E-Paper
Advertisement

అనిరుధ్ – కావ్యా మారన్ పెళ్లి రిసెప్షన్.. సీఎం రేవంత్, కేటీఆర్‌కు ఆహ్వానం!

అనిరుధ్ – కావ్యా మారన్ పెళ్లి రిసెప్షన్.. సీఎం రేవంత్, కేటీఆర్‌కు ఆహ్వానం!
Advertisement

Anirudh Kavya Maran Wedding: ప్రముఖ సంగీత దర్శకుడు అనిరుధ్ రవిచందర్, సన్ రైజర్స్ హైదరాబాద్ టీమ్ సీఈఓ కావ్యా మారన్ పెళ్లి చేసుకోనున్న సంగతి తెలిసిందే. నవంబర్ 21న చెన్నై వేదికగా జరగనున్న వీరి వివాహ రిసెప్షన్ కు హాజరు కావాలని.. సీఎం రేవంత్ రెడ్డికి ఆహ్వానం అందింది. సన్ గ్రూప్ ఛైర్మన్ కళానిధి మారన్ దంపతులు స్వయంగా జూబ్లీహిల్స్ లోని సీఎం నివాసానికి వెళ్లి.. రేవంత్ దంపతులను రిసెప్షన్ కు ఆహ్వానించారు. తమ కూతురు వివాహ విందుకు రావాలని కోరుతూ ఆహ్వాన పత్రికను అందజేశారు.

మరోవైపు బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ కు సైతం ఆహ్వానం అందింది. కేటీఆర్ తో పాటు ఆయన భార్య శైలిమను కలిసిన కళానిధి మారన్ దంపతులు.. తమ బిడ్డ రిసెప్షన్ కు రావాల్సిందిగా కోరారు. దీనిపై కేటీఆర్ దంపతులు తమ సుముఖుతను వ్యక్తం చేసినట్లు తెలుస్తోంది. ఈ సందర్భంగా కాబోయే వధూవరులకు కేటీఆర్ దంపతులు.. ముందస్తు శుభాకాంక్షలు తెలియజేశారు.

Advertisement

Also Read: Brahmamudi Serial Today Episode October 17th ‘బ్రహ్మముడి’ సీరియల్‌:  అపర్ణ రాసిన లెటర్ శేషు జీవితాన్ని మలుపు తిప్పుతుందా..? 

Advertisement

ఇదిలా ఉంటే అనిరుధ్, కావ్యా మారన్ ప్రేమ, పెళ్లి గురించి గత కొద్ది కాలంగా నెట్టింట విపరీతంగా చర్చ జరుగుతోంది. వారిద్దరు ప్రేమలో ఉన్నట్లు పెద్ద ఎత్తున బజ్ వినిపిస్తూ వచ్చింది. తొలుత ఈ వార్తలను అనిరుధ్ ఖండించారు. తాజా ఆహ్వానాలతో ఈ ప్రచారం నిజమేనని వెల్లడైంది. అయితే రిసెప్షన్ తేదీని ఖరారు చేసినప్పటికీ.. పెళ్లి ఎప్పుడన్న దానిపై క్లారిటీ రాలేదు. నవంబర్ 10 లేదా 11 తేదీల్లో గ్రీస్ లో వీరి డెస్టినేషన్ మ్యారేజ్ జరగనున్నట్లు జోరుగా ప్రచారం జరుగుతోంది. అయితే పెళ్లి తేదీపై ఇరు కుటుంబాల నుంచి అధికారిక ప్రకటన రావాల్సి ఉంది. కాగా, ఈ వివాహ రిసెప్షన్ కు సినీ, క్రీడా, రాజకీయ, వ్యాపార ప్రముఖులు పెద్ద ఎత్తున హాజరయ్యే పరిస్థితులు కనిపిస్తున్నాయి.

Also Read: Nindu Noorella Saavasam Serial Today Episode October 17th‘నిండు నూరేళ్ల సావాసం’ సీరియల్‌: పార్థు హత్య కేసు నుంచి మనోహరి ఎస్కేప్ అవుతుందా..? 

Tags

Related News

ఎల్‌నినో ఎఫెక్ట్‌.. తెలుగు రాష్ట్రాలకు రానున్న అతిపెద్ద గండం ఇదే?

భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో వింత దృశ్యం.. మిరప తోటల్లో సినీ తారల ఫ్లెక్సీలు!

కళ్యాణలక్ష్మి, షాదీముబారక్ పథకాలపై సుప్రీంకోర్టు కీలక ఆదేశాలు!

నకిలీ యూఎల్‌సీ పత్రాలతో రిజిస్ట్రేషన్లు దందా కలకలం

తెలంగాణ సర్కార్ సంచలన నిర్ణయం.. మారనున్న ప్రభుత్వ పాఠశాలల రూపురేఖలు!

తెలంగాణలో హ్యుందాయ్ బిగ్ ప్లాన్.. రూ.8,528 కోట్లతో మెగా ప్రాజెక్ట్.. సీఎం రేవంత్ కీలక విజ్ఞప్తి!

నీ డేటా మొత్తం నా దగ్గర ఉంది పరేషాన్ కాకు.. కేటీఆర్‌ పై గజ్జెల కాంతం ఫైర్!

Big Stories

Advertisement
×