E-Paper
Advertisement

రోడ్లు ధ్వంసంపై సీఎం చంద్రబాబు ఆగ్రహం, ఎమ్మెల్యేల విషయంలో మరింత కఠినంగా వ్యవహరిస్తాం

రోడ్లు ధ్వంసంపై సీఎం చంద్రబాబు ఆగ్రహం, ఎమ్మెల్యేల విషయంలో మరింత కఠినంగా వ్యవహరిస్తాం
Advertisement

CM Chandrababu: ప్రజాస్వామ్యంలో ఎన్నికలు ఒక భాగమని అన్నారు సీఎం చంద్రబాబు. ఎవరూ ప్రజాస్వామ్యానికి అతీతులు కారని, ఈ విషయం అందరూ గుర్తు పెట్టుకోవాలన్నారు. స్థానిక సంస్థల ఎన్నికలకు ప్రజాస్వామ్యంలో ఎంతో ప్రాముఖ్యత ఉందని గుర్తు చేశారు. అభివృద్ధి పనులను డ్యామేజ్ చేయడంపై మండిపడ్డారు. పల్లె పండుగ పేరుతో వేసిన రోడ్లు ధ్వంసంపై సీఎం చంద్రబాబు ఆగ్రహం వ్యక్తం చేశారు.

రోడ్లు ధ్వంసంపై సీఎం చంద్రబాబు ఆగ్రహం

అభివృద్ధిని చూసి ఓర్వలేక వైసీపీ ఇలాంటి అరాచకాలు పాల్పడుతోందని దుయ్యబట్టారు. తిరుపతి జిల్లా పుల్లంపేట మండల పరిధిలోని అనంత సముద్రం, పాపక్కగారిపల్లె గ్రామాల మధ్య పల్లె పండుగ రోడ్డు ధ్వంసంపై నోరు విప్పారు. ప్రజాధనంతో నిర్మించిన రహదారిని ధ్వంసం చేయడంపై ఒకింత ఆగ్రహం వ్యక్తం చేశారు. వైసీపీ కాలంలో స్థానిక సంస్థల నిధులు మళ్లించారని ఆరోపించారు. దీనివల్ల ఏపీలో 93 కేంద్ర పథకాలను నిలిపి వేశారని అన్నారు. ఫైనాన్స్ కమిషన్ డబ్బులు ఇవ్వడం మానేసిన విషయాన్ని గుర్తు చేశారు.

అమరావతిలో మీడియాతో సీఎం చంద్రబాబు

Advertisement

సోమవారం అమరావతిలోని పార్టీ ఆఫీసులో మీడియాతో మాట్లాడారు సీఎం చంద్రబాబు. జల జీవన్ మిషన్‌ పథకం కింద అన్ని రాష్ట్రాలు లక్షల కోట్లు ఖర్చు చేస్తే, వైసీపీ కేవలం 2 వేల కోట్లు ఖర్చు చేసిందన్నారు. ఆ ప్రాజెక్టుని నిర్వీర్యం చేశారని మండిపడ్డారు. ఇందులో కేంద్రం 45 శాతం, రాష్ట్రం 55 శాతం నిధులు ఖర్చు చేస్తాయని వివరించారు. దగ్గర్లోని రిజర్వాయర్ నుంచి నీళ్లు ప్రతీ ఇంటికి ఇవ్వడమన్నారు. దాన్ని క్యాన్సిల్ చేస్తే, దాన్ని మళ్లీ కొంతవరకు తీసుకొచ్చామన్నారు.

ఎమ్మెల్యే విషయంలో మరింత కఠినంగా వ్యవహరిస్తాం

అదే సమయంలో ఎమ్మెల్యేల గురించి కూడా చెప్పారు. అదే సమయంలో ఎమ్మెల్యేలకు సీరియస్ వార్నింగ్ ఇచ్చారు సీఎం చంద్రబాబు. ఎమ్మెల్యేలు తప్పు చేస్తే ఉపేక్షించడం లేదని, మరింత కఠినంగా వ్యవహరిస్తామన్నారు. మేము ప్రజలకు సేవకులం, పెత్తందారులం కాదన్నారు. ఇది అందరికీ వర్తిస్తుందన్నారు. రాయలసీమ ఒకప్పుడు రాళ్ళ సీమ.. ఇప్పుడు రైజింగ్ సీమ అని చెప్పారు. గ్లోబింగ్ హార్టికల్చర్ హబ్-ఎలక్ట్రానిక్స్-గ్రీన్ ఎనర్జీలతో రతనాల సీమగా మారుతుందని చెప్పుకొచ్చారు.

Advertisement

ALSO READ: ఏపీలో ఎంపీటీసీ, జెడ్సీటీసీల ఎన్నికల ప్రకటన.. బుధవారం నుంచి నామినేషన్లు, అభ్యర్థుల ఖర్చు ఎంతంటే

రాయల్ బుల్లెట్ అక్కడి నుంచే వస్తుందన్నారు. విమాన రంగానికి సంబంధించి కంపెనీలు అక్కడి నుంచే వస్తాయన్నారు. మెగా DSCపై 200 నుంచి 300 సార్లు కోర్టుకు వైసీపీ వెళ్లిందని, నిజంతో ఆడుకుంటే మసైపోతారని హెచ్చరించారు. దీనిపై ఎన్నో ఆరోపణలు చేశారని, కష్టపడి పాసైన వారు ఎంతో ఆవేదన వ్యక్తం చేశారు. కానీ, వీరు చేసిన వారి మనస్సుల్లో ఎప్పటికి నిలిచిపోతుందన్నారు. వివిధ శాఖల్లో కావాల్సిన సిబ్బందిని నియామకాలు చేపట్టామన్నారు.

వైసీపీ ఎంపీ కారులో లిక్కర్, మారణాయుధాలపై నోరు విప్పారు ముఖ్యమంత్రి. అలాగే ఎస్ఈసీని బెదిరించే ప్రయత్నం జగన్ చేశారని అన్నారు. ఈసీ దగ్గర ప్రవర్తించే తీరు ఏంటని ప్రశ్నించారు. సొంతంగా మీడియాను తీసుకెళ్లే సందర్భాలు ఎప్పుడైనా ఉన్నాయా? అంటూ ప్రశ్నల మీద ప్రశ్నలు రైజ్ చేశారు. నేను చెప్పిందే చట్టం అన్నట్లుగా వ్యవహరించారని అన్నారు. ఆనాటి ఎన్నికల గురించి జగన్ మాట్లాడిన విషయాలను వివరిస్తూ, చీల్చి చెండాడారు.

Related News

ఏపీలో ఎంపీటీసీ, జెడ్సీటీసీల ఎన్నికల ప్రకటన.. బుధవారం నుంచి నామినేషన్లు, అభ్యర్థుల ఖర్చు ఎంతంటే..

మైదుకూరు మున్సిపాలిటీ ఎన్నిక వాయిదా, అక్కడ ఏం జరిగింది? మళ్లీ నోటిఫికేషన్ ఇస్తామన్నఎస్ఈసీ

ఉమ్మడి విజయనగరం జిల్లాలో ‘స్థానిక’ రచ్చ.. మేయర్-మున్సిపాలిటీల్లో మూడు పార్టీల అభ్యర్థుల నామినేషన్లు

బస్సు సీటు కోసం కుమ్మేసుకున్నారు.. ఆసుపత్రిలో ఓ కుటుంబం, ఏపీలో షాకింగ్ ఘటన

ఏపీ స్థానిక సంస్థల ఎన్నికలు.. 8 ఛైర్‌పర్సన్లు కూటమి ఏకగ్రీవం! కూలిన దశాబ్దాల నాటి కంచుకోటలు

విశాఖలో డేటా సెంటర్ల నీటి వినియోగంపై గూగుల్-అదానీ కీలక నిర్ణయం, అలా చేస్తారట!

భవానీ భక్తులతో ఎరుపెక్కిన ఇంద్రకీలాద్రి… మహిషాసురమర్ధిని దేవి రూపంలో అమ్మవారు దర్శనం

Big Stories

Advertisement
×