Nindu Noorella Saavasam Serial Today Episode: గార్డెన్లో ఉన్న అమర్ మిస్సమ్మతో వైజయంతి చేస్తున్న ఎంక్వైరీ గురించి మాట్లాడతాడు. ఆమె చేస్తున్న ఎంక్వైరీలో తాను ఒకటి గమనించానంటాడు. వైజయంతి మేడం మనోహరినే ఎక్కువగా ఫోకస్ చేసినట్టు ఉంది. మనోహరిని అనుమానిస్తున్నట్టు కూడా ఉంది అని అమర్ చెప్పగానే.. అవునండి నేను అదే అనుకుంటున్నాను అంటుంది మిస్సమ్మ. మరోవైపు రూంలో ఉన్న మనోహరి కూడా ఆలోచిస్తూ… నన్నే టార్గెట్ చేస్తావా..? అసలు నేనేంటో నీకు ముందు ముందు చూపిస్తా వైజయంతి అని మనసులో అనుకుంటూ కోపంగా చూస్తుంది మనోహరి.
మరుసటి రోజు ఉదయం రాథోడ్ కారు తుడుస్తూ ఉంటాడు. గార్డెన్లో చంభా పని చేస్తుంది. అది చూసిన రాథోడ్ ఆశ్చర్యపోతూ.. యాదమ్మ రాత్రి నీకేమైనా పిచ్చి కుక్క కరిచిందా..? అని అడిగితే కోపంగా చూస్తూ.. నేనే మంత్రించిన కుక్కలతో మనుషులను కరిపిస్తుంటాను.. నన్ను కుక్క కరవడం ఏంటి..? అని మనసులో అనుకుంటూ ఏం లేదు ఎందుకు అడుగుతున్నావు రాథోడ్ నీకు రాత్రి కల ఏమైనా వచ్చిందా అని అడుగుతుంది చంభా.. ఏం లేదు ఎప్పుడూ లేనిది ఇవాళ చాలా సిన్సియర్‌గా పని చేస్తున్నావు కదా అందుకే డౌటు వచ్చింది అంటాడు రాథోడ్. దాంతో చంభా కోపంగా ఏం మాట్లాడుతున్నావు రాథోడ్ నేను ఎప్పుడూ పని చేయలేదా..? అంటుంది.
నువ్వు నెల నెల శాలరీ తీసుకోవడం చూశాను కానీ పని చేయడం చూడలేదు అందుకే అడిగాను అంటాడు రాథోడ్. అందుకు చంభా కోపంగా చూస్తూ.. నువ్వు పనోడివే.. నేను పనిమనిషినే కాస్త మర్యాదగా ఉండు అంటుంది. అందుకు రాథోడ్ నేను ఎంప్లాయిని.. నువ్వు పనిమనిషివి అంటాడు రాథోడ్. అయితే నీకైమైనా సీనిమా హీరోలకు ఇచ్చినట్టు కట్టల కట్టల డబ్బులు ఇస్తారా ఏంటి..? నీకు కూడా నాలాగే ఇస్తున్నారు కదా అంటూ చెప్తుంటే.. కారు వస్తుంది అందులోంచి ముగ్గురు వ్యక్తుల దిగి ఇంట్లోకి వస్తుంటే రాథోడ్ ఆపేసి ఎవరని అడుగుతాడు.. తాము కోల్‌కతా మథర్ థెరిస్సా ఆశ్రమం నుంచి వచ్చామని మనోహరి కోల్ కతాలో ఉన్నప్పుడు మా ఆశ్రమానికి ఎంతో సేవ చేసిందని మనోహరికి చాలా నష్టం జరిగిందని తెలిసి వచ్చాము అంటాడు. వాళ్లను రాథోడ్ ఇంట్లోకి రమ్మని తీసుకెళ్తాడు.
హాల్లో మిస్సమ్మ కాఫీ ఇస్తే తాగుతూ ఉంటాడు అమర్. అప్పుడే నన్స్ను తీసుకుని లోపలికి వెళ్తాడు రాథోడ్. వాళ్ల గురించి అమర్‌కు చెప్తాడు. అమర్ వాళ్లను కూర్చోబెట్టి ఏంటి విషయం అని అడిగితే.. మనోహరి గురించి మొత్తం చెప్పి తాము మనోహరిని కోల్ కతా తీసుకెళ్లడానికి వచ్చామంటారు. ఆ మాటలకు రాథోడ్ అబ్బ మనోహరి ఇది నీ ప్లానే అని మనసులో అనుకుంటాడు. చంభా కూడా బలేగా ఎస్కేప్ అవుతున్నావు మనోహరి. అని మనసులో అనుకుంటుంది. అమర్ ఆశ్చర్యంగా తీసుకెళ్లడం ఏంటి అని ప్రశ్నిస్తే.. ఆ ముగ్గురు అవును సార్ మనోహరిని మేము కోల్ కతా తీసుకెళ్లడానికే వచ్చాము అని చెప్తారు. మనోహరి ఎక్కడుంది సార్ అని అడిగితే అమర్, రాథోడ్‌ను వెళ్లి మనోహరిని తీసుకురమ్మని చెప్తాడు. రాథోడ్, మనోహరి రూంలోకి వెళ్లి చూసి షాక్ అవుతాడు. ఇంతటితో నేటి నిండు నూరేళ్ల సావాసం సీరియల్ ఎపిసోడ్ అయిపోతుంది.