E-Paper
Advertisement

Almont Kid Syrup: ఈ సిరప్ విషపూరితం.. వెంటనే ఆపేయండి.. నిషేధం విధించిన తెలంగాణ డీసీఏ

Almont Kid Syrup: ఈ సిరప్ విషపూరితం.. వెంటనే ఆపేయండి.. నిషేధం విధించిన తెలంగాణ డీసీఏ
Advertisement

Almont Kid Syrup: బిహార్‌కు చెందిన ట్రైడస్‌ రెమెడీస్‌ కంపెనీకి చెందిన ఆల్మంట్ కిడ్ సిరప్ వినియోగంపై తెలంగాణ డ్రగ్ కంట్రోల్ అడ్మినిస్ట్రేషన్ నిషేధం విధించింది. పిల్లలకు వాడే ఈ సిరప్‌లో విషపూరితమైన ఇథిలీన్‌ గ్లైకాల్‌ ఉన్నట్టు డ్రగ్ కంట్రోల్ అధికారులు గుర్తించారు. ఈ సిరప్ వినియోగం ప్రాణాంతకమని నోటీసులు జారీ చేశారు. ఈ సిరప్‌ వాడకం వెంటనే నిలిపివేయాలని తెలంగాణ డీసీఏ సూచించింది. సిరప్ మీ దగ్గర ఉంటే టోల్‌ ఫ్రీ నంబర్‌ 1800 599 6969కు ఫిర్యాదు చేయాలని కోరింది. పిల్లలకు వాడే సిరప్ కావడంతో తల్లిదండ్రులు ఉండాలని సూచించింది.

ఆల్మంట్ కిడ్ సిరప్ బ్యాచ్ నంబర్ AL-24002లో ఇథిలీన్ గ్లైకాల్ అనే విషపూరిత కల్తీ రసాయనం కలిసినట్లు డీసీఏ గుర్తించింది. ఈ సిరప్‌లో ఇథిలీన్ గ్లైకాల్ ఉన్నట్లు కోల్‌కతాలోని డ్రగ్స్ స్టాండర్డ్ కంట్రోల్ ఆర్గనైజేషన్ రాష్ట్రాలకు హెచ్చరిక జారీ చేసింది. ఈ హెచ్చరికతో రాష్ట్రాల డీసీఏలు సిరప్ నిషేధం విధిస్తున్నాయి.

ఇథిలీన్ గ్లైకాల్ విషపూరితం

Advertisement

ఇథిలీన్ గ్లైకాల్ విషపూరితమైన కల్తీ పదార్థమని డీసీఏ హెచ్చరించింది. ఈ సిరప్ ఆరోగ్య సమస్యలు తలెత్తుతున్నాయని అధికారులు తెలిపారు. ఈ మేరకు తెలంగాణ డ్రగ్స్ కంట్రోల్ అడ్మినిస్ట్రేషన్ డైరెక్టర్ జనరల్ షానవాజ్ ఖాసీం శనివారం ఓ ప్రకటన జారీ చేశారు. ప్రభావిత బ్యాచ్‌ సిరప్ లను వెంటనే సీజ్ చేయాలని ఆదేశించారు. ప్రజారోగ్యాన్ని కాపాడటానికి ప్రజలు సహకారించాలని కోరారు.

డ్రగ్స్ ఇన్స్పెక్టర్లు తనిఖీలు

తెలంగాణ వ్యాప్తంగా డ్రగ్స్ ఇన్స్పెక్టర్లు, అసిస్టెంట్ డైరెక్టర్లు.. అన్ని రిటైల్, హోల్‌సేల్ దుకాణాలు, వ్యాపారులు, ఆసుపత్రులను వెంటనే అప్రమత్తం చేయాలని డీసీఏ ఆదేశించింది. ఈ బ్యాచ్ కు సంబంధించిన స్టాక్‌ ఉంటే వెంటనే సీజ్ చేయాలని తెలిపింది. ఆల్మంట్ సిరప్ ను ఎట్టిపరిస్థితుల్లో పంపిణీ చేయకుండా లేదా విక్రయించకుండా చూసుకోవాలని డీసీఏ ఆదేశించింది.

Advertisement

Also Read: Cough Syrup Warning: పిల్లలకు కఫ్ సిరప్ ఇవ్వకూడదు.. డాక్టర్ల హెచ్చరిక! ఇలా చేస్తే చాలు

కోల్డ్ రిఫ్ కూడా

గతేడాది మధ్యప్రదేశ్, రాజస్థాన్‌లలో కోల్డ్‌రిఫ్ సిరప్ వినియోగంతో పిల్లల మరణాలు సంభవించాయి. దీంతో అప్పట్లో తెలంగాణ డ్రగ్స్ కంట్రోల్ అడ్మినిస్ట్రేషన్ బ్యాచ్ నెం. SR-13 కోల్డ్‌రిఫ్ సిరప్ పై నిషధం విధించిన సంగతి తెలిసిందే. తాజాగా ఆల్మంట్ సిరప్ నిషేధం విధించింది.

Related News

హైదరాబాదీలకు షాక్.. రేపటి నుంచి క్యాబ్‌లు, ఫుడ్ డెలివరీలు బంద్!

Chief Secretary: తెలంగాణ సచివాలయంలో సమన్వయ లోపం?.. అధికారుల సీక్రెట్ మీటింగ్స్!

Rain Prayers: వర్షాల కోసం కుకుట్లపల్లి విద్యార్థుల వినూత్న ప్రార్థన!

భాగ్యనగరంలో భారీ వర్షం.. ఆయా ప్రాంతాల్లో నిలిచిపోయిన ట్రాఫిక్!

TET Notification: తెలంగాణ ఉపాధ్యాయులకు బిగ్ అప్‌డేట్.. ప్రత్యేక టెట్ నోటిఫికేషన్ విడుదల!

రూ. 1,400 కోట్ల లెక్కలు చెప్పి మాట్లాడు.. హరీష్‌రావును ఉతికి ఆరేసిన ఉత్తమ్!

Lorry Accident: రోడ్డుపై లారీ బోల్తా.. వెల్లుల్లి సంచులను ఎత్తుకెళ్లిన స్థానికులు.. ఎక్కడంటే?

RTA Brokers: రండి సార్.. లైసెన్సా? ఆర్‌సీనా?.. ఖైరతాబాద్ RTAలో బ్రోకర్ల నయా దందా!

Big Stories

Advertisement
×