E-Paper
Advertisement

20 ఏళ్ల కష్టం.. రైల్వే స్టేషన్‌ను అందమైన పూలవనంగా మార్చిన వృద్ధ దంపతులు!

20 ఏళ్ల కష్టం.. రైల్వే స్టేషన్‌ను అందమైన పూలవనంగా మార్చిన వృద్ధ దంపతులు!
Advertisement

From a Few Plants to a Garden: రైల్వే స్టేషన్ అంటే రైలు ఎక్కడం, దిగడం, గమ్యస్థానానికి చేరుకోవడం మాత్రమే కాదు.. మనసుకు ప్రశాంతతనిచ్చే అందమైన ప్రదేశంగా కూడా మార్చవచ్చని నిరూపించారు బ్రిటన్‌కు చెందిన వృద్ధ దంపతులు. చిన్నగా కొన్ని మొక్కలు నాటడంతో ప్రారంభమైన వారి ప్రయత్నం.. ఇప్పుడు పూలు, పచ్చదనం, చారిత్రక గుర్తులతో నిండిన అందమైన ఉద్యానవనంగా మారింది. దాదాపు 20 ఏళ్లుగా వారు చేస్తున్న ఈ కృషికి ఇప్పుడు జాతీయ స్థాయిలో గుర్తింపు లభించే అవకాశం వచ్చింది.

కొన్ని మొక్కలతో మొదలైన ప్రయాణం

ఇంగ్లాండ్‌లోని విగాన్ ప్రాంతంలో ఉన్న హిండ్లీ రైల్వే స్టేషన్‌ ను అందంగా మార్చాలని షీలా డేవిడ్‌ సన్, ఆమె భర్త శాండీ డేవిడ్‌ సన్ భావించారు. దాదాపు రెండు దశాబ్దాల క్రితం స్టేషన్ ప్లాట్‌ ఫామ్ పక్కన కొన్ని పూల మొక్కలు నాటాలనే ఆలోచన వారికి వచ్చింది. అప్పట్లో చిన్న ప్రయత్నంగా మొదలైన ఈ పని నెమ్మదిగా విస్తరించింది. ఇప్పుడు స్టేషన్ ప్లాట్‌ఫామ్‌లతో పాటు చుట్టుపక్కల ప్రాంతాల్లోనూ పూల మొక్కలు, రకరకాల మొక్కలు నాటారు.

భార్యకు తోడుగా భర్త.. సమాజం నుంచి సాకారం..

Advertisement

80 ఏళ్ల షీలా డేవిడ్‌సన్ ‘ఫ్రెండ్స్ ఆఫ్ హిండ్లీ స్టేషన్’ టీమ్ లో కీలక వాలంటీర్‌ గా పనిచేస్తున్నారు. మొక్కల పెంపకం, గార్డెన్ మెయింటెనెన్స్ కోసం ఆమె ఎంతో శ్రమిస్తున్నారు. 84 ఏళ్ల శాండీ కూడా భార్యకు అండగా నిలుస్తున్నారు. ఇతరులు విరాళంగా ఇచ్చే మొక్కలను సేకరించడం, వాటిని తోటలో నాటేందుకు సహకరించడం లాంటి పనులు చేస్తున్నారు. ఈ గార్డెన్ లో గులాబీలు, పొద్దుతిరుగుడు పువ్వులు, పాన్సీలు, హైడ్రేంజియాలు లాంటి పలు రకాల మొక్కలు కనిపిస్తాయి. కొన్ని ప్రత్యేకమైన ఎత్తైన మడుల్లో ఉల్లిపాయలు లాంటి కూరగాయలను కూడా పండిస్తున్నారు.

పచ్చదనంతో పాటు స్థానిక చరిత్రకు గుర్తింపు..

1848లో ప్రారంభమైన హిండ్లీ రైల్వే స్టేషన్‌కు ఈ గార్డెన్ కొత్త అందాన్ని తీసుకొచ్చింది. అంతేకాదు, ఆ ప్రాంత చరిత్రను తెలియజేసే శిల్పాలను కూడా తోటలో ఏర్పాటు చేశారు. సమీపంలో గతంలో పనిచేసిన బొగ్గు గనిని గుర్తుచేసే శిల్పాన్ని కూడా ప్రతిష్టించారు.

జాతీయ అవార్డుపై ఆశలు

Advertisement

దంపతుల కృషికి ఇప్పుడు మరో గుర్తింపు లభించే అవకాశం వచ్చింది. ‘వరల్డ్ కప్ ఆఫ్ స్టేషన్స్’ పోటీలో హిండ్లీ స్టేషన్ ‘బెస్ట్ ఇన్ బ్రిటన్’ విభాగానికి నామినేట్ అయింది. ఈ గుర్తింపు తమకు ఎంతో ఆనందాన్ని ఇచ్చిందని షీలా వెల్లడించారు. గత ఏడాది ఈ స్టేషన్‌ను సుమారు 2.5 లక్షల మంది ప్రయాణికులు ఉపయోగించారు. ప్రస్తుతం స్టేషన్‌లో రైల్వే ఎలక్ట్రిఫికేషన్ తో  పాటు పాదచారుల కోసం వంతెన, రెండు ప్రయాణికుల లిఫ్టుల ఏర్పాటు పనులు కూడా జరుగుతున్నాయి.

Read Also:దసరా, దీపావళి ట్రిప్ ప్లాన్ చేస్తున్నారా? ఫారిన్ లో టాప్ టూరిస్ట్ ప్లేసెస్ ఇవే!

Tags

Related News

రోడ్డు అనుకుని బిల్‌బోర్డు వైపు దూసుకెళ్లిన ట్రక్కు.. వామ్మో.. ఇదేం వింత ప్రమాదం?

రైల్లోనే ఫైవ్‌స్టార్ హోటల్ ఎక్స్ పీరియెన్స్.. ‘ప్యాలెస్ ఆన్ వీల్స్’ బాత్రూమ్ చూస్తే ఆశ్చర్యపోవాల్సిందే!

బాబోయ్.. బ్రా ధర రూ. 474 కోట్లా? ఇంతకీ అంత ఖరీదు ఎందుకు బ్రో?

దసరా, దీపావళి ట్రిప్ ప్లాన్ చేస్తున్నారా? ఫారిన్ లో టాప్ టూరిస్ట్ ప్లేసెస్ ఇవే!

రైళ్లలో పెద్ద సౌండ్ పెట్టి ఫోన్ వాడుతున్నారా? అయితే, ఇక షాక్ తప్పదు!

ఇండియన్ టూరిస్టులపై స్విట్జర్లాండ్ స్పెషల్ ఫోకస్.. ఏకంగా జెమీమాతో ప్రమోషన్స్!

విమానంలో బిడ్డ పుడితే ఏ దేశ పౌరసత్వం వస్తుంది? రూల్స్ ఏం చెప్తున్నాయంటే?

Big Stories

Advertisement
×