E-Paper
Advertisement

Brahmamudi Serial Today Episode October 17th ‘బ్రహ్మముడి’ సీరియల్‌:  అపర్ణ రాసిన లెటర్ శేషు జీవితాన్ని మలుపు తిప్పుతుందా..? 

Brahmamudi Serial Today Episode October 17th ‘బ్రహ్మముడి’ సీరియల్‌:  అపర్ణ రాసిన లెటర్ శేషు జీవితాన్ని మలుపు తిప్పుతుందా..? 
Advertisement

Brahmamudi serial today Episode: రాత్రి పన్నెండు కావడంతో లెటర్స్‌ చదివిన ఒక్కొక్కరు గార్డెన్‌లోకి వెళ్తుంటారు. శేషు కూడా నిద్రలేచి కొత్త డ్రెస్‌ వేసుకుని సెంట్‌ కొట్టుకుని రెడీ అవుతుంటే భ్రమరాంబ కళ్లు తెరచి చూస్తుంది. శేషు, భ్రమరాంబను గమనించకుండా హుషారుగా పాట పాడుతూ రెడీ అవుతాడు. గెంతులేస్తూ బయటకు వెళ్తాడు. రాజు కూడా లేచి గార్డెన్‌లోకి వెళ్లి ఇందు ఎక్కడ అని చూస్తుంటాడు. ఇందు అని పిలుస్తూ.. నన్ను ఈ టైంకే రమ్మంది తను ఇంకా రాలేదు.. లేకపోతే ఎక్కడైనా దాక్కుందా అనుకూంటూ వెతుకుతాడు.

తన జీవితంలో ఎప్పుడూ ఇంతలా ఎదురుచూడలేదు అనుకుంటాడు. శేషు కూడా తలుపు తెరుచుకుని బయటకు వచ్చి వసంత.. వసంత అంటూ పిలుస్తూ.. వసంత ఎక్కడికి వెళ్లింది నన్ను ఇక్కడికే కదా రమ్మంది అనుకుంటూ శేషు కూడా పనిమనిషి వసంత కోసం వెతుకుతుంటాడు. అప్పుడే భ్రమరాంబ బయటకు వస్తుంది. భ్రమరాంబను చూసిన శేషు భయంతో దాక్కుందామని కారు చాటుకు వెళ్తాడు. అక్కడ రాజు ఉండటం చూసి షాక్‌ అవుతాడు. తర్వాత ఇందు వస్తుంది. రాజు వెతుకుతూ గార్డెన్‌లోకి వెళ్తుంది. అప్పుడే నందు, వెంకీ ఒకరినొకరు వెతుక్కుంటారు.. రేఖ కూడా భూషణ్‌ రమ్మన్నాడు రూంలో కూడా తను లేడు అనుకుంటూ బయటకు వస్తుంది. భూషణ్‌ కూడా వస్తాడు. రేఖ, భూషణ్‌ ఇద్దరూ భ్రమరాంబను చూసి దాక్కుంటారు. అప్పుడే పనిమనిషి వసంత బయటకు వస్తుంది. ఇందు, నందును చూసి షాక్‌ అవుతుంది. అపర్ణ, సుభాష్‌ మాత్రం కిటికీలోంచి అంతా గమనిస్తుంటారు.

Advertisement

శేషును చూసి రాజు, నందును చూసి ఇందు కారు చాటుకు వెళ్లి ఒకరినొకరు చూసుకుని షాక్‌ అవుతారు. లెటర్‌ రాసింది నువ్వంటే నువ్వని.. మనసులో మాట చెప్తానన్నావు ఏంటో చెప్పమని ఒకరిని ఒకరు అనుకుంటారు. చివరకు ఆ లెటర్‌ ఎవరు రాశారు అని అనుమానిస్తారు. మరోవైపు వెంకీ భయపడుతూ నందుకు ఎలాగైనా ఇవాళ నో అని చెప్పేస్తానని మనసులో అనుకుంటూ వెళ్లి నందు ఎదురుపడతాడు. నువ్వెం చెప్పాలనుకున్నావో ధైర్యంగా చెప్పు అంటూ నందు అడుగుతుంది. వీళ్లిద్దరూ కూడా లెటర్‌ నువ్వు రాశావంటే నువ్వు రాశావని ఒకరిని ఒకరు అనుకుంటారు. రేఖ, భూషణ్‌ కూడా ఒకరిని ఒకరు చూసుకుని లెటర్‌ ఎందుకు రాశావని ఒకరిని ఒకరు అనుకుంటారు. అక్కడి నుంచి వెళ్లిపోవడానికి ప్రయత్నిస్తుంటే ఒకవైపు భ్రమరాంబ, మరో పక్క నందు, వెంకీలను చూసి ఆగిపోతారు.

వసంత, శేషు దగ్గరకు వెళ్తుంది. అది చూసి భ్రమరాంబ వెళ్లి రెడ్‌ హ్యాండెడ్‌గా పట్టుకుని వాళ్లను లాక్కుని అరుస్తూ లోపలికి వెళ్తుంది. వాళ్లను చూసి అందరూ అక్కడికి పరుగెత్తుకుంటూ వెళ్తారు. అందరూ అక్కడ గమిగూడటం చూసి సుభాష్‌, అపర్ణ షాక్‌ అవుతారు. నువ్వు చేసిన లెటర్‌ నిర్వాకం చూశావా ఎలా మారిపోయిందో అంటాడు సుభాష్‌. అందరినీ అనుమానంగా చూసిన భ్రమరాంబ ఈ టైంలో మీరేంటి అంటూ అడుగుతుంది. శేషును తిడుతుంది.. పని మనిషికి శేషుకు సంబంధం అంటగట్టి ఏడుస్తుంది. అపర్ణ వెళ్లి ఏంటిది అని అడుగుతుంది. పనిమనిషి వసంత లెటర్‌ గురించి చెప్తుంది అందరూ ఒకరినొకరు అనుమానంగా ఆ లెటర్‌ నువ్వు రాయలేదా..? అంటే నువ్వు రాయలేదా అనుకుంటూ ఉంటారు. అపర్ణ అందరినీ తిట్టి లోపలికి పంపిచేస్తుంది.

Advertisement

ఆఫీసుకు వెళ్లిన ఐశ్వర్యకు ఎదురుగా శృతి వస్తుంది గుడ్‌మార్నింగ్‌ చెప్తుంది. శృతిని చూసి ఐశ్వర్య మీరింకా జాబ్‌లోనే ఉన్నారా..? అంటూ వెళ్లిపోండి అని చెబితే.. మేనేజర్‌ వచ్చి వీళ్లను ఉద్యోగంలోంచి తీసేసే రైట్స్‌ ఐశ్వర్యకు లేవని చెప్తాడు. దీంతో ఐశ్వర్య కోపంగా ఇంటికి వెళ్లి గొడవ చేస్తుంది.. తన కంపెనీలో తనకు రైట్స్‌ లేవని అధికారం లేదని బాధపడుతుంది. దీంతో భ్రమరాంబ మరీ ఇంత అవమానమా..? అంటుంది. ఈ ఐశ్వర్యను నమ్మి కంపెనీ అప్పగిస్తే ఒక్కరోజులోనే సీనియర్‌ స్టాప్‌ను తీసేసింది. ఇలాగే కొనసాగితే కంపెనీని దివాలా తీయిస్తుంది అంటూ ఇందు చెప్తుంది. దీంతో ఇవాళ్టీ బ్రహ్మముడి ఏపిసోడ్‌ అయిపోతుంది.

ALSO READ: మిథున రాశిలోకి శుక్రుడు – ఆ ఐదు రాశులకు గజలక్ష్మీ యోగం – అపర కుబేరులు అవ్వడం ఖాయం

 

Related News

Saturday TV Movies : శనివారం టీవీ సినిమాలు.. మూవీ లవర్స్ కు జాతరే..

Nindu Noorella Saavasam Serial Today Episode October 17th‘నిండు నూరేళ్ల సావాసం’ సీరియల్‌: పార్థు హత్య కేసు నుంచి మనోహరి ఎస్కేప్ అవుతుందా..? 

సోషల్ మీడియాని షేక్ చేస్తున్న నల్గొండ గద్దర్ నరసన్న.. రమణిలో బతుకమ్మ పాటతో రచ్చ!

మాధురి రాథోడ్ లైఫ్‌లో జరిగినదే పాటలో ఉందా? ‘భామ సుందరా’ గ్లింప్స్ వైరల్!

త్రిగుణ్ ధూత.. వైల్డ్ కార్డ్స్ కి ఊహించని దెబ్బ..ఇది కదా అసలు గేమ్ అంటే?

సింగర్ కనకవ్వ పాటలకు అంత క్రేజ్ ఎందుకు?

మాట నిలబెట్టుకున్న వైవా హర్ష.. జబర్దస్త్ బాబుకి కళ్ళు చెదిరే గిఫ్ట్!

Big Stories

Advertisement
×