సాగిస్తూ భవిష్యత్తుపై ఎన్నో ఆశలు పెట్టుకున్న ఆ యువకుల ప్రయాణం అర్ధంతరంగా ముగిసింది. ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.

Also Read: రోడ్లు ధ్వంసంపై సీఎం చంద్రబాబు ఆగ్రహం, ఎమ్మెల్యేల విషయంలో మరింత కఠినంగా వ్యవహరిస్తాం

Tags

Related News

తెలంగాణ పల్లెల్లో మళ్లీ మోగనున్న డప్పు చాటింపులు.. ఎందుకో తెలుసా..?

హైదరాబాద్‌లో టెక్కీ ఆత్మహత్య.. మూడు నెలల కిందట వివాహం, అసలు కారణమేంటంటే..

మాజీ ఐపీఎస్ భార్య తనూజ హత్య కేసు.. నేపాల్ లో నిందితురాలు, రేపో మాపో హైదరాబాద్‌కు!

తెలంగాణ మహిళపై జమ్మూకశ్మీర్‌లో కేసు నమోదు..!

ఎంవీఎస్ఆర్ కాలేజీ దాండియా ప్రమాదంపై.. ఎమ్మెల్యే రాజాసింగ్ కీలక ప్రకటన!

ప్రభుత్వ ఆధ్వర్యంలో జరిగే సదస్సులకు.. సర్కార్ కొత్త నిబంధనలు!

సోషల్ మీడియాలో వైరల్ వీడియోపై.. నిజామాబాద్ పోలీసులు యాక్షన్..!

Big Stories

Advertisement
×